Karthika Amavasya:అదృష్టం వరించాలంటే కార్తీక అమావాస్య రోజు తప్పనిసరిగా వీటిని దానం చేయాలి-things you must donate on this karthika amavasya on 1st december 2024 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Karthika Amavasya:అదృష్టం వరించాలంటే కార్తీక అమావాస్య రోజు తప్పనిసరిగా వీటిని దానం చేయాలి

Karthika Amavasya:అదృష్టం వరించాలంటే కార్తీక అమావాస్య రోజు తప్పనిసరిగా వీటిని దానం చేయాలి

Ramya Sri Marka HT Telugu
Nov 30, 2024 08:09 AM IST

Karthika Amavasya: హిందువులు పవిత్రమైనదిగా భావించే కార్తీక అమావాస్య ఈసారి 1, డిసెంబర్ 2024న వచ్చింది. అదృష్టం వరించాలంటే కార్తీక అమావాస్య రోజున తప్పనిసరిగా దానం చేయాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం.

కార్తీక అమావాస్య రోజు తప్పనిసరిగా వీటిని దానం చేయాలి
కార్తీక అమావాస్య రోజు తప్పనిసరిగా వీటిని దానం చేయాలి

జ్యోతిష్య శాస్త్రంలో కార్తీక అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. భక్తికీ, చిత్తశుద్దికీ అంకితం చేయబడిన మాసాల్లో కార్తీక మాసం అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో చేసిన పూజలు, వ్రతాలు, దానధర్మాలకు ఊహించని ఫలితాలు దక్కుతాయి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం శని గ్రహానికి కార్తీక అమావాస్యతో దగ్గరి సంబంధం ఉంటుంది. శని ద్వారా వచ్చే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనేందుకు వాటి నుంచి బయటపడేందుకు పరిహారాలు చేయాల్సి వస్తే వాటికి కార్తీక మాసం చాలా అనువైనది.ఈ మాసంలో చేసిన పనుల ఫలితం వ్యక్తుల చుట్టూ సానుకూల శక్తులను పెంచుతుంది. అదృష్టాన్ని, కీర్తి, సంపద, ఆనందాన్ని తెచ్చిపెడుతుందని ధృఢ నమ్మకం. జీవితంలో దుష్ప్రభావాలను తగ్గించుకుని అదృష్టాన్ని వరించేందుకు కార్తీక మాసంలో తప్పనిసరిగా దానం చేయాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

కార్తీక అమావాస్య రోజు తప్పనిసరిగా దానం చేయాల్సినవి:

1. నల్ల నువ్వులు:

కార్తీక అమావాస్య రోజు నల్ల నువ్వులు దానం చేయడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. హిందూ పురాణాల ప్రకారం నువ్వులు శుద్ధి చేసే లక్షణాను కలిగి ఉంటాయి. ఇవి మనస్సు, శరీరం, ఆత్మను శుభ్రపరచడంలో ఇవి సహాయపడతాయి. వీటిని దానం చేయడం వల్ల శాంతి, శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయని నమ్ముతారు. కార్తీక అమావాస్య రోజు పేదవారికి లేదా బ్రాహ్మణుడికి కొన్ని నల్ల నువ్వులను దానం చేయండి.

2. ఆహారం:

అన్ని దానాల కన్నా అన్న దానం గొప్పది అంటారు. ఎదుటి వ్యక్తి ఆకలి తీర్చడం వల్ల అధిక పుణ్యఫలం దక్కుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం ఆకలితో ఉన్నవారికి, పేదవారికి ఆహారం ఇవ్వడం వల్ల దేవుడి ఆశీర్వాదాలు లభించి శ్రేయస్సు, సంతోషం, కీర్తి వంటి శుభఫలితాలు తప్పక లభిస్తాయి. కార్తీక అమావాస్య రోజు స్థానిక దేవాలయం, అనాథాశ్రమం, పేద కుటుంబీలకు భోజనం, పండ్లు లేదా ధాన్యాలను దానం చేయండి.

3. దుప్పట్లు, దుస్తులు:

కార్తీక అమావాస్య శీతాకాలంలో వస్తుంది. కనుక ఈ రోజు దుప్పట్లు, వెచ్చటి దుస్తులు వంటివి దానం చేయడం మంచిది. హిందూ మత సిద్ధాంతాల ప్రకారం అవసరం లేని వారికి దానం చేసే కన్నా వస్తువులు లేని వారికి అవసరమైన వారికి దానంగా ఇవ్వడం వల్ల అధిక పుణ్యఫలం దక్కుతుంది. కార్తీక అమావాస్య రోజు పేదవారికి దుప్పట్లు, వెచ్చటి దుస్తులను దానంగా ఇచ్చి మీ జీవితాన్ని శ్రేయస్సు, అదృష్టం వరించేలా చేయండి.

4. నెయ్యి:

నెయ్యి దానం చేయడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం నెయ్యి మనస్సును, ఆత్మను శుభ్రపరచడంల సహాయడే లక్ణణాలు కలిగి ఉంటుంది. నెయ్యిని దానం చేయడం వల్ల శాంతి, శ్రేయస్సు, కీర్తి, అదృష్టం కలుగుతాయని నమ్మిక. కార్తీక అమావాస్య రోజు స్థానిక దేవాలయానికి లేదా నిరుపేద వ్యక్తికీ నెయ్యి సీసాను దానంగా ఇవ్వండి.

5. ఇనుప పాత్రలు:

కార్తీక అమావాస్య రోజు ఇనుప పాత్రలను దానం చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం ఇనుము మనస్సును, ఆత్మను శుద్ధిచేసే లక్షణాలు కలిగి ఉంటుంది. వీటిని దానం చేయడం వల్ల వ్యక్తికి శాంతి, శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయని నమ్ముతారు. కార్తీక అమావాస్య రోజు పేదవారికి గిన్నెలు, గరిటెలు, పాత్రలు వంటి ఇనుప వస్తువులను దానం చేయండి.

6. పశువుల దాణా:

పుశువుల ఆహారం ఇవ్వడం ఆ దేవుడికి ఆహారం ఇవ్వడం ఒక్కడే అని నమ్ముతారు హిందువులు. పవిత్రమైన జంతువులకు, ముఖ్యంగా ఆవులకు ఆహారం తినిపించడం అత్యంత ప్రతిఫలదాయకమైన కార్యం. కార్తీక అమావాస్య రోజు పశువులకు ఆహారం దానంగా ఇవ్వడం వల్ల శ్రేయస్సు, నెరవేర్పు భావన, దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజు స్థానికి ఆవుకు ఎండుగడ్డి, ధాన్యాలు వంటి పశువుల దాణాను దానంగా ఇవ్వండి.

(గమనిక: ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం పూర్తిగా సత్యం, ఖచ్చితమైనదని మేము చెప్పడంలేదు. వేరు వేరు వెబ్ సైట్లు, నిపుణుల సలహాల మేరకు వీటిని పొందుపరుస్తున్నాం. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు దీనికి బాధ్యత వహించదు. వీటిని పాటించేముందు సంబంధిత రంగంలోని నిపుణులను సంప్రదించండి.)

Whats_app_banner