Ashada masam 2024: ఆషాడ మాసం ఈ రాశుల వారికి అనుకూలం.. విష్ణుమూర్తి అనుగ్రహంలో మంచి లాభాలు-ashada masam which zodiac signs are get lord vishnu blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ashada Masam 2024: ఆషాడ మాసం ఈ రాశుల వారికి అనుకూలం.. విష్ణుమూర్తి అనుగ్రహంలో మంచి లాభాలు

Ashada masam 2024: ఆషాడ మాసం ఈ రాశుల వారికి అనుకూలం.. విష్ణుమూర్తి అనుగ్రహంలో మంచి లాభాలు

Gunti Soundarya HT Telugu
Jun 24, 2024 04:40 PM IST

Ashada masam 2024: ఆషాడ మాసం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో విష్ణుమూర్తి అనుగ్రహంతో కొన్ని రాశుల వారికి వృత్తి, వ్యక్తిగతంగా మంచి పురోగతి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు.

ఆషాడ మాసం ఈ రాశుల వారికి అనుకూలం
ఆషాడ మాసం ఈ రాశుల వారికి అనుకూలం

Ashada masam 2024: తెలుగు క్యాలెండర్ ప్రకారం మరికొద్ది రోజుల్లో జ్యేష్ఠ మాసం ముగియబోతుంది. త్వరలో ఆషాడ మాసం ప్రారంభం కానుంది. ఈ నెల రుతుపవనాల రాకను సూచిస్తుంది. ఆషాడ మాసం తెలుగు నెలల్లో నాలుగోది. ఈ మాసంలో ఎక్కువగా దైవ ఆరాధనకు ప్రాధాన్యత ఉంటుంది. విష్ణుమూర్తితో పాటు శివుడు, హనుమంతులను పూజిస్తారు.

ఆషాడ మాసంలో వచ్చే దేవశయని ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళతాడు. ఈ సమయాన్ని చాతుర్మాసం అని పిలుస్తారు. ఈ మాసంలో గురు పౌర్ణమి, గుప్త నవరాత్రులు వచ్చాయి. ఆషాడ మాసంలో విష్ణు మూర్తి అనుగ్రహం పొందిన కొన్ని రాశులు ఉన్నాయి. మేషం, సింహం, తులా రాశులతో పాటు మరికొందరికి ఆషాడ మాసం అనుకూలంగా ఉంటుంది. ఆన్ని పనులు సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఈ సమయంలో ఏ రాశుల వాళ్ళు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు.

మేష రాశి

మేష రాశి వారికి ఆషాడ మాసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నెలలో వీరి వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. ప్రముఖులైన వ్యక్తులను కలుసుకుంటారు. జీవితంలో అనేక సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. జీవన శైలిలో మెరుగుదల ఉంటుంది. సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారికి ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబంలోని సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి.

వృషభ రాశి

ఆషాడ మాసం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ధన కొరత ఉండదు. వృత్తిలో అధిక పురోగతి సాధిస్తారు. ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఈ సమయంలో మంచి ప్యాకేజ్ తో ఉద్యోగం లభిస్తుంది. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా విహారయాత్రకు వెళతారు.

సింహ రాశి

విష్ణువు అనుగ్రహంతో ఆషాడ మాసంలో సింహ రాశి వారికి ఆన్ని రంగాలలో విజయం గోచరిస్తుంది. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఊహించని మార్గాల నుంచి ధనం చేకూరుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఏర్పడిన సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు.

కన్యా రాశి

ఈ రాశి వారికి కోరికలు ఆషాడ మాసంలో నెరవేరతాయి. కన్యా రాశి వాళ్ళు తమ సామర్థ్యం నిరూపించుకునేందుకు ఈ సమయం అనువైనది. ఆస్తి, వాహనం కొనుగోలు చేయాలనే ఆశ నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు మంచి ఆఫర్లు అందుతాయి. పెట్టుబడి పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విష్ణు మూర్తి ఆశీస్సుల ఫలితంగా ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.

తులా రాశి

ఆషాడ మాసం తులా రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలమైనది. ప్రతి రంగంలో భారీ విజయాన్ని సాధిస్తారు. విష్ణుమూర్తి పూర్తి అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభకార్యం జరుగుతుంది. ఇంట్లో పూజ లేదా వ్రతం చేసుకుంటారు. మీ తీరని కోరికలు ఈ సమయంలో నెరవేరతాయి. ఆర్థిక పరంగా ధృడంగా ఉండటంతో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.

మకర రాశి

డబ్బు పరంగా ఆషాడ మాసం మకర రాశి వారికి మంచిగా ఉంటుంది. ఉద్యోగంలో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి. సంతోషంగా జీవిస్తారు. వ్యాపారస్థులకు మంచి లాభాలు కలుగుతాయి. ప్రేమ బంధాలు బలోపేతం అవుతాయి.

WhatsApp channel