Saturn nakshtra transit: నక్షత్రం మారబోతున్న శని.. ఈ రాశుల జీవితంలోకి కష్టాలు రాబోతున్నాయి-saturn nakshtra transit these zodiac signs get financial troubles ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Saturn Nakshtra Transit: నక్షత్రం మారబోతున్న శని.. ఈ రాశుల జీవితంలోకి కష్టాలు రాబోతున్నాయి

Saturn nakshtra transit: నక్షత్రం మారబోతున్న శని.. ఈ రాశుల జీవితంలోకి కష్టాలు రాబోతున్నాయి

Gunti Soundarya HT Telugu
Apr 02, 2024 05:54 PM IST

Saturn nakshatra transit: శని మరికొద్ది రోజుల్లో నక్షత్రం మార్చబోతున్నాడు. పూర్వా భాద్రపద నక్షత్రంలోకి రావడం వల్ల కొన్ని రాశుల వారి జీవితంలోకి కష్టాలు రాబోతున్నాయి. ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయంటే..

నక్షత్రం మారబోతున్న శని
నక్షత్రం మారబోతున్న శని

Saturn nakshtra transit: న్యాయదేవుడు శని ప్రస్తుతం తన సొంత రాశి కుంభ రాశిలోనే సంచరిస్తున్నాడు. కానీ తన కదలికలు మార్చుకుంటూ అన్ని రాశుల మీద ప్రభావం చూపిస్తున్నాడు. ఇప్పుడు శని నక్షత్రం మారబోతున్నాడు. శని ప్రస్తుతం శతభిషా నక్షత్రంలో ఉన్నాడు. ఏప్రిల్ 6వ తేదీన శని పూర్వాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. 30 సంవత్సరాల తర్వాత శని ఈ నక్షత్రంలో సంచరించబోతున్నాడు. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి కష్టాలు మొదలుకాబోతున్నాయి. ఈ సమయంలో ఓపికగా వ్యవహరించాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

మేష రాశి

శని నక్షత్ర మార్పు వల్ల మేష రాశి వారికి కష్టాలు పలకరించబోతున్నాయి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలుతో సతమతమవుతారు. జీవిత భాగస్వామితో విభేదాలు మనసుని ప్రశాంతంగా ఉండనివ్వవు. కడుపునొప్పి, చర్మ సమస్యలు, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడతారు.

మిథున రాశి

మిథున రాశి వారికి శని నక్షత్ర మార్పు కలిసి రాలేదు. అశుభ ఫలితాలు తీసుకొస్తుంది. మానసికంగా ఒత్తిడికి గురవుతారు. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తుంది. ఆస్తికి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటమే మంచిది. లేదంటే ధన నష్టం జరుగుతుంది. బంధువులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది.

సింహ రాశి

శని నక్షత్ర సంచారం సింహ రాశి వారికి ఆర్థిక సమస్యలు తీసుకొస్తుంది. అమితమైన ఖర్చులతో జేబులు ఖాళీ కాబోతున్నాయి. న్యాయపరమైన ఇబ్బందులు ఆందోళన కలిగిస్తాయి. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

తులా రాశి

తులా రాశి వారికి ఆర్థిక నష్టాలు సంభవించబోతున్నాయి. అప్పుల బాధలతో సతమతం అవుతారు. ఆరోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వాళ్ళు పని భారంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. ఫలితంగా ఆరోగ్యం చెడిపోతుంది. సంతానం వైపు నుంచి మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. వారి ప్రవర్తనతో మనసు కలత చెందుతుంది. అటు సమాజంలో మీకు అవమానం జరుగుతుంది. గౌరవ, ప్రతిష్టలు దెబ్బతింటాయి.

కుంభ రాశి

కుంభ రాశికి శని అధిపతిగా వ్యవహరిస్తాడు. ప్రస్తుతం శని ఈ రాశిలోనే సంచరిస్తున్నాడు. అయితే శని నక్షత్ర మార్పు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చుల కారణంగా అప్పు చేయాల్సి వస్తుంది. కీళ్ల నొప్పులు బాధిస్తాయి. గౌరవం పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలతో లాభపడతారు. వివాహం చేసుకున్న వ్యక్తులు సంతోషంగా గడుపుతారు.

శని అనుగ్రహం ఉంటే అదృష్టంతో సంపద రెట్టింపు అవుతుంది. అదే శని చెడు ప్రభావం పడితే మాత్రం కష్టాలు వెన్నంటే ఉంటాయి. శని దీవెనలు పొందటం కోసం ఈ పరిహారాలు పాటించాలి. శనివారం రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించడం మంచిది. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. ఇలా చేస్తే దోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది. శని దేవుడిని పూజిస్తూ శని స్తోత్రాలు పఠించాలి. శనివారం నాడు దాన ధర్మాలు చేస్తే శని అనుగ్రహం త్వరగా లభిస్తుంది.