Venus transit: మార్చి వరకు ఈ రాశుల మీద లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది-goddess lakshmi devi blessings on these zodiac signs till march 6th on venus transit in makara rashi ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Venus Transit: మార్చి వరకు ఈ రాశుల మీద లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది

Venus transit: మార్చి వరకు ఈ రాశుల మీద లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది

Gunti Soundarya HT Telugu
Jan 24, 2024 07:00 AM IST

Venus transit: శుక్రుడు త్వరలో తన రాశి మార్చుకోబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల మీద లక్ష్మీదేవి కరుణ చూపించబోతుంది.

శుక్ర సంచారంతో అదృష్టం పొందే రాశులు ఇవే
శుక్ర సంచారంతో అదృష్టం పొందే రాశులు ఇవే (pixabay)

Venus transit: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకు కారణం గ్రహాల రాశి మార్పు మొత్తం పన్నెండు రాశుల మీద శుభ, అశుభ ప్రభావం చూపుతుంది. ఫిబ్రవరి నెలలోనే ఐదు పెద్ద గ్రహాలు రాశులని మార్చుకుంటున్నాయి. ఒకే రాశిలోకి బుధుడు, సూర్యుడు, కుజుడు, శుక్రుడు రాబోతున్నారు. ఇవన్నీ మకర రాశిలో కలుసుకోవడం వల్ల అనేక రాజ యోగాలు కూడా ఏర్పడుతున్నాయి.

శుక్రుడు కదలిక చాలా శుభప్రదంగా భావిస్తారు. జాతకంలో శుక్రుడు స్థానం శుభప్రదంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో సంపదకి ఎటువంటి లోటు ఉండదు. అటువంటి శుక్రుడు తన నడకని మార్చుకోబోతున్నాడు. శుక్ర గ్రహం లక్ష్మీదేవికి సంబంధించినదని నమ్ముతారు. అందుకే శుక్ర స్థానం బలంగా ఉంటే వారి మీద లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుందని భావిస్తారు.

ప్రస్తుతం శుక్రుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు. ఫిబ్రవరి 12 సోమవారం ఉదయం మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మార్చి 5 వరకు శుక్రుడు ఈ రాశిలోనే ఉండబోతున్నాడు. శుక్రుడు సంతోషం, ఆనందం, సంపద, సాహిత్యం, అందం, కళలు, వైభవానికి ప్రతీకగా చెప్తారు. శుక్రుడు రాశి మార్పు వల్ల కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శుక్రుడు ప్రవేశించబోయే మకర రాశిలో అప్పటికే గ్రహాల యువరాజు బుధుడు, అంగారకుడు ఉంటారు. శుక్రుని సంచారంతో ఎయే రాశుల వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్ అవబోతున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి వారికి శుక్రుడి సంచారం ప్రయోజనకరంగా మారబోతుంది. పని ప్రాంతంలో పెట్టుబడి పెట్టేందుకు ఒక మంచి ఒప్పందం మీ ముందుకు రాబోతుంది. అది మీకు లాభదాయకంగా మారనుంది. దీని వల్ల మేష రాశి వారి సంపద పెరుగుతుంది. అందమైన ప్రదేశాలు సందర్శించేందుకు ట్రిప్ కు కూడా వెళతారు. ఆర్థికంగా పుంజుకునే సమయం ఇది. జీవితంలో రొమాన్స్ అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భక్తి భావంతో మెలుగుతారు.

కర్కాటక రాశి

శుక్ర సంచారం కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. మీ శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది. ఇంటి వాతావరణం సుఖశాంతులతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ లవర్ తో డేటింగ్ కు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడం కోసం కొత్త మార్గాలు మీకు తారసపడతాయి. కొత్త ఉద్యోగం పొందే అవకాశం ఉంది.

మకర రాశి

పెద్ద గ్రహాలన్నీ ఈ మకర రాశిలోకే కలుసుకోబోతున్నాయి. అందుకే ఈ రాశి జాతకులకి శుక్రుని సంచారం కూడా శుభప్రదంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. శృంగార జీవితం తృప్తికరంగా ఉంటుంది. షార్ట్ ట్రిప్ కి వెళ్ళే అవకాశం ఉంది. కెరీర్ లో కొత్త పనులు దొరుకుతాయి. వృత్తిపరంగా, ఆర్థికంగా స్థిరపడతారు.

WhatsApp channel