Laddu gopal idol: ఈ జన్మాష్టమికి లడ్డూ గోపాల్ విగ్రహాన్ని తీసుకొస్తున్నారా? అయితే ఇవి మీ కోసమే-if you are bringing laddu gopal idol to home before janmashtami then know the rules ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Laddu Gopal Idol: ఈ జన్మాష్టమికి లడ్డూ గోపాల్ విగ్రహాన్ని తీసుకొస్తున్నారా? అయితే ఇవి మీ కోసమే

Laddu gopal idol: ఈ జన్మాష్టమికి లడ్డూ గోపాల్ విగ్రహాన్ని తీసుకొస్తున్నారా? అయితే ఇవి మీ కోసమే

Gunti Soundarya HT Telugu
Aug 21, 2024 06:10 PM IST

Laddu gopal idol: ఈ జన్మాష్టమికి మీ ఇంట్లో లడ్డూ గోపాల్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని అనుకుంటున్నారా? అయితే చిన్ని కన్నయ్య విగ్రహాన్ని ఎప్పుడు కొనాలి? ఏ దిశలో ఉంచాలి? ఎలాంటి సేవలు చేయాలి అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

లడ్డూ గోపాల్ విగ్రహం ఏ దిశలో పెట్టాలి?
లడ్డూ గోపాల్ విగ్రహం ఏ దిశలో పెట్టాలి? (pinterest)

Laddu gopal idol: శ్రావణ మాసం బహుళ పక్ష అష్టమి తిథి నాడు శ్రీకృష్ణుడు జన్మించాడని చెబుతారు. శ్రీకృష్ణుడు పుట్టిన రోజును జన్మాష్టమిగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ ఏడాది అనే శుభ యోగాలతో జన్మాష్టమి వచ్చింది. 

ద్వాపర యుగంలో కృష్ణుడు జన్మించినప్పుడు ఎటువంటి యోగం ఉందో మళ్ళీ ఇప్పుడు అది పునరావృతం కాబోతుంది. ఈ సారి అలాంటి ఎన్నో యోగాలు రూపుదిద్దుకుంటున్నాయి. అందులో మొదటిది రోహిణి నక్షత్రం. చాలా చోట్ల జన్మాష్టమి పండుగను 26న జరుపుకుంటున్నారని, చాలా చోట్ల జన్మాష్టమి ఆగస్ట్ 27న జరుపుకుంటున్నారు. 

లడ్డూ గోపాల్ విగ్రహం ఎప్పుడు కొనాలి?

చాలా యాదృచ్చిక సంఘటనలు ఆగస్ట్ 26న జరుగుతున్నాయి. అందుకే జన్మాష్టమి పండుగను కూడా ఆగస్ట్ 26న జరుపుకోవడం మంచిది. మీరు జన్మాష్టమి పండుగను జరుపుకుంటున్నట్లయితే, మీ ఇంట్లో చిన్ని కన్నయ్య విగ్రహం లేకపోతే ఇప్పుడే తీసుకుని రావచ్చు. లడ్డూ గోపాల్ విగ్రహాన్ని ఇంట్లోకి తీసుకురావడానికి చాలా నియమాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో ఏ రోజైన విగ్రహం కొనుగోలు చేసేందుకు మంచి రోజుగా భావిస్తారు. 

మధుర నుంచి ఎవరైనా ఉయ్యాలలో ఉన్న లడ్డూ గోపాల్ విగ్రహాన్ని తీసుకువస్తే మంచిది. అలాగే జన్మాష్టమి నాడు ఎవరైనా లడ్డూ గోపాల్ ని ఇవ్వడం చాలా శ్రేయస్కరం. 

శ్రీకృష్ణుడి బాల రూపాన్నే లడ్డూ గోపాల్ గా పిలుస్తారు. మీరు మొదటి సారిగా లడ్డూ గోపాల్ విగ్రహాన్ని ఇంటికి తెస్తున్నట్టయితే జన్మాష్టమి రోజు మంచిది. శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనది. అందువల్ల ఈ మాసంలో ఏ రోజు అయినా తీసుకురావచ్చు. అలాగే ఈ విగ్రహాన్ని పెట్టె దిశ మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

లడ్డూ గోపాల్ ను ఈ దిశలో పెట్టాలి 

వాస్తు ప్రకారం ఈశాన్య దిశను దేవతల దిశగా పిలుస్తారు. ఈ దిశలో లడ్డూ గోపాల్ ని ప్రతిష్టించడం చాలా శ్రేయస్కరం. అలాగే ఇంటి పూజా మందిరంలోను పెట్టుకోవచ్చు. ఒక పీట వేసి దాని మీద విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఉయ్యాలలో ఉన్న బాల గోపాలుడి విగ్రహం పెట్టడం శుభ ప్రదంగా భావిస్తారు. మీకు తోచిన విధంగా చిన్న చిన్న దుస్తులు, ఆభరణాలు, కిరీటం వంటివి వాటితో అందంగా అలంకరించవచ్చు.

క్రమం తప్పకుండా లడ్డూ గోపాల్ ను పూజించాలి. స్వచ్చమైన పదార్థాలతో నైవేద్యం చేసి సమర్పించాలి. ఆ తర్వాత వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. చిన్న పిల్లలకు ప్రతిరోజూ ఎలా స్నానం చేయిస్తారో అదే విధంగా లడ్డూ గోపాల్ కు కూడా స్నానం చేయించి శుభ్రమైన దుస్తులు వేసి పూజ చేసుకోవచ్చు. కృష్ణుడికి సంబంధించి మంత్రాలు జపించడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడి ఆశీర్వాదాలు మీకు పుష్కలంగా లభిస్తాయి. 

మీరు ఇంట్లో లడ్డూ గోపాల్‌ని ఉంచుకుంటే విగ్రహం ఎక్కడా పగలకుండా, ముక్కు, ఇతర భాగాలు అన్నీ ఏ లోపం లేకుండా ఉన్నాయో లేదో జాగ్రత్తగా తనిఖీ చేయండి. వారి కోసం ఊయల, మంచం, కాలానుగుణ దుస్తులు, నెమలి కిరీటం, వేణువు, కిరీటం, దండ మొదలైనవి కొనండి. ఏ పిల్లలకు వడ్డిస్తారో అదే విధంగా ఇంట్లో లడ్డూ గోపాల్ కు వడ్డిస్తారు. వాటిని రోజుకు నాలుగు సార్లు చిన్ని కృష్ణుడికి అందించండి. వారికి స్నానం చేయించడం, బట్టలు మార్చడం, ఎప్పుడూ దగ్గర ఉంచుకోవడం, రాత్రి పూట లాలిపాటలు పాడుతూ పడుకునేలా చేయడం వంటివి చేస్తే మంచిది.  ఈ నియమాలన్నీ పాటిస్తేనే లడ్డూ గోపాల్‌ని ఇంట్లో ఉంచుకోవచ్చు.

కృష్ణ జన్మాష్టమి తేదీ, సమయం 2024

కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు - ఆగస్ట్ 26 సోమవారం, 2024

నిశిత పూజ సమయం- మధ్యాహ్నం 12:01 నుండి 12:45 వరకు, 27 ఆగస్ట్ 2024

దహీ హండి( ఉట్టి కొట్టే వేడుక)- మంగళవారం, 27 ఆగస్ట్ 2024

•పరాన్ సమయం- 27 ఆగస్ట్ 2024, 12:45 am తర్వాత

• అష్టమి తిథి ప్రారంభం – 03:39 AM, 26 ఆగస్ట్ 2024

• అష్టమి తిథి ముగుస్తుంది- 02:19 AM, 27 ఆగస్ట్ 2024

• రోహిణి నక్షత్రం ప్రారంభం – 03:55 PM, 26 ఆగస్ట్ 2024

•రోహిణి నక్షత్రం ముగుస్తుంది - 03:38 PM, 27 ఆగస్ట్ 2024.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.