Guru Transit: రోహిణి నక్షత్రంలోకి అడుగుపెట్టిన బృహస్పతి, ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే-jupiter entering rohini nakshatra there is a possibility of good changes for these signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Guru Transit: రోహిణి నక్షత్రంలోకి అడుగుపెట్టిన బృహస్పతి, ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

Guru Transit: రోహిణి నక్షత్రంలోకి అడుగుపెట్టిన బృహస్పతి, ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

Haritha Chappa HT Telugu

Guru Transit: జూన్ 3న గురువు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించారు. బృహస్పతి రోహిణి నక్షత్రంలో ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.

రోహిణి నక్షత్రంలోని గురు గ్రహం (Pexels)

Guru Transit: రాశుల్లో బృహస్పతి ముఖ్యమైన గ్రహం. అతడిని దేవ గురువుగా చెబుతారు. సంతోషం, సంపద ఇచ్చే మూలకారకుడు ఈయనే. జూన్ 13 ఉదయం 6:27 నిమిషాలకు బృహస్పతి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. దీనివల్ల 12 రాశులపై ప్రభావం పడుతుంది. రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు. బృహస్పతి ఈ ఏడాది ఆగస్టు 20 వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి అమిత ప్రయోజనాలు కలుగుతాయి. ఆ రాశులు ఏవో తెలుసుకోండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి బృహస్పతి రోహిణి నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల అంతా మేలే జరుగుతుంది. మీ కెరీర్లో పురోగతి వస్తుంది. ఆకస్మిక ధన లాభాలు వస్తాయి. గౌరవం పెరుగుతాయి. కుటుంబంలోని మనుషులతో మీకు సంబంధాలు మెరుగుపడతాయి. మీరు కొత్త విద్యను నేర్చుకోవచ్చు.

కన్యారాశి

కన్యా రాశి వారికి బృహస్పతి రోహిణి నక్షత్రంలో ఉండడం అన్ని విధాలుగా కలిసివస్తుంది. ఈ సమయం మీకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఓవైపు అదృష్టం వచ్చే అవకాశం ఉంది. అలాగే అసంపూర్తిగా ఉండిపోయిన పనులు ఈ కాలంలో పూర్తయిపోతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. అనుకోకుండా డబ్బులు చేతికి అందుతాయి.

సింహరాశి

రోహిణి నక్షత్రంలో బృహస్పతి ప్రవేశించడం వల్ల సింహ రాశి వారికి అనుకూలమైన మార్పులు జరుగుతాయి. కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే ఇదే వారికి శుభప్రదమైన సమయం. పెట్టుబడులు పెడితే మంచి రాబడి పొందవచ్చు. ప్రతి రంగంలో ఉన్నవారు విజయాన్ని సాధిస్తారు.

తులారాశి

బృహస్పతి రాశి మార్పు కారణంగా తులా రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. జీతం కూడా పెరుగుతుంది. కొత్త మార్గాల ద్వారా ధనం చేతికే అందుతుంది. మీ కష్టానికి తగ్గ ఫలాన్ని ఉద్యోగ స్థలంలో పొందుతారు. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. మీరు ఏ రంగంలో చేయి వేసిన విజయం సాధిస్తారు.