Janmashtami: ఈ ఏడాది జన్మాష్టమి చాలా విశేషం.. ద్వాపరకాలం నాటి సమయం మళ్ళీ పునరావృతం కాబోతుంది-janmashtami on 26th august 4 special coincidences like dwaparkal are being made ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Janmashtami: ఈ ఏడాది జన్మాష్టమి చాలా విశేషం.. ద్వాపరకాలం నాటి సమయం మళ్ళీ పునరావృతం కాబోతుంది

Janmashtami: ఈ ఏడాది జన్మాష్టమి చాలా విశేషం.. ద్వాపరకాలం నాటి సమయం మళ్ళీ పునరావృతం కాబోతుంది

Gunti Soundarya HT Telugu
Aug 15, 2024 11:00 AM IST

Janmashtami: ద్వాపర కాలంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఎటువంటి అపూర్వమైన కలయికలు ఏర్పడ్డాయో ఇప్పుడు ఈ ఏడాది కూడా జన్మాష్టమి రోజు రాబోతున్నాయి. దీంతో ఈ ఏడాది కృష్ణాష్టమి విశిష్టత రెట్టింపు కాబోతుంది.

కృష్ణాష్టమి పండుగ
కృష్ణాష్టమి పండుగ (HT Photo)

Janmashtami: ఆగస్ట్ 26న జన్మాష్టమి రోజు ద్వాపరకాలంలో మాదిరిగానే 4 ప్రత్యేక యాదృచ్ఛికాలు ఏర్పడబోతున్నాయి. ఈసారి జన్మాష్టమి నాడు శ్రీ కృష్ణుని భక్తులపై అనంతమైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ ఏడాది ఆగస్టు 26వ తేదీ సోమవారం జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజు ప్రత్యేకంగా జరుపుకుంటారు. విష్ణుమూర్తి ఎనిమిదో అవతారంగా శ్రీకృష్ణుడిని పూజిస్తారు. 

ఈ శుభ సందర్బంగా భక్తులకు శ్రీ కృష్ణ భగవానుడి ఆశీస్సులు ప్రత్యేకంగా లభించబోతున్నాయి. ఈసారి జన్మాష్టమి నాడు ఇలాంటి నాలుగు అరుదైన యాదృచ్ఛిక సంఘటనలు జరుగుతున్నాయని ఇవి శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో ఎలా ఉన్నాయో సరిగ్గా అదే విధంగా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ యాదృచ్ఛికాలు భక్తులకు చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఇవి అపారమైన మతపరమైన, జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. శ్రీ కృష్ణ భగవానుని అనుగ్రహం పొందడానికి భక్తులు ఈ రోజు ప్రత్యేక ఉపవాసం ఆచరించాలని, ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేయాలని పండితులు సూచిస్తున్నారు. 

కృష్ణాష్టమి రోజు ఏం చేయాలి?

శ్రీ కృష్ణుడు బాల్యంలో చేసిన లీలలు స్మరించుకోవాలి. శ్రీకృష్ణుని జయంతి సందర్భంగా రాత్రి 12 గంటలకు 'మహా ఆరతి' నిర్వహించి మీ జీవితంలో సుఖ సంతోషాలు, శాంతి, శ్రేయస్సు కోసం శ్రీకృష్ణుడిని ప్రార్థించండి. ఈ రోజున చేసే ఉపవాసం, ఆరాధన జీవితంలో విశేష ఫలితాలను అందిస్తుంది. భగవంతుని అనుగ్రహం కలకాలం నిలిచి ఉంటుంది. ఈ జన్మాష్టమి శ్రీ కృష్ణుని ప్రత్యేక అనుగ్రహంతో భక్తుల జీవితాల్లో ఆనందం, ప్రేమ, విజయం ఉంటుంది. ఈ శుభసందర్భంలో శ్రీకృష్ణుని దీవెనలు పొందేందుకు పూర్తి భక్తితో పూజించండి. ఈరోజు నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం. 

రోహిణి నక్షత్రం 

శ్రీ కృష్ణుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఇక ఈ సంవత్సరం జన్మాష్టమి రోజు  కూడా ఈ నక్షత్రం ఉంటుంది. ఈసారి రోహిణి నక్షత్రం ఆగస్ట్ 26 రాత్రి 9.10 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ విధంగా అర్ధరాత్రి, సోమవారం రోహిణి నక్షత్రంతో అష్టమి తిథి కలిసి రావడం వల్ల జయంతి యోగానికి ఉత్తమ అవకాశం లభిస్తోంది. రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు. మనస్సు, భావోద్వేగాలకు సంబంధించినవాడు చంద్రుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు పదునైన తెలివితేటలు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, అధిక మానసిక సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ యాదృచ్ఛికం కారణంగా ఈ రోజున చేసే విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.

అష్టమి తిథి

శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణ భగవానుడు జన్మించాడు. ఈసారి జన్మాష్టమి రోజున అష్టమి తిథి యాదృచ్ఛికంగా కూడా ఉంది. ఇది ఈ పండుగను మరింత పవిత్రంగా చేస్తుంది. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఉపవాసం, పూజలు చేయడం ద్వారా భక్తులు విశేష ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి యాదృచ్ఛికం

శ్రీ కృష్ణుడు వృషభరాశిలో జన్మించాడు. ఈసారి కూడా చంద్రుడు వృషభ రాశిలోనే ఉంటాడు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఇది ప్రేమ, అందం, భౌతిక ఆనందాలకు కారకంగా పరిగణించబడుతుంది. ఈ రాశిలో చంద్రుని సంచారము శ్రీ కృష్ణ భగవానుని ప్రత్యేక కృపను చూపుతుంది. భక్తులు ఈ యాదృచ్చిక ప్రయోజనాన్ని పొందుతారు.

వాసుదేవ్ యోగం 

ఈ సంవత్సరం జన్మాష్టమి నాడు వాసుదేవ యోగం కూడా ఏర్పడం యాదృచ్ఛికంగా జరుగుతోంది. వాసుదేవ యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ యోగం శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో కూడా ఉంది. ఈ యోగం జీవితంలో శ్రేయస్సు, ఆనందం, శాంతికి కారకం. ఈ యోగ సమయంలో చేసే ఉపవాసం, పూజలు భక్తులకు శాంతిని, జీవితంలో విజయాన్ని అందిస్తాయి. ఈ నాలుగు ప్రత్యేక యాదృచ్ఛికాల కారణంగా ఈ ఏడాది జన్మాష్టమి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పవిత్రమైన రోజున భక్తులు శ్రీకృష్ణుని పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేసి అర్ధరాత్రి శ్రీకృష్ణ జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకోవడం ద్వారా భక్తులు విశేష ఫలితాలను పొందుతారు.