Krishna janmashtami 2024: శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది? ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి?-krishna janmashtami 2024 date and time significance of this festival ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Krishna Janmashtami 2024: శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది? ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి?

Krishna janmashtami 2024: శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది? ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి?

Gunti Soundarya HT Telugu
Jun 25, 2024 10:37 AM IST

Krishna janmashtami 2024: జన్మాష్టమిని శ్రీకృష్ణుడి జన్మదినంగా జరుపుకుంటారు. హిందూ మతంలో ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది కృష్ణాష్టమి ఎప్పుడు వచ్చింది? దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.

శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది?
శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది? (pixabay)

Krishna janmashtami 2024: హిందూ మతంలో కృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినాన్ని కృష్ణ జన్మాష్టమి అంటారు. మత విశ్వాసాల ప్రకారం శ్రీ కృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథి, రోహిణి నక్షత్రంలో జన్మించాడు. శ్రీ మహా విష్ణువు ఎనిమిదో అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు.

శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీ కృష్ణుని బాల రూపాన్ని అంటే లడ్డూ గోపాలుడిని పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. ఈ ఏడాది శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది? పూజా విధానం, ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

శ్రీ కృష్ణ జన్మాష్టమి తేదీ- ఆగస్టు 26, 2024 రోజు- సోమవారం వచ్చింది.

శుభ ముహూర్తం

అష్టమి తిథి ప్రారంభం - ఆగస్టు 26, 2024 ఉదయం 03:39 గంటల నుంచి

అష్టమి తిథి ముగింపు - ఆగస్టు 27, 2024 మధ్యాహ్నం 02:19 గంటలకు

రోహిణి నక్షత్రం ప్రారంభం - ఆగస్టు 26, 2024 మధ్యాహ్నం 03:55 గంటల నుంచి

రోహిణి నక్షత్రం - ఆగస్ట్ 27, 2024 మధ్యాహ్నం 03:38 గంటలకు ముగుస్తుంది

చంద్రోదయ సమయం - 11:41 PM

నిశిత పూజ సమయాలు - ఆగస్టు 27 అర్థరాత్రి 12:06 AM నుండి 12:51 AM

వ్యవధి - 00 గంటల 45 నిమిషాలు

పూజా విధానం

ఉదయాన్నే లేచి స్నానం చేయాలి. తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి ఇంటి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అనంతం దీపం వెలిగించాలి. సకల దేవతలకు జలాభిషేకం చేయండి. ఈ రోజున శ్రీ కృష్ణుని బాల రూపాన్ని అంటే లడ్డూ గోపాలుడిని పూజిస్తారు. బాలగోపాలుడికి జలాభిషేకం చేయాలి. ఈ రోజు బాలగోపాలుడిని ఊయలలో కూర్చోబెట్టి ఊపుతారు. మీ కోరిక మేరకు కన్నయ్యకు లడ్డూలు నైవేద్యంగా పెట్టండి. సాత్విక వస్తువులు మాత్రమే సమర్పించాలనే విషయం గుర్తు పెట్టుకోవాలి.

ఈ రోజు రాత్రి పూజ చాలా ముఖ్యం. ఎందుకంటే శ్రీ కృష్ణుడు రాత్రి జన్మించాడు. రాత్రి శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేయండి. అలాగే బాలగోపాలుడికి పంచదార మిఠాయి, డ్రై ఫ్రూట్స్‌ను అందించాలి. చివరిగా హారతి ఇవ్వాలి. చిన్ని కృష్ణుడికి ఈరోజు పారిజాత పుష్పాలతో పూజ చేయడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. కృష్ణాష్టమి రోజు ఒక పూట భోజనం చేసి ఇస్కాన్ ఆలయాలను సందర్శించడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.

కృష్ణాష్టమి ప్రాముఖ్యత

శ్రీ కృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున శ్రీకృష్ణుని ఆచారాల ప్రకారం పూజించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ రోజు పూజ చేయడం వల్ల సంతానం లేని దంపతులకు కూడా సంతానం కలుగుతుంది. శ్రీకృష్ణుడు రాత్రిపూట జన్మించాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున, శ్రీకృష్ణుని బాల రూపాన్ని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు. కన్నయ్యను ఇంట్లోకి ఆహ్వానిస్తూ చిన్ని చిన్ని పాద ముద్రలు ఇంటి ముందర వేస్తారు. తమ పిల్లలకు బాలగోపాలుడిలా అందంగా ముస్తాబు చేసుకుని మురిసిపోతారు.

సంతానలేమితో బాధపడుతున్న దంపతులు కృష్ణాష్టమి రోజు సంతాన గోపాల మంత్రంతో పూజ చేయడం వల్ల పిల్లలు కలుగుతారని నమ్ముతారు. అలాగే కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామ పూజ చేయడం వల్ల వంశాభివృద్ది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కన్నయ్యను పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణం చెబుతోంది.

Whats_app_banner