Krishnashtami 2024: కృష్ణాష్టమి రోజు కన్నయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే మీ ప్రతి కోరిక నెరవేరుతుంది
Krishnashtami 2024: ఆగస్ట్ 26న కృష్ణాష్టమి జరుపుకోనున్నారు. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల విశేషమైన ఫలితాలు దక్కుతాయని పండితులు చెబుతున్నారు. జన్మాష్టమి రోజు పూజలో కన్నయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే ప్రసన్నుడు అవుతాడు. మీ మనసులోని ప్రతి కోరిక నెరవేరుతుంది.
Krishnashtami 2024: జన్మాష్టమి పండుగను శ్రీకృష్ణుడి జన్మదినంగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా భక్తులు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసం బహుళ శుక్ల అష్టమి రోజు కృష్ణాష్టమి జరుపుకోనున్నారు. ఈ ఏడాది జన్మాష్టమి ఆగస్ట్ 26 సోమవారం వచ్చింది.
జన్మాష్టమి రోజు అత్యంత పవిత్రమైన సర్వార్థ సిద్ధియోగం రూపుదిద్దుకుంటుంది. ఈరోజు కృష్ణుడి బాల రూపమైన లడ్డూ గోపాల్ ను పూజిస్తారు. ఈ సందర్భంగా పూజలో లడ్డూ గోపాల్ కు ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషించి భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడని నమ్ముతారు. కృష్ణాష్టమి రోజు ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకుందాం.
కొత్తిమీర పంజిరి
కొత్తిమీర పంజరి కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా చేరుస్తారు. కొత్తిమీరను సంపదకు చిహ్నంగా భావిస్తారు. శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది కొత్తిమీర. దీనితో తయారు చేసే ఆహార పదార్థాలు నైవేద్యంగా పెట్టవచ్చు కొత్తిమీర పంజిరి సమర్పించడం వల్ల డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే శ్రీకృష్ణుడికి చరణామృతం సమర్పించడం మర్చిపోకూడదు. అది లేకుండా పూజా అసంపూర్తిగా ఉంటుంది.
శ్రీఖండ్
జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన శ్రీ ఖండ్ సమర్పించడం చాలా మంచిది. పెరుగుతో ఈ పదార్థాన్ని తయారుచేస్తారు. గుజరాత్ లోని ద్వారకా సహా పలు రాష్ట్రాలలో జన్మాష్టమి రోజు కృష్ణుడికి శ్రీఖండ్ నైవేద్యంగా సమర్పిస్తారు.
మఖన్ మిశ్రీ
జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే మఖన్ మిశ్రీ సమర్పించాలి. పూజలో లడ్డూ గోపాల్ ఈ నైవేద్యం సమర్పించడం వల్ల భక్తులు జీవితం ఆనందంతో నిండిపోతుంది. స్వచ్ఛమైన వెన్న, చక్కెరతో దీన్ని తయారు చేస్తారు. ఇది సమర్పించడం వల్ల కృష్ణుడి ఆశీస్సులు లభిస్తాయి. కృష్ణుడి అనుగ్రహంతో మనసులోని ప్రతి కోరిక నెరవేరుతుంది. పురాణాల ప్రకారం కన్నయ్య చిన్నతనంలో గోపికల ఇంటి నుంచి వెన్నను దొంగలించేవాడు. అందుకే అతన్ని వెన్నదొంగ అన్ని పిలుస్తారు.
మాల్పువా
శ్రీకృష్ణుడికి మాల్పువా సమర్పించవచ్చు. రాధా రాణి చేసిన మాల్పువా శ్రీ కృష్ణుడికి చాలా ఇష్టమని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే కృష్ణుడి జన్మదినం రోజు వీటిని సమర్పించడం వల్ల భక్తుడు కోరుకున్న ఫలితాలు పొందుతాడని నమ్ముతారు.
మోహన్ భోగ్
జన్మాష్టమి రోజు కృష్ణుడికి మోహన్ భోగ్ సమర్పించడం పవిత్రంగా భావిస్తారు. గోధుమపిండి స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో వేయించి పంచదార పొడి కలిపి ఈ నైవేద్యాన్ని తయారు చేస్తారు. జన్మాష్టమి రోజు దీన్ని సమర్పించడం వల్ల కృష్ణుడు సంతోషిస్తాడని నమ్ముతారు.
కృష్ణుడికి భోగం సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి.
త్వియః వాస్తు గోవింద తుబ్యామేవ సమర్పే
గృహ సంముఖో భూత్వ ప్రసిద్ధ పరమేశ్వర
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్