Trigrahi yogam: మిథున రాశిలో త్రిగ్రాహి యోగంతో మూడు రాశుల వారి అదృష్టం తలుపులు తెరుచుకున్నాయి-sun mercury venus creates trigrahi yogam in gemini three zodiac signs get good days ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Trigrahi Yogam: మిథున రాశిలో త్రిగ్రాహి యోగంతో మూడు రాశుల వారి అదృష్టం తలుపులు తెరుచుకున్నాయి

Trigrahi yogam: మిథున రాశిలో త్రిగ్రాహి యోగంతో మూడు రాశుల వారి అదృష్టం తలుపులు తెరుచుకున్నాయి

Gunti Soundarya HT Telugu
Jun 24, 2024 11:38 AM IST

Trigrahi yogam: మిథున రాశిలో సూర్యుడు, శుక్రుడు, బుధుడి కలయికతో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. జూన్ 29 వరకు ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది.

మిథున రాశిలో త్రిగ్రాహి యోగం
మిథున రాశిలో త్రిగ్రాహి యోగం (freepik)

Trigrahi yogam: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారానికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఇది రాశి చక్ర గుర్తులన్నింటి మీద ప్రభావం చూపిస్తుంది. నవగ్రహాలు కొంత సమయం తర్వాత రాశులను మార్చుకుంటూ వ్యక్తి జీవితం మీద ప్రభావితం చూపిస్తాయి.

ఒకే రాశిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రహాల సంచారాన్ని సంయోగం అంటారు. ప్రస్తుతం మిథున రాశిలో మూడు గ్రహాల కలయిక జరిగింది. ఒకే రాశిలో మూడు గ్రహాలు కలిసి ఉంటే త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, శుక్రుడు, బుధుడి కలయికతో ఈ త్రిగ్రాహి యోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగాన్ని శుభకారమైనదిగా పరిగణిస్తారు. బుధుడు, సూర్యుడు, శుక్రుడి కలయికను శుభప్రదంగా పరిగణించబడుతుంది.

జూన్ 29 వరకు మిథున రాశిలో త్రిగ్రాహి యోగం ఉంటుంది. ఆ తర్వాత బుధుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. త్రిగ్రాహి యోగంతో పాటు ఈ మూడు గ్రహాలు వేర్వేరుగా మరికొన్ని అదృష్ట యోగాలను ఏర్పరిచాయి. బుధుడు భద్ర రాజయోగం ఇచ్చాడు. పంచమహా పురుష రాజయోగాలలో ఇదీ ఒకటి. వీటిలో పాటు బుధ, సూర్య కలయికతో బుధాదిత్య యోగం, శుక్ర, సూర్య కలయికతో శుక్రాదిత్య యోగం ఏర్పడ్డాయి. ఇక బుధుడు, శుక్రుడు కలిసి లక్ష్మీ నారాయణ యోగాన్ని ఇచ్చాయి.

ఇలాంటి పరిస్థితుల్లో మిథున రాశిలో ఈ 3 గ్రహాలు ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వచ్చింది. మిథున రాశిలో త్రిగ్రాహి యోగం ఏ రాశి వారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.

మేష రాశి

సూర్యుడు, శుక్రుడు, బుధ గ్రహాల కలయిక మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా సానుకూలంగా ఉంటారు. ప్రతి పనిలోనూ ఉత్సాహంగా పాల్గొంటారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. అదే సమయంలో మీరు పిల్లలతో మంచి సమయాన్ని గడుపుతారు.

తులా రాశి

బుధుడు, శుక్రుడు, సూర్యుని కలయిక తులా రాశి వారికి ప్రయోజనకరంగా భావిస్తారు. గ్రహాల కదలికలో మార్పు కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు మతపరమైన కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కానీ ఖర్చులపై నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. అప్పుడే డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. ప్రేమ జీవితం శృంగారభరితంగా ఉంటుంది. కష్ట సమయాల్లో మీకు మీ కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.

మిథున రాశి

సూర్యుడు, శుక్రుడు, బుధ గ్రహాల సంయోగంతో త్రిగ్రాహి యోగం మిథున రాశిలోనే ఏర్పడింది. దీని ప్రభావంతో వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు అనేక కొత్త వనరులను కనిపిస్తాయి. ఈ నెలలో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు కెరీర్ జీవితంలో కొన్ని కొత్త బాధ్యతలను అందుకుంటారు. అదే సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమికుడితో మంచి సమయాన్ని గడుపుతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 

Whats_app_banner