Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ ఏడాది రెండు తేదీల్లో.. వింత కారణం చెప్తున్న జ్యోతిష్కులు-what is the date of janmashtami across the country ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ ఏడాది రెండు తేదీల్లో.. వింత కారణం చెప్తున్న జ్యోతిష్కులు

Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ ఏడాది రెండు తేదీల్లో.. వింత కారణం చెప్తున్న జ్యోతిష్కులు

HT Telugu Desk HT Telugu
Aug 13, 2024 03:37 PM IST

Krishna Janmashtami: జన్మాష్టమి రోజున భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే.. జీవితంలో అన్ని ఆటంకాలు తొలగిపోయి.. సుఖసంతోషాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. గోకులంలో చిన్ని కృష్ణుడిగా అల్లరి చేష్టలతోనూ జీవిత పరమార్థాన్ని కృష్ణుడు బోధించాడు.

శ్రీకృష్ణ జన్మాష్టమి
శ్రీకృష్ణ జన్మాష్టమి

Krishna Janmashtami 2024: వయసుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అందరూ ఏటా ఆసక్తిగా ఎదురుచూసే పండుగల్లో కృష్ణాష్టమి ఒకటి. చిన్నారులకి కృష్ణుడి, గోపిక వేషాలేసి తల్లిదండ్రులు సంబరపడితే.. చిన్న పిల్లలు బుడిబుడి అడుగులతో ఇంట్లోవాళ్ల సంబరాన్ని రెట్టింపు చేస్తుంటారు.

కానీ.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కృష్ణాష్టమిని ఆగస్టు 26, ఆగస్టు 27 తేదీల రూపంలో రెండు రోజులు జరుపుకోబోతున్నారు. కృష్ణుడి 5251వ జన్మదినం సందర్భంగా కాన్హా నగరం, మధురలో వేర్వేరు తేదీల్లో ఈ వేడుకని నిర్వహించనున్నారు. దాంతో ఆగస్టు 26న మధురను సందర్శించే భక్తులు, మరుసటి రోజు అంటే ఆగస్టు 27న జన్మాష్టమి జరుపుకునే కొన్ని ఆలయాల్లో దధికాన (నందోత్సవాన్ని) చూడలేరు.

దేశంలో ఈ ఏడాది ఇలా వేర్వేరు తేదీల్లో జన్మాష్టమి జరుపుకోవడానికి గల కారణాల్ని జ్యోతిష్కులు ఇలా చెప్తున్నారు ‘‘ఉదయ తిథి ద్వారా గణన చేసే దేవాలయాలలో ఆగస్టు 26న జన్మాష్టమి జరుపుకుంటారు. అలానే రోహిణి నక్షత్రం ద్వారా గణన జరిగే దేవాలయాల్లో ఆగస్టు 27న జన్మాష్టమి జరుపుకుంటారు’’ అని అజయ్ తైలాంగ్ వివరించారు.

ఏడాదిలో ఒక్కసారి మంగళ హారతి

బంకేబిహారీ ఆలయంలో ఆగస్టు 27న జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ సేవాయత్‌ ఆచార్య వెల్లడించారు. ఠాకూర్ మహాభిషేకం రాత్రి 12 గంటల ప్రాంతంలో జరుగుతుందని.. కానీ భక్తులు దానిని చూడలేరని చెప్పుకొచ్చారు. అలానే తెల్లవారుజామున 2 గంటలకు మంగళ హారతి చేసి 5 గంటలకు గుడి తలుపులు మూసేస్తామని తెలిపారు. ఈ ఆలయంలో సంవత్సరానికి ఒకసారి మాత్రమే శ్రీకృష్ణుడికి మంగళ హారతి ఇస్తారు.

శ్రీకృష్ణ జన్మస్థాన్‌లోని ఆలయాల్లో, పురాతన కేశవదేవ్ ఆలయం, ఇస్కాన్ దేవాలయాల్లో జన్మాష్టమి వేడుకలు ఆగస్టు 26న నిర్వహించనున్నారు. కానీ.. బృందావన్‌లోని ఏడు దేవాలయాల్లో, రాధారామన్ ఆలయం, రాధా దామోదర్ ఆలయంలో పగటిపూట జన్మాష్టమిని జరుపుకుంటారు. ఈసారి ఈ రెండు ఆలయాల్లో ఆగస్టు 27న ఉత్సవాలు జరగనున్నాయి.

కిట్టయ్య జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని హిందువులు ఏటా చాలా పవిత్రంగా జరుపుకుంటారు. బహుశా గోకులంలో శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడు కావడంతో కాబోలు.. ఈ పండుగని గోకులాష్టమి అని కూడా అంటుంటారు. పరమ పవిత్రమైన ఆరోజున ఒంటి పూట భోజనం చేసి శ్రీకృష్ణుడికి పూజ చేసిన అనంతరం.. శ్రీకృష్ణదేవాలయాలను దర్శిస్తే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తుంటారు.