Saturn Transit: శని కదలికలో మార్పు- ఈ రాశుల వారికి మాములుగా కలిసి రావడం లేదు- ఎక్కడ చూసినా డబ్బే, ఏం చేసినా డబ్బే
Saturn Retrograde:శని భగవానుడి ప్రత్యక్ష ప్రయాణం ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే దీని ద్వారా రాజయోగం పొందుతున్న కొన్ని రాశులు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఆర్థికంగా బాగా కలిసొస్తుంది.
శని తొమ్మిది గ్రహాలలో నీతిమంతుడు. వ్యక్తులు చేసే పనిని బట్టి ప్రతిఫలాలను తిరిగి ఇవ్వగలడు. అన్నింటికీ రెట్టింపు లాభాలు, నష్టాలు ఇస్తాడు. నవగ్రహాలలో శని అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం. కాబట్టి ప్రతి ఒక్కరూ శనికి భయపడతారు.శని ఒక రాశి నుండి మరో రాశికి మారడానికి 2 1/2 సంవత్సరాలు పడుతుంది. కర్మ వీరుడు శని 30 సంవత్సరాల తరువాత తన సొంత రాశి అయిన కుంభ రాశిలోకి ప్రయాణిస్తున్నాడు. ఏడాది పొడవునా ఒకే రాశిలో ప్రయాణిస్తాడు. తిరిగి 2025 లో తన స్థానాన్ని మార్చుకుంటాడు. నవంబర్ 15న శని తన సొంత రాశి అయిన కుంభ రాశిలో అడుగుపెట్టారు. శని భగవానుడి ప్రత్యక్ష ప్రయాణం ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు దీని ద్వారా రాజయోగాన్ని పొందుతున్నారు. ఆ రాశులేవో తెలుసుకుందాం.
మకరం
మకర రాశి వారికి శని గ్రహ సంచారం చాలా బాగా కలిసి వస్తుంది. దీనివల్ల మీ పెండింగ్ పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. రాదనుకున్న డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. రుణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. పనిచేసే చోట ప్రమోషన్, కొత్త అవకాశాలు లభిస్తాయి. అందరూ మిమ్మల్ని పొగుడుతారు. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి.
వృషభరాశి
వృషభ రాశిలోని పదవ స్థానంలో శని తిరోగమనంలో ఉంది. దీనివల్ల మీ వ్యాపారంలో అన్ని సమస్యలు తొలగిపోతాయి. మీకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సహోద్యోగులు మీకు అనుకూలంగా పని చేస్తారు.పై అధికారులు మీకు పని ప్రదేశంలో పూర్తి సహకారం అందిస్తారు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో చాలా లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికొస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి.
కన్య రాశి
కుంభ రాశిలో శని ప్రయాణం కన్యా రాశి వారికి మంచి ఫలితాలను అందిస్తుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. రుణ సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.మంచి ఫలితాలు వస్తాయి. మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు లభిస్తాయి. కొత్త బాధ్యతలతో పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో చాలా లాభం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలన్నీ తగ్గుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.