Devshayani Ekadashi 2024: ఆషాఢ మాసంలో దేవశాయని ఏకాదశి ఎప్పుడు? ఆ రోజు పూజా విధానం ఏమిటి?
Devshayani Ekadashi 2024: ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశిని దేవశాయని ఏకాదశి అని కూడా అంటారు. హిందూమతంలో ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
హిందూమతంలో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది. ఒకటి కృష్ణపక్షంలో, మరొకటి శుక్లపక్షంలో. సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు ఉన్నాయి. ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అంకితమైనది. ఆషాఢ మాసంలో దేవశాయని ఏకాదశి వస్తోంది . శుక్లపక్ష ఏకాదశి తేదీ, శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.
దేవశాయని ఏకాదశి వ్రతం తేదీ - జూలై 17 , 2024
దేవశయని ఏకాదశి ముహూర్తం -ఏకాదశి
తిథి ప్రారంభం - జూలై 16, 2024 రాత్రి 08:33 గంటలకు
ఏకాదశి తిథి ముగింపు - జూలై 17, 2024 రాత్రి 09:02 గంటలకు
దేవశాయని ఏకాదశి వ్రత పారాయణ సమయం -18 జూలై 05:52 AM
ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి సూర్యుడు, శుక్రుడు, బుధుడు, కుజుడుతో కలిసి నాలుగు నెలల పాటు నిద్రావస్థలో ఉంటాడు. కార్తీక మాసంలో శుక్లపక్షం ఏకాదశి వరకు ఇలా విష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు. ఈ సమయాన్ని చాతుర్మాస్ అని కూడా అంటారు.
దేవశయని ఏకాదశి పూజ విధి
దేశశయని ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలకు స్నానం చేయాలి. ఇంట్లో దీపం పెట్టుకోవాలి. గంగా జలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయండి. విష్ణుమూర్తికి పూలు, తులసి, పెసర పప్పు సమర్పించాలి. వీలైతే ఈ రోజున ఉపవాసం చేయండి. విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి. విష్ణుమూర్తికి సమర్పించే భోగంలో తులసి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. తులసి లేకుండా విష్ణువు భోగం తీసుకోడని నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున, విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజించాలి. ఆ రోజంతా భగవంతుని నామస్మరణలో ఎక్కువకాలం గడపాలి.
దేవశాయని ఏకాదశి ప్రాముఖ్యత
ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. ఈ ఉపవాసాన్ని ఆచరించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయి. హిందు మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మరణించిన తరువాత మోక్షం లభిస్తుంది.
కావాల్సిన పూజా సామగ్రి
దేవశాయని ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించేందుక కావాల్సిన పూజా సామాగ్రి వివరాలు ఇక్కడ ఇచ్చాం.
విష్ణు మూర్తి చిత్రపటం, పువ్వులు, కొబ్బరి కాయ, తమలపాకులు, పండ్లు, లవంగాలు, నెయ్యి, పంచామృతం, తులసి, అక్షింతలు, చందనం, పెసరపప్పు, స్వీట్స్… ఇవన్నీ పూజకు అవసరం.
విశ్వరూపుడైన విష్ణువును పూజించడం ద్వారా ఎన్నో పాపాలను పొగొట్టుకోవచ్చు. హిందువుల నిత్య ఆరాధ్య దేవుడు శ్రీ మహావిష్ణువు.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం।
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యాన గమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాథమ్
ఈ శ్లోకాన్ని పదేపదే జపించడం వల్ల మహా విష్ణువు దయ, కరుణ మీపై కలుగుతుంది.
టాపిక్