Vrishabha Rasi This Week: వృషభ రాశి వారు ఈ వారం ప్రతిభతో మెనేజ్‌మెంట్‌ని మెప్పిస్తారు, ప్రయాణాలు ఉంటాయి-taurus weekly horoscope 8th september to 14th september in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vrishabha Rasi This Week: వృషభ రాశి వారు ఈ వారం ప్రతిభతో మెనేజ్‌మెంట్‌ని మెప్పిస్తారు, ప్రయాణాలు ఉంటాయి

Vrishabha Rasi This Week: వృషభ రాశి వారు ఈ వారం ప్రతిభతో మెనేజ్‌మెంట్‌ని మెప్పిస్తారు, ప్రయాణాలు ఉంటాయి

Galeti Rajendra HT Telugu
Sep 08, 2024 09:09 AM IST

Taurus Weekly Horoscope: రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. పుట్టిన సమయంలో వృషభ రాశిలో సంచరిస్తున్న జాతకుల రాశిని వృషభ రాశిగా పరిగణిస్తారు. ఈ వారం.. అంటే సెప్టెంబరు 8 నుంచి 14 వరకు వృషభ రాశి వారి ప్రేమ, కెరీర్, ఆర్థిక, ఆరోగ్య జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి

Vrishabha Rasi Weekly Horoscope 8th September to 14th September: ఈ వారం వృషభ రాశి వారు తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. డబ్బుకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు సంవృద్ధి చెందుతారు. ఉద్యోగంలో మీ అత్యుత్తమ పనితీరును కనబరుస్తారు.

ప్రేమ

ఈ వారం మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడం, శృంగారాన్ని ఆస్వాదించడంపై దృష్టి పెడతారు. ఇది మీ సంబంధంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతారు. మీరిద్దరూ ఆనందించే యాక్టివిటీస్ చేయండి. విహారయాత్రను ప్లాన్ చేయండి, అక్కడ మీరు ప్రేమ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన, సృజనాత్మక నిర్ణయాలు తీసుకోవచ్చు.

తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. పెళ్లికి కూడా అవకాశాలు ఉన్నాయి. వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. వివాహిత స్త్రీలు మాజీ ప్రేమికులకు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇది వైవాహిక జీవితంలో కొత్త కష్టాలను తెస్తుంది.

కెరీర్

ఈ వారం వృషభ రాశి వారు ఆఫీస్‌లో యాక్టీవ్‌గా ఉంటారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీరు ప్రతిభతో మేనేజ్‌మెంట్‌ని మెప్పిస్తారు. అలానే యాజమాన్యం అంచనాలను అందుకోగలుగుతారు. మీరు ఈ వారం ప్రయాణించవచ్చు. మీరు పనికి సంబంధించి క్లయింట్ కార్యాలయానికి కూడా వెళ్ళవచ్చు.

హెల్త్ కేర్, ఐటీ, యానిమేషన్ రంగాల వారికి విదేశాలకు బదిలీ అయ్యే అవకాశాలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి వెనుకాడరు. కానీ అంతా సులభం అవుతుందని అనుకోవద్దు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకి సమస్యలు తొలగుతాయి.

ఆర్థిక

డబ్బు పరంగా విజయం మీకు అనుకూలంగా ఉంటుంది. ధనం అందుతుంది, దీని వల్ల మీరు అవసరమైన నిర్ణయం తీసుకోగలుగుతారు. స్టాక్స్, బిజినెస్, ప్రాపర్టీ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడంలో దిట్ట అయినప్పటికీ రీసెర్చ్ చేస్తారు.

కొంతమంది వృషభ రాశి మహిళలు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందుతారు. డబ్బు అవసరమైన స్నేహితుడు లేదా బంధువుకు కూడా మీరు సహాయం చేయవచ్చు. మీరు ఏదైనా కుటుంబ వేడుకకు కూడా విరాళం ఇవ్వాల్సి ఉంటుంది.

ఆరోగ్యం

ఆరోగ్యంగా ఉండటానికి వృషభ రాశి వారికి సరైన జీవనశైలిని అవలంబించడం చాలా ముఖ్యం. పార్కులో యోగా లేదా నడక వంటి వ్యాయామాలను ఈ వారం చేస్తారు.

శస్త్రచికిత్స చేయవలసి ఉంటే, మీరు షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగవచ్చు. డయాబెటిస్‌తో బాధపడే మహిళలు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యానికి హాని కలిగించే ఏ ఆహారాన్ని ఈ వారం తీసుకోవద్దు.