Spiritual Plants: ఇంట్లో ఈ 5 మొక్కలు నాటి మీ ఆరోగ్యాన్ని, పాజిటివినీ మెరుగుపరుచుకోండి
Spiritual Plants: తరతరాలుగా మన పూర్వీకులు ఇంట్లో పాజిటివిటీని పెంచుకునేందుకు ఈ మొక్కలు నాటుకునే వారనే విషయం అందరికీ తెలియకపోవచ్చు. అందులో కలబంద, వెదురు మొక్కలతో పాటు ఇంకేమున్నాయంటే..
సంప్రదాయాలు, ఆచారాలు పాటించే ఇంటికి మిగతా ఇళ్లకు తేడా ఇట్టే తెలిసిపోతుంది. దానికి కారణం మన పెద్దలు తరతరాలుగా పరిశోధన చేసి మరీ పాటించిన ఆచార వ్యవహారాలే. అటువంటి ఇళ్లు మంచి ఆరోగ్యం, సంతోషమే కాకుండా ఆర్థికంగా ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటాయి. మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తుల ప్రభావం ఇంట్లోకి గాని, ఇంటి సభ్యుల మీద పడకుండా ఉండేందుకు ఇంట్లో, ఇంటి ఆవరణలో కొన్ని రకాల మొక్కలు పెంచేవారు. వారు పెంచుకున్న మొక్కలు నెగెటివిటీని పోగొట్టడమే కాకుండా ఇంట్లో పూర్తిగా సానుకూల శక్తులను నింపేవి. పూర్వీకులు మన కోసం సూచించిన ఆ 5 మొక్కలేంటో తెలుసుకుందాం.
మనీ ప్లాంట్: భారతీయుల ఇళ్లలో మనీ ప్లాంట్ సుపరిచితమైన పేరు. చాలా ఇళ్లలో గాజు సీసాలలో లేదా ఇంటి ముందు మట్టి కుండల్లో అలంకారానికి వీటిని ఉపయోగిస్తారు. నిజానికి ఇవి అలంకారానికి మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న నెగెటివిటీని గ్రహించి సానుకూల వాతావరణం పెరిగేలా చేస్తాయని నమ్ముతుంటారు.
తులసి మొక్క: ఆధ్మాత్మికంగా విశిష్ట ప్రాముఖ్యత కలది పవిత్ర తులసి. ఇందులో యాంటీ యాక్సిడెంట్‌తో పాటు యాంటీ బయాటిక్ లక్షణాలుంటాయి. ఇది జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్న సమయంలోనే నివారణకు ఉపయోగిస్తే సత్ఫలితాలు వస్తాయి. ఇంటి ఆవరణలో తులసిని పెంచడం, ఆరాధించడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి నెలవై ఉంటుందని నమ్ముతారు.
కలబంద: మానవ శరీరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కలబంద. చర్మం, జుట్టు సంరక్షణతో పాటు గాలిని శుద్ధి చేయడంలోనూ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఏ గదిలోనైనా పెంచుకునే వెసలుబాటు ఈ మొక్క ప్రత్యేకత. దీంతో స్వచ్ఛమైన గాలి పీలుస్తూ మానసిక ప్రశాంతతను పొందుతారు.
వెదురు మొక్క: ఈ మొక్కలు పెంచడం కారణంగా అదృష్టం దక్కడంతో పాటు, సంపద, శ్రేయస్సు మెరుగవుతాయని పెద్దలు చెబుతున్నారు. తక్కువ పాటి ఎండతో, మూడింట ఒక వంతు నీటిలో పెంచాలి.
లావెండర్: ఈ మొక్క చూడటానికి, సువాసనకు కూడా మంచి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. పైగా ఇది మన ఆవరణలో ఉంటే ఆందోళనను తగ్గించి శక్తి స్థాయిలను పెంచుతుంది. అంతేకాకుండా డిప్రెషన్, మానసిక సమస్యలతో సతమతమయ్యే వారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇంటి లోపలే సూర్యకాంతి తగినంత పడేలా దక్షిణం వైపుగా ఉన్న కిటికీ దగ్గర ఉంచితే ఉత్తమ ఫలితాలు ఇస్తుంది.
రోజ్‌మేరీ: ఈ మొక్కలో భాగాన్ని మనం వంటకాల్లో ఉపయోగిస్తాం. వాస్తవానికి ఈ మొక్క సుఖమైన నిద్రకు, జ్ఞాపకశక్తిని మెరుగుపరిచేందుకు సహకరిస్తుంది. ఈ మొక్కను పెంచేందుకు పరోక్షంగా ఎండపడే గదులలో ఉంచాలి.
ఆర్కిడ్‌లు: చూడచక్కనైన, సొగసైన ఈ పువ్వులు ఇంట్లోని ఖాళీ ప్రదేశాలను భర్తీ చేస్తాయి. అంతేకాకుండా మానసికంగా కలిగే ఒత్తిడి, ఉపశమనం, విశ్రాంతికి సహాయపడతాయి. పరోక్షంగా కలిగే సూర్యరశ్మి, తగినంత లైటింగ్ ఉన్న గదులలో ఉంచడం వల్ల చక్కగా ఎదగగలుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్