Merucry transit: బుధుడి సంచారంతో వీరి కష్టాలు తీరబోతున్నాయి.. సంపన్నులు కాబోతున్నారు
Merucry transit: ప్రస్తుతం అస్తంగత్వ దశలో ఉన్న బుధుడు త్వరలో ఉదయించబోతున్నాడు. దీని ఫలితంగా కొన్ని రాశుల జాతకులు కష్టాల నుంచి విముక్తి పొందబోతున్నారు. ఆర్థిక లాభాలతో సంపన్నులు కాబోతున్నారు.
Merucry transit: గ్రహాల రాకుమారుడిగా భావించే బుధుడు ఈ నెలలో మరోసారి తన కదలక మార్చుకోబోతున్నాడు. అస్తంగత్వ దశలోకి వెళ్ళిన బుధుడు ఏప్రిల్ 19న మీనరాశిలో ఉదయించబోతున్నాడు.
ఏప్రిల్ నెలలో బుధుడు మూడుసార్లు తన గమనాన్ని మార్చుకున్నాడు. జ్యోతిష లెక్కల ప్రకారం ఏప్రిల్ 2న బుధుడు మేష రాశిలో తిరోగమన దశలో సంచరించాడు. 4వ తేదీన అస్తంగత్వ దశలో మీన రాశిలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. ఇప్పుడు ఏప్రిల్ 19న మీన రాశిలో ఉదయించబోతున్నాడు.
మీనరాశిలో ఇప్పటికే అక్కడ సూర్యుడు, శుక్రుడు, రాహువు కూర్చుని ఉన్నారు. బుధుడి సంచారం కారణంగా అనేక రాజయోగాలు ఏర్పడ్డాయి. శుక్రుడు, బుధుడు కలిసి లక్ష్మీ నారాయణ యోగం సృష్టించారు. అటు సూర్యుడు, బుధుడు కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడ్డాయి.
బుధుడు మీన రాశిలో ఉదయించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలగబోతుంది. తమ తెలివితేటలతో వ్యాపార, ఉద్యోగ రంగాల్లో రాణిస్తారు. కమ్యూనికేషన్స్ స్కిల్స్ తో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మీనరాశిలో బుధుడు ఉదయించడం వల్ల ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.
మేష రాశి
బుధుడి సంచారంతో మేష రాశి జాతకులు అదృష్టాన్ని పొందబోతున్నారు. అనేక విషయాలలో విజయాన్ని అనుభవిస్తారు. ఇది వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది. సంపదను పొందే అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. ఆర్థిక లాభాలకు ఇది అత్యంత అనుకూలమైన అవకాశాలను అందిస్తుంది. సానుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది. సంపన్నులు అవుతారు.
మిథున రాశి
బుధుడు ఉదయించడం వల్ల మిథున రాశి జాతకులు సానుకూల ఆర్థిక దృక్పథాన్ని పొందుతారు. విదేశీ ప్రయాణాలకు అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఊహించని ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఆర్థిక వృద్ధి ఉత్తేజకరమైన ప్రయాణ అవకాశాలతో అదృష్టవంతులుగా మారతారు. అదృష్టం అండగా నిలుస్తుంది. సంపద పెరిగే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి. వ్యాపారం ప్రారంభించాలనుకుంటే ఈ సమయం ఉత్తమం. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు.
సింహ రాశి
బుధుడి సంచారంతో సింహ రాశి వారికి గొప్ప ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. తమ వ్యాపారాల నుండి భారీ లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తిపరమైన రంగంలో సహోద్యోగుల నుండి మద్దతు, సహకారం లభిస్తుంది. ఆర్థిక వృద్ధి పొందుతారు. ఇతరుల సహకారంతో కొన్ని విషయాల్లో విజయం మీదే అవుతుంది. ధన లాభం ఉంటుంది. స్థిరాస్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. కోర్టు కేసుల్లో విజయం మీదే అవుతుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి జాతకులు బుధుడి సంచారంతో తమ చిరకాల కలలను సాకారం చేసుకుంటారు. ఆస్తి, వాహన పరంగా సంతోషం, సంతృప్తి పొందుతారు. ఈ కాలం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన అవకాశాలను అందిస్తుంది. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు నిధులు అందుతాయి. సంపూర్ణమైన జీవితాన్ని గడుపుతారు. బంధువులతో తలెత్తిన అపార్ధాలు తొలగిపోతాయి. వ్యాపారంలో వృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయాన్ని పెంచుకోవడానికి సువర్ణ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక విషయాల్లో అదృష్టవంతులు అవుతారు. అనేక మార్గాల నుంచి ధనం అందుతుంది.