Lord krishna: శ్రీకృష్ణుడికి ప్రియమైన రాశులు ఇవే, వీరికి కన్నయ్య ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయి-these zodiac signs are lord krishna most favorite ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Krishna: శ్రీకృష్ణుడికి ప్రియమైన రాశులు ఇవే, వీరికి కన్నయ్య ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయి

Lord krishna: శ్రీకృష్ణుడికి ప్రియమైన రాశులు ఇవే, వీరికి కన్నయ్య ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయి

Gunti Soundarya HT Telugu
Aug 20, 2024 08:00 AM IST

Lord krishna: చిలిపి కృష్ణుడు, అల్లరి కృష్ణుడు, నంద గోపాలుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకృష్ణుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కన్నయ్యను పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీకృష్ణుడికి ఇష్టమైన కొన్ని రాశులు ఉన్నాయి. వారికి ఎల్లప్పుడూ కన్నయ్య ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయి.

శ్రీకృష్ణుడికి ప్రియమైన రాశులు ఇవే
శ్రీకృష్ణుడికి ప్రియమైన రాశులు ఇవే (pixabay)

Lord krishna: కరుణ, సున్నితత్వం, ప్రేమకు ప్రతీకగా శ్రీకృష్ణుడిని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశిచక్రానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రభావితం చేసే ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వాళ్ళు చేసే పనుల ఆధారంగా, వ్యక్తిత్వం పరంగా దేవతల ఆశీర్వాదాలు పొందుతారు. దేవుళ్ళకు ప్రియమైన రాశులుగా ఉంటారు.

అలా శ్రీకృష్ణుడికి ఇష్టమైన కొన్ని రాశులు ఉన్నాయి. వారికి కన్నయ్య ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం కృష్ణుడు విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారంగా చెబుతారు. ఈ ఏడాది ఆగస్ట్ 26న జన్మాష్టమి జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి ఇష్టమైన రాశులు ఏవో తెలుసుకుందాం. కృష్ణుడికి ప్రత్యేకంగా ఇష్టమైన నాలుగు రాశుల ఉన్నాయి. వీరికి ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలు శ్రీకృష్ణుడి ఆశీస్సులు పొందేలా చేస్తాయి. శ్రీకృష్ణుడికి ఇష్టమైన రాశులు ఆ రాశులు ఏవంటే..

వృషభ రాశి

శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైన రాశులలో మొదటిది వృషభ రాశి. కృష్ణుడి అనుగ్రహంతో వృషభ రాశి వాళ్ళు అన్ని ప్రయత్నాల్లోనూ విజయం సాధిస్తారు. అదృష్టవంతులుగా మంచి పేరు సంపాదిస్తారు. ఎల్లప్పుడూ ఇతరుల పట్ల అంకితభావంతో, పూర్తి విశ్వాసంతో ఉంటారు. దైవం పట్ల వీరికి అమితమైన ప్రేమ ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు తెలివి అద్భుతమైన వాక్చాతుర్యంతో ప్రసిద్ధి చెందుతారు. శ్రీకృష్ణుడు కూడా మాటకారితనంతో ప్రసిద్ధి చెందాడు.

కర్కాటక రాశి

రక్షణ స్వభావానికి కర్కాటక రాశి వారు ప్రసిద్ధి చెందారు. ప్రేమ, శ్రద్ధగల ప్రవర్తనతో ఉంటారు. ఈ రాశి వాళ్ళు తమ ప్రియమైన వారి గురించి చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. వారి పట్ల అత్యంత శ్రద్ద చూపిస్తారు. ఆదర్శనీయంగా ఉంటారు. వీరికి భక్తి భావం కూడా ఎక్కువే. అందువల్ల శ్రీకృష్ణుడికి కర్కాటక రాశి వారు అంటే మహా ప్రతి అని అంటారు. తన తోబుట్టువులతో చాలా భావోద్వేగపూరితంగా ఉంటారు.

సింహ రాశి

సింహ రాశి వారికి శ్రీకృష్ణుడి ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ రాశి వాళ్ళు చాలా శ్రద్ధగా పనులు చేస్తారు. అందుకే కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడు దక్కుతుంది. నాయకత్వ లక్షణాలు, ధైర్య సహకారాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కన్నయ్య అభిమానం వీళ్ళు చూరగొంటారు. సింహ రాశి వారు ప్రభావం అంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి నాయకత్వం అధికారానికి సంబంధించినది కాకుండా ఇతరులను ప్రేరేపించే విధంగా ఉంటుంది. వీరిలో శ్రీకృష్ణుడి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని చెబుతారు. అందుకే ఈ రాశి వాళ్ళు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. సింహ రాశి వారు ఎప్పుడూ సంతోషంగా సంపన్నంగా ఉంటారు.

తులా రాశి

శ్రీకృష్ణుడికి ఇష్టమైన మరొక రాశి తులా రాశి. వీరికి కన్నయ్య ఆశీర్వాదాలు సమృద్ధిగా లభిస్తాయి. సమాజంలో మంచి గౌరవం పొందుతారు. కృష్ణుడి అనుగ్రహంతో ఈ రాశి వాళ్లు జీవితంలో అన్నీ రకాల సుఖసంతోషాలతో, సౌభాగ్యాలు అనుభవిస్తారు. కృష్ణుడికి సంబంధించిన మంత్రాలు జపించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.