Trigrahi yogam: 365 రోజుల తర్వాత సింహ రాశిలో త్రిగ్రాహి యోగం వల్ల 3 రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది-after 365 days the fate of 3 zodiac signs will shine due to trigrahi yog in leo ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Trigrahi Yogam: 365 రోజుల తర్వాత సింహ రాశిలో త్రిగ్రాహి యోగం వల్ల 3 రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది

Trigrahi yogam: 365 రోజుల తర్వాత సింహ రాశిలో త్రిగ్రాహి యోగం వల్ల 3 రాశుల అదృష్టం ప్రకాశిస్తుంది

Gunti Soundarya HT Telugu
Aug 04, 2024 06:00 AM IST

Trigrahi yogam: ఆగస్ట్ నెలలో సింహరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి రాబోతున్నారు. దీని వలన బుధాదిత్య, శుక్రాదిత్య సహా 3 రాజయోగాలు ఏర్పడతాయి మరియు కొన్ని రాశుల వారికి చాలా శుభ ఫలితాలు లభిస్తాయి.

సింహ రాశిలో త్రిగ్రాహి యోగం
సింహ రాశిలో త్రిగ్రాహి యోగం

Trigrahi yogam: గ్రహ సంచారానికి సంబంధించి ఆగస్ట్ నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు, కుజుడు, శుక్రుడు సహా 4 పెద్ద గ్రహాల సంచారం జరగబోతోంది. ఇది మేషం నుండి మీనం వరకు 12 రాశులపై శుభ, అశుభ ప్రభావాలను కలిగి ఉంటుంది.

దృక్ పంచాంగ్ ప్రకారం ఆగస్ట్ నెలలో బుధుడు, శుక్రుడు, శుక్రుడు సింహ రాశిలో కలుసుకుంటారు. బుధుడు 2024 ఆగస్టు 22 వరకు సింహ రాశిలో ఉంటాడు. ఇక శుక్రుడు కూడా జూలై 31 నుండి ఆగస్టు 22, 2024 వరకు సింహ రాశిలో ఉంటాడు. అదే సమయంలో గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు కూడా 16 ఆగస్టు 2024 న సింహ రాశిలోకి వస్తాడు.

సింహరాశిలో సూర్యుడు, బుధుడు , శుక్రుడు 8 రోజుల పాటు దగ్గరగా రావడం వల్ల త్రిగ్రాహి యోగం, బుధాదిత్య యోగం, లక్ష్మీనారాయణ యోగం, శుక్రాదిత్య యోగం వంటి అనేక శుభ కలయికలు ఏర్పడతాయి. ఏడాది తర్వాత సింహ రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈ అద్భుతమైన కలయిక కొన్ని రాశుల జీవితంలో అనేక ముఖ్యమైన మార్పులను తెస్తుంది. సింహ రాశిలోని 3 పెద్ద గ్రహాల కలయిక వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.

మేష రాశి

త్రిగ్రాహి యోగం వల్ల మేష రాశి వారి జీవితాల్లో గణనీయమైన మార్పులు వస్తాయి. మీరు పిల్లల వైపు నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఆఫీసు నిర్వహణలో మీ ఇమేజ్ బాగానే ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

సింహ రాశి

సింహ రాశి వారికి త్రిగ్రాహి యోగం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మూడు గ్రహాల కలయిక ఈ రాశిలోనే జరుగుతుంది. అందువల్ల ఈ కాలంలో ప్రతి పనిలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ, మద్దతు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచిపోతారు. వస్తు సంపదలో పెరుగుదల ఉంటుంది. ధనలాభానికి అనేక అవకాశాలు ఉంటాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి సూర్యుడు, బుధుడు, శుక్రుడి కలయికతో ఏర్పడిన రాజయోగం వల్ల విపరీతమైన లాభం చేకూరుతుంది. ఉద్యోగ అన్వేషణ పూర్తవుతుంది. మీరు మంచి ప్యాకేజీతో కొత్త జాబ్ ఆఫర్ పొందుతారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. సుఖాలు, విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఆకస్మిక ఆర్థిక లాభానికి బలమైన అవకాశాలు ఉన్నాయి.

ధనుస్సు రాశి

సూర్యుడు, బుధుడు, శుక్రుడు దగ్గరగా వచ్చి ధనుస్సు రాశి వారికి నిద్రాణమైన అదృష్టాన్ని ప్రకాశవంతం చేయవచ్చు. ఈ కాలంలో ఉద్యోగస్తులు పురోభివృద్ధికి అనేక బంగారు అవకాశాలను పొందుతారు. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం ఉంది. ధార్మిక ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలను నిర్వహించడం సాధ్యమవుతుంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.