Chaturmasam: చాతుర్మాసం ఈ నాలుగు రాశుల వారికి గుర్తుండిపోయే అద్భుత కాలం
Chaturmasam: చాతుర్మాసానికి హిందూ మతంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. విష్ణువు యోగ నిద్ర కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ సమయంలో నాలుగు రాశుల వారికి విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
Chaturmasam: హిందూ మతంలో చాతుర్మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. జులై 6 నుంచి ఆషాడ మాసం ప్రారంభం కాబోతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చాతుర్మాసం ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి నుండి ప్రారంభమై కార్తీక మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశితో ముగుస్తుంది.
శ్రీమహావిష్ణువు చాతుర్మాస సమయంలో యోగ నిద్రలోకి వెళతాడని అంటారు. దేవశయని ఏకాదశితో చాతుర్మాసం ప్రారంభం అవుతుంది. దేవుత్థాని ఏకాదశి రోజున ఈ మాసం ముగియడంతో శ్రీ హరి యోగం మేల్కొంటాడని నమ్ముతారు. నాలుగు నెలల పాటు చాతుర్మాసం ఉంటుంది.
ఈ సమయంలో పెళ్లి, గృహ ప్రవేశాలు, లగ్న పత్రిక రాసుకోవడం వంటి శుభ కార్యాలు చేసేందుకు ఇది ముహూర్తాలు ఉండవు. మళ్ళీ విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ముహూర్తాలు ఉంటాయి. ఈ మాసం ఎక్కువగా విష్ణు ఆరాధనకు, వ్రతాలు, పూజలు చేసుకునేందుకు అనువైన సమయంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం చాతుర్మాసం 17 జూలై 2024 నుండి ప్రారంభమై 12 నవంబర్ 2024 న దేవుత్థాని ఏకాదశి నాడు ముగుస్తుంది.
ఈ నాలుగు నెలలు కొన్ని రాశుల వారికి విష్ణుమూర్తి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది. జీవితంలో మధురమైన రోజులుగా ఇవి మిగిలిపోబోతున్నాయి. విష్ణువు దయతో అద్భుతాలు చూడబోతున్నారు. ఆ రాశులు ఏవి ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో చూద్దాం.
మేష రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేష రాశి వారికి చాతుర్మాసం చాలా శుభప్రదం కానుంది. ఈ రాశి వారికి ఆర్థిక పురోభివృద్ధితో పాటు వృత్తిలో పురోభివృద్ధి జరిగే సూచనలు ఉన్నాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తాయి. ఈ కాలంలో మీరు డబ్బును కూడబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. అనేక మార్గాల నుంచి ఆదాయం పుష్కలంగా వస్తుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి రానున్న నాలుగు నెలలు చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి. చాతుర్మాసంలో శ్రీమహావిష్ణువు విశేష ఆశీస్సులు ఈ రాశి వారికి ఉంటాయి. దేవశయని ఏకాదశితో వృషభ రాశి వారికి అన్ని సమస్యలు తీరుతాయి. మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. డబ్బు రావడంతో ఆనందానికి అవధులు ఉండవు.
సింహ రాశి
సింహ రాశి వారికి చాతుర్మాసం చాలా మేలు చేస్తుంది. ఈ మాసంలో విష్ణువు అనుగ్రహంతో మీరు కొన్ని పెద్ద విజయాలు పొందవచ్చు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ కాలం వ్యాపారులకు కూడా శుభప్రదంగా ఉంటుంది.
కన్యా రాశి
దేవశయని ఏకాదశి నుండి రాబోయే నాలుగు నెలలు కన్యా రాశి వారికి చిరస్మరణీయంగా ఉండబోతున్నాయి. చాతుర్మాసంలో మీరు శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. పురోగతికి కొత్త దారులు తెరుచుకుంటాయి. మంచి పెట్టుబడి రాబడిని పొందే సంకేతాలు ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితి బాగుంటుంది.
ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.