Vastu tips: వాస్తు ప్రకారం మీ ఇల్లు ఇలా ఉందంటే ఆర్థికంగా దేనికి లోటు ఉండదు, సంపద రెట్టింపు-according to vastu if your house is like this there will be no shortage of money and double wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips: వాస్తు ప్రకారం మీ ఇల్లు ఇలా ఉందంటే ఆర్థికంగా దేనికి లోటు ఉండదు, సంపద రెట్టింపు

Vastu tips: వాస్తు ప్రకారం మీ ఇల్లు ఇలా ఉందంటే ఆర్థికంగా దేనికి లోటు ఉండదు, సంపద రెట్టింపు

HT Telugu Desk HT Telugu
Oct 06, 2024 10:00 AM IST

వాస్తు ప్రకారం ఏ గది ఏ దిశలో ఉండాలి. వాటిని ఎలా నిర్మించుకుంటే కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. సంపద రెట్టింపు అవుతుంది అనే విషయాల గురించి ఆధ్యాత్మిక వేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

 వాస్తు ప్రకారం ఇల్లు ఎలా ఉండాలంటే
వాస్తు ప్రకారం ఇల్లు ఎలా ఉండాలంటే (pixabay)

వాస్తు శాస్త్రం అనేది భారతీయ సంప్రదాయంలో గృహ నిర్మాణానికి సంబంధించిన శాస్త్రం. ఇది భవనాలు, స్థలాలు, ఇతర నిర్మాణాల అభివృద్ధిలో ప్రకృతి శక్తులను, పంచభూతాలను (భూమి, జలం, వాయువు, అగ్ని, ఆకాశం) సమతుల్యంగా ఉంచడం ద్వారా శ్రేయస్సు, శాంతి, ఆనందం అందిస్తుందని నమ్మకం.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిని నిర్మించడం వల్ల ఆరోగ్యం, సంపద, శాంతి పెరుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మిక వేత పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణానికి ముఖ్యమైన నియమాలు

1. ముఖద్వారం (ప్రధాన ద్వారం): ఇంటికి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ముఖద్వారం ఇంటి శుభాన్ని, సంపదను ప్రభావితం చేస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని నియమాలు

ముఖద్వారం తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి. తూర్పు సూర్యరశ్ములు ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మంచి శక్తులు వస్తాయని నమ్మకం. ముఖద్వారాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచడం, దీపం లేదా వెలుగులు ఉండేలా చూడడం చాలా ముఖ్యం. ముఖద్వారానికి ఎదురుగా ఇతర పెద్ద వాస్తు దోషాలను కలిగించే నిర్మాణాలు ఉండకూడదు అని చిలకమర్తి తెలిపారు.

2. భోజనాల గది (డైనింగ్ హాల్): భోజన గది కూడా ఇంట్లో ఒక ముఖ్యమైన భాగం. వాస్తు ప్రకారం, భోజన గది కోసం పశ్చిమ లేదా దక్షిణ దిశలు అనుకూలంగా ఉంటాయి. భోజనం చేసే సమయంలో ముఖం తూర్పు వైపు ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది. దీని వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. భోజన గదిలో స్వచ్ఛతను పాటించడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం అవసరం చిలకమర్తి తెలిపారు.

3. వంటగది (కిచెన్): ఇంటి వంటగది వాస్తు శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం కలిగినది. వంటగది అగ్ని సంబంధమైన పనులు చేస్తుందని, దక్షిణ-తూర్పు (అగ్ని మూల) దిశలో ఉంచడం శ్రేయస్కరంగా ఉంటుంది. వంట చేసేటప్పుడు ముఖం తూర్పు వైపు ఉండటం మంచిదని వాస్తు నిపుణులు చిలకమర్తి తెలిపారు. వంటగదిలో నీటి నిల్వ, సింక్ వంటివి ఈశాన్య దిశలో ఉండాలి.

4. పడక గది (బెడ్‌రూమ్): పరీక్షలు, ఉద్యోగాలు, వ్యక్తిగత సంబంధాలు వంటి అంశాల్లో విజయాలను పొందడానికి పడకగది వాస్తు శాస్త్రం ప్రకారం అనుకూలంగా ఉండాలి. ప్రధాన పడకగది దక్షిణ దిశలో లేదా పశ్చిమ దిశలో ఉండాలి.పడక గదిలో పడుకునేటప్పుడు తల ఉత్తరం వైపుగా ఉండకూడదు. దక్షిణ దిశ వైపు తలపెట్టి పడుకోవడం శ్రేయస్కరం. శుభ్రతను కాపాడుకోవడం ద్వారా విశ్రాంతి, ప్రశాంతత ఎక్కువగా వస్తాయి.

5. దేవాలయం లేదా పూజా గది: ఇంట్లో పూజ గది సక్రమంగా ఏర్పాటు చేయడం ఆధ్యాత్మిక శ్రేయస్సుకు, శాంతికి కారణమవుతుంది. పూజా గదికి సంబంధించి వాస్తు నియమాలు:పూజా గదిని ఈశాన్య దిశలో ఉంచడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది శక్తిని అధికం చేస్తుందని నమ్మకం. దేవతా విగ్రహాలు, పూజా సామాగ్రి ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర వైపుకు ఉంచాలి. పూజ గదిలో ప్రతిరోజూ దీపం, ధూపం వెలిగించడం శుభప్రదం.

6. కిటికీలు, హావా వాకీలు: ఇంటిలో మంచి గాలి, వెలుతురు ఉండటానికి సరైన ప్రణాళిక అవసరం. వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తరం వైపున కిటికీలు ఎక్కువగా ఉండాలి. ఇవి సూర్య కిరణాలను, శుభశక్తులను ఆకర్షిస్తాయి. పశ్చిమ, దక్షిణ దిశలో కిటికీలు తక్కువగా ఉండాలి చిలకమర్తి తెలిపారు.

7. నీటి నిల్వలు: ఇంట్లో నీటి నిల్వలకు సంబంధించిన వాస్తు నియమాలు ఉన్నాయి. నీటి ట్యాంకులు లేదా కుళాయిలు ఉత్తర, ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచాలి. ఇంటి మధ్యలో లేదా పశ్చిమ దిశలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం, అమరికలు సక్రమంగా ఉంటే శుభశక్తులు, ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యం, శాంతి పొందవచ్చు. పై విధంగా వాస్తు నియమాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత పంచాంగకర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner