Diwali 2024: ఈ దీపావళికి ఏడు విగ్రహాలను మీ ఇంట్లో ఉంచండి ధనానికి కొరత ఉండదు-keeping these 7 idols never leads to shortage of wealth and grains ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Diwali 2024: ఈ దీపావళికి ఏడు విగ్రహాలను మీ ఇంట్లో ఉంచండి ధనానికి కొరత ఉండదు

Diwali 2024: ఈ దీపావళికి ఏడు విగ్రహాలను మీ ఇంట్లో ఉంచండి ధనానికి కొరత ఉండదు

Gunti Soundarya HT Telugu
Oct 22, 2024 04:08 PM IST

Diwali 2024: దీపావళి పండుగ సందర్భంగా పూజ చేసుకునేందుకు లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకొస్తారు. అయితే దానితో పాటు ఈ దీపావళికి మీ ఇంటికి ఈ విగ్రహాలను కూడా తెచ్చుకోండి. ఇవి ఉండటం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సుకు కొదువ ఉండదు. మీ ఇంటి మీద లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి.

దీపావళికి ఈ విగ్రహాలను ఇంటికి తెచ్చుకోండి
దీపావళికి ఈ విగ్రహాలను ఇంటికి తెచ్చుకోండి

దీపావళి పండుగ ఆనందం, శ్రేయస్సును ఇచ్చే పండుగ. ఈ పర్వదినాన దీపాలు వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి, వినాయకుడిని, సంపదకు రాజు అయిన కుబేరుడిని పూజిస్తారు. ఈ పవిత్ర పండుగ సందర్భంగా ప్రజలు తమ ఇళ్లు, దేవాలయాలను పువ్వులు, దీపాలతో అలంకరించి లక్ష్మీ దేవిని స్వాగతిస్తారు.

ఈ పండుగ కేవలం అలంకరణకే కాకుండా ఇంటి నుండి ప్రతికూలతను తొలగించి సానుకూల శక్తితో పాటు ఆనందం, శ్రేయస్సు, ఆశీర్వాదాలను తీసుకురావడానికి కూడా చాలా పవిత్రమైనది. అందుకే ఈ దీపావళికి దీపాలే కాకుండా ఇంటి అలంకరణ కోసం కొన్ని విగ్రహాలను కూడా కొనుగోలు చేయండి. ఈ విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయి. ఇంట్లో సంపదకు లోటు ఉండదని నమ్మకం. దీపావళి రోజున మీరు మీ ఇంటికి తప్పనిసరిగా తీసుకురావాల్సిన కొన్ని ప్రత్యేక విగ్రహాలు ఇవి.

లక్ష్మీ దేవి విగ్రహం

వాస్తవానికి ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం ఉంటుంది. దీపావళి పూజ కోసం లక్ష్మీ దేవి మట్టి విగ్రహాన్ని కూడా తీసుకువస్తారు. అయితే ఇంట్లో లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలంటే ఇత్తడి, వెండి లేదా రాగితో చేసిన లక్ష్మీ దేవి విగ్రహాన్ని తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాలి. విష్ణుమూర్తితో కూడిన లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఇంకా మంచిది.

గుడ్లగూబ విగ్రహం

గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. అందువల్ల గుడ్లగూబ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం కూడా చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. మత విశ్వాసాల ప్రకారం గుడ్లగూబ విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే ఎప్పుడూ సంపదకు కొరత ఉండదు. వాస్తు దృష్ట్యా గుడ్లగూబ విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం. మీ ఇంట్లో గుడ్లగూబ విగ్రహం లేకుంటే ఈ దీపావళికి తప్పకుండా తీసుకురండి.

గణేశుడి విగ్రహం వల్ల ఐశ్వర్యం వస్తుంది

హిందూ మతంలో తొలిపూజ అందుకునేందుకు వినాయకుడే. ప్రతి శుభ కార్యంలో ముందుగా వినాయకుడిని పూజిస్తారు. విఘ్నాలను తొలగించే గణేశుడిని పూజించడం వల్ల అన్ని ఆటంకాలు తొలగిపోయి సకల కార్యాలు సిద్ధిస్తాయి. దీపావళి సందర్భంగా కూడా లక్ష్మీదేవితో పాటు గణేశుడిని పూజిస్తారు. ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ఉంచడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల ఏ పనికి ఆటంకాలు ఉండవని, ప్రతి ఒక్కరూ పురోభివృద్ధి చెందుతారని విశ్వాసం.

ఏనుగు విగ్రహం

ఏనుగు సంపద, కీర్తికి చిహ్నంగా పరిగణిస్తారు. మొదటి వినాయకుడికి ప్రాణం పోయడానికి అతని తలపై ఏనుగు తలను ఉంచారు, అందుకే ఏనుగును గణేశుడిగా కూడా పూజిస్తారు. ఇంట్లో రాగి, ఇత్తడి లేదా వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచడం చాలా శ్రేయస్కరం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇది ఇంటికి సానుకూల శక్తిని తెస్తుంది. ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు ఉంటుంది.

కామధేనువు విగ్రహం

మతపరమైన, పౌరాణిక విశ్వాసాల ప్రకారం కామధేనువు అన్ని కోరికలను తీరుస్తుంది. ఇంట్లో కామధేను విగ్రహాన్ని ఉంచడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. కామధేనుడి విగ్రహం ఉన్న ఇంట్లో ఎప్పుడూ సంపదకు లోటు ఉండదని చెబుతారు. ఇంటి సభ్యులందరి కోరికలు నెరవేరుతాయి.

క్రిస్టల్ లేదా మెటల్ పిరమిడ్

స్ఫటికం లేదా లోహంతో చేసిన పిరమిడ్‌ను కూడా ఇంట్లో ఉంచాలి. ఇది ఇంటి నుండి ప్రతికూలతను దూరం చేస్తుంది. ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకువస్తుంది. మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో స్ఫటికం లేదా లోహంతో చేసిన పిరమిడ్‌ను ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అందుకే దీపావళి సందర్భంగా క్రిస్టల్ లేదా లోహంతో చేసిన పిరమిడ్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి.

తాబేలు

విష్ణువు తన రెండవ అవతారాన్ని కూర్మ రూపంలో అంటే తాబేలు రూపంలో తీసుకున్నాడు. అందువల్ల తాబేలుకు మతపరమైన ప్రాముఖ్యత చాలా ఎక్కువ. ఇత్తడి, రాగి లేదా వెండితో చేసిన తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీ దేవిని ప్రసన్నురాలు అవుతుంది. ఇంట్లో ఎల్లప్పుడూ ఉంటుంది. తాబేలు నీటి జీవి అని అందరికీ తెలుసు. తాబేలును ఎప్పుడూ ఇంట్లో నీరు లేకుండా ఉంచకూడదని గుర్తుంచుకోండి.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner