Sankatahara Chaturthi: విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి పూజ.. సంకటహర చతుర్థి ప్రాశస్త్యం అదే!-sankatahara chaturthi importance lord ganesh puja vidhanam to overcome obstacles in life ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sankatahara Chaturthi: విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి పూజ.. సంకటహర చతుర్థి ప్రాశస్త్యం అదే!

Sankatahara Chaturthi: విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి పూజ.. సంకటహర చతుర్థి ప్రాశస్త్యం అదే!

HT Telugu Desk HT Telugu
Feb 19, 2023 08:42 AM IST

Sankatahara Chaturthi: చాంద్రమానం ప్రకారం ప్రతీ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థిగా విశేషమైనది. ఈరోజున వినాయక పూజ చేస్తే సర్వవిఘ్నాలు తొలగుతాయని నమ్మకం.

Sankatahara Chaturthi
Sankatahara Chaturthi (Unsplash)

Sankatahara Chaturthi: సంకటహర చతుర్థి శ్రావణ బహుళ చతుర్థి నాడు ప్రారంభించే సంకటహర చతుర్ధినే 'సంకష్టహర చతుర్థి' అని కూడా అంటారు. శ్రావణ బహుళ చవితిననే ఆరంభించకపోయినా ప్రతిమాసమూ కృష్ణపక్షములో వచ్చు చవితిని సంకటహర చతుర్థిగా తలంచి విఘ్నహరుని పూజిస్తూ ఉంటారు అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఎక్కువ భాగం చవితి ఉన్న రోజున పూజ చేయ మనః సంకల్పము చేసుకుని తెల్లనువ్వులపప్పు ముద్దగా చేసి తలకు పట్టించుకుని అభ్యంగనస్నానం ఆచరించి పగలంతా ఉపవాసం ఉండి ప్రదోష వేళలో గణేశు నికి షోడశోపచారములతో పూజ గావించి 21 కుడుములు చేసి అందు ఒక కుడుమును గణేశుని చేతిలో ఉంచి, 10 కుడుములు బ్రాహ్మణునకు కానీ, ముత్తయిదువకు కానీ వాయినమిచ్చి, 10 కుడుములు ప్రసాదముగా స్వీకరించవలెను. గణేశునికి ప్రీతికరమైన గరికతో గకార గణపతి నామావళితో అర్చించినట్లైతే తప్పక సంకటములు నివారించవచ్చు. సంకష్టహరచతుర్థులు 21 ప్రతి కృష్ణపక్ష చతుర్థినాడు చేస్తూ ఉంటారు. సంకటనాశన గణపతి స్తోత్రం 11 మార్లు లేదా 21 మార్లు చదువవచ్చును.

సందేశం: సర్వకార్య సిద్ధి కోసం, సర్వ విఘ్న, సర్వ కష్ట నివారణార్ధం విఘ్నహరుడైన విఘ్నేశ్వరుని శ్రద్ధాభక్తులతో విశ్వసించి ప్రతిమాసము బహుళ చవితినాడు సంకటహర చతుర్థిని ఆచరించవలెను.

సంకటహర చతుర్థి వ్రతకల్పము

గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

ధ్యానం: సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపఃణ ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజనానః వక్రతుండ శూర్పకర్ణో హేరమ్బో స్స్కంధపూర్వజఃః? షోడశైతాని నామాని యఃపఠేచ్ఛృణుయాదపి? విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా! సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే? అభీప్సితార్థ సిద్యర్థం పూజితో యస్సురైరపి? సర్వవిఘ్నేచ్ఛిదే తస్మై శ్రీ గణాధిపతయే నమః

సంకల్పము

శుభతిధౌ శోభనముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వన్తరే కలియుగే ప్రథమపాదే జమ్బూద్వీపే భరతవర్షే, భరతఖణే, మేరోర్ధక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావేర్యో: మధ్యభాగే, స్వగృహేసమస్త దేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్ర మానేన శ్రీ శుభక్రితు నామ సంవత్సరే... ఋతౌ మాసే...

పక్షే... చతుర్థీ తిథా... వాసర:, శుభనక్షత్రే, శుభయోగే, శుభకణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ, శ్రీమాన్.. గోత్ర: నామ ధేయః శ్రీమతః గోత్రస్య..... నామధేయస్య ధర్మ పత్నీ సమేతస్య అస్మాకం సహకుటుమ్బానాం క్షేమ స్థైర్య ధైర్య, విజయాయురోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, సర్వ కష్ట నివారణార్ధం, సర్వకార్యసిద్ధ్యర్థం శ్రీ గణాధిపతి పూజాం కరిష్యే. (అని ఉదకము పళ్ళెములో వదలవలెను.) తదంగ కలశారాధనం కరిష్యే.

కలశపూజ

కలశంలో గంధం, పుష్పాలు, అక్షతలు వేసి కలశంపై 3 చోట్ల గంధం, కుంకుమలతో బొట్లు పెట్టి కలశంపై చేయి ఉంచాలి.

పసుపు గణపతికి పూజ చేసిన అనంతరం సంకట హర గణపతి పూజ చేయాలి.

ఆవాహయామి

శ్లో అత్రగచ్ఛ జగద్వంద్య సురరాజార్చి శ

అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ ఎ శ్రీ సంకటహర గణపతయే నమః ఆవాహయామి. ఆసనం శ్లో మౌక్తికై పుష్యరాగైశ్చ నానారత్న విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాంఎఎ శ్రీ గణపతయే నమః ఆసనం సమర్పయామి...

ఈ విధంగా సంకట చతుర్ధి రోజు ఈ విధంగా వినాయక పూజ జరుపుకుంటే మీరు తలపెట్టే ఏ కార్యం అయినా ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతుంది.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్: 9494981000.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner

సంబంధిత కథనం