Krishnashtami 2024: కృష్ణాష్టమి రోజు లడ్డూ గోపాల్ కు ఇష్టమైన ఈ ఐదు వస్తువులు పూజలో పెడితే అదృష్టమే-offer these lord krishna favorite things in puja for seeking luck and prosperity ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Krishnashtami 2024: కృష్ణాష్టమి రోజు లడ్డూ గోపాల్ కు ఇష్టమైన ఈ ఐదు వస్తువులు పూజలో పెడితే అదృష్టమే

Krishnashtami 2024: కృష్ణాష్టమి రోజు లడ్డూ గోపాల్ కు ఇష్టమైన ఈ ఐదు వస్తువులు పూజలో పెడితే అదృష్టమే

Gunti Soundarya HT Telugu
Aug 22, 2024 10:00 AM IST

Krishnashtami 2024: కృష్ణాష్టమి రోజు అందరూ బాల గోపాలుడిని పూజిస్తారు. చిన్ని కన్నయ్యను అందంగా ముస్తాబు చేస్తారు. కృష్ణాష్టమి రోజు చేసే పూజలో లడ్డూ గోపాల్ కు ఇష్టమైన ఈ ఐదు వస్తువులు పెట్టండి. మీ ఇంట అదృష్టం, శ్రేయస్సు, ఆనందం వెల్లివిరుస్తాయి.

కృష్ణాష్టమి రోజు పూజలో పెట్టాల్సిన వస్తువులు ఇవే
కృష్ణాష్టమి రోజు పూజలో పెట్టాల్సిన వస్తువులు ఇవే (pixabay)

Krishnashtami 2024: శ్రీ మహా విష్ణువు ఎనిమిదో అవతారంగా కృష్ణుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. దేవకి, వాసుదేవ దంపతులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు చెరసాలలో జన్మించాడు. శ్రావణ మాసం బహుళ శుక్ల అష్టమి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్టు చెబుతారు.

కృష్ణుడి జననాన్ని జన్మాష్టమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్ట్ 26న కృష్ణాష్టమి జరుపుకోనున్నారు. దేశవ్యాప్తంగా అందరూ కృష్ణాష్టమి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. తమ పిల్లలకు చిన్ని కృష్ణయ్య వేషధారణ వేసి చూసుకుని మురిసిపోతారు. బాల కృష్ణుడు అంటే వెన్న దొంగ, చిలిపి అల్లరి కృష్ణుడు గుర్తుకు వస్తాడు. అది మాత్రమే కాదు శ్రీకృష్ణుడు అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది చేతిలో వేణువు, తల మీద నెమలి ఈక. ఇవి లేని కృష్ణుడిని ఊహించుకోవడం కూడా కష్టమే.

జన్మాష్టమి రోజు చేసుకునే పూజలో శ్రీకృష్ణుడికి ఇష్టమైన వస్తువులు సమర్పించడం వల్ల కన్నయ్య అనుగ్రహం మీకు లభిస్తుంది. కృష్ణాష్టమి నాడు లడ్డూ గోపాల్ ను పూజిస్తారు. ఉయ్యాలలో ఉన్న బాల గోపాలుడికి పూజలు చేస్తారు. మీరు పూజలో ఈ ఐదు వస్తువులు సమర్పించడం వల్ల కృష్ణుడు సంతోషిస్తాడు. ఆ ఐదు వస్తువులు ఏంటి? వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

వెన్న, మిఠాయిలు

బాల గోపాలుడు చిన్నతనంలో చాలా అల్లరి చేస్తూ ఉండేవాడు అని పురాణాలలో కథలు కథలుగా చెప్పేవారు. వెన్న దొంగ అని ముద్దుగా పిలుచుకుంటారు. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఊర్లో ఇళ్ల నుంచి వెన్నను దొంగిలించి తినేవాడు. కృష్ణుడు పెరిగిన బృందావన్ లో చాలా మంది కృష్ణుడి బారి నుంచి వెన్న కాపాడుకునేందుకు ఎత్తులో ఉట్టి కత్తి అందులో దాచుకునేవాళ్ళు. కానీ దాన్ని కూడా కృష్ణుడు దొంగిలించి తినేవాడు. తనతో పాటు తన స్నేహితులకు కూడా పంచి పెట్టాడు. అందుకే కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్న, పంచదారతో చేసిన మిఠాయిలు పెట్టవచ్చు. అందుకే చాలా మంది మఖన్ మిశ్రీని నైవేద్యంగా సమర్పిస్తారు.

నెమలి ఈక

నెమలి ఈక ప్రతికూలతను దూరం చేశతునది. ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సును అందిస్తుంది. లడ్డూ గోపాలుడికి నెమలి ఈక చాలా ప్రియమైనదని నమ్ముతారు. అందుకే కృష్ణుడికి పెట్టె కిరీటంలో తప్పని సరిగా నెమలి ఈక ఉంటుంది. మీరు జన్మాష్టమి రోజు నెమలి ఈక కూడా పూజలో పెట్టుకోవచ్చు.

వేణువు

కృష్ణుడు చిన్నతనం నుంచే తన వేణుగానంతో అందరినీ మంత్ర ముగ్ధులను చేసేవాడు. దాని నుంచి వచ్చే మధురమైన సంగీతం చాలా శ్రావ్యంగా ఉంటుంది. వేణువు నుంచి వెలువడే సంగీతం వలె మనం కూడా మధురంగా ఉండాలని, జీవితంలో ఇతరులకు ఆనందాన్ని పంచాలని ఇది సూచిస్తుంది. వేణువు కృష్ణుడికి ఎంతో విలువైనది. దీన్ని కూడా పూజలో ఉపయోగించవచ్చు.

గోమాత విగ్రహం

పురాణాల ప్రకారం కృష్ణుడు చిన్నప్పటి నుంచి గోవులకు సేవ చేసేవాడు. అందుకే కృష్ణుడిని గోపన్న అని కూడా పిలుస్తారు. ఎటువంటి మాంసాహారం లేకుండా స్వచ్చంగా జీవించే జీవిగా ఆవును గౌరవిస్తారు. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు. అందుకే పూజకు ఆవు పాలు, నెయ్యి, గో మూత్రం వినియోగిస్తారు. అందువల్ల కృష్ణుడిని పూజించేటప్పుడు మీరు గోమాత విగ్రహాన్ని కూడా పూజలో ఉంచవచ్చు.

కొత్తిమీర

కొత్తిమీర జ్యోతిష్యంలో సంపదతో ముడిపడి ఉంటుంది. కృష్ణుడికి కొత్తిమీర అంటే చాలా ఇష్టం. అందుకే కొత్తిమీరతో చేసిన ప్రసాదాలు, వంటకాలు నైవేద్యంగా సమర్పించవచ్చు. వీటితో పాటు కొత్తిమీర గింజలు(ధనియాలు) కూడా లడ్డూ గోపాల్ కు అందిస్తారు.