Phalguna masam festivals: ఫాల్గుణ మాసంలో వచ్చే పండుగలు ఏంటి? దానధర్మాలకు ఈ మాసం ఎందుకంత ప్రత్యేకం?
Phalguna masam festivals: ఏప్రిల్ 8 వరకు ఫాల్గుణ మాసం ఉంటుంది. ఈ నెలలో దాన ధర్మాలకు, ఉపవాసాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో వచ్చే పండుగలు ఏంటి?
Phalguna masam festivals: మాఘ మాసం తర్వాత వచ్చేది ఫాల్గుణ మాసం. ఈ మాసంలో శివుడు, సీతాదేవిని, శ్రీకృష్ణుడిని, లక్ష్మీదేవి, చంద్రుని పూజిస్తారు. దానధర్మాలకు, ఉపవాసాలకు, పూజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన మాసం ఇది. ఈ మాసంలో దేవతలను పూజించడం ద్వారా అనేక సవాళ్లు అధిగమిస్తారు. ఆనందం, వృద్ధి సాధించేందుకు దోహదపడుతుంది.
ఫాల్గుణ మాసానికి హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది. విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం ఇది. ఈ మాసంలో విష్ణువుతో పాటు శివుడిని ఆరాధించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి. శివ భక్తులకు గొప్ప పండుగ మహా శివరాత్రిని ఈ మాసంలోనే జరుపుకుంటారు. ఈ మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి విజయాలను ఇచ్చే విజయ ఏకాదశి కాగా రెండోది అమలకి ఏకాదశి. ఈ రోజుల్లో భక్తులు ఉపవాసం ఉండి శివుడిని ఆరాధిస్తారు.
కుల,మత బేధాలు లేకుండా జరుపుకునే హోలీ పండుగతో ఈ మాసం మగుస్తుంది. పురాణాల ప్రకారం చంద్రుడు ఫాల్గుణ మాసంలోనే జన్మించాడని అంటారు. అందుకే ఈ సమయంలో చంద్రదేవుని ఆరాధించడం చేస్తారు. చంద్రుడి స్థానం బలహీనంగా ఉంటే చంద్రుడికి సమర్పించడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి.
దాన ధర్మాలకు ప్రాముఖ్యత
నెయ్యి, అన్నదానం, ధాన్యాలు, వస్త్రాలు వంటివి ఈ సమయంలో దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం సంవత్సరం ముగింపుని ఫాల్గుణ మాసం సూచిస్తుంది. ఈ సమయంలో దానధర్మాలు, పుణ్య కార్యాలు, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటే అత్యంత ప్రయోజనకరమైన ఫలితాలు పొందుతారు. వస్త్రాలు దానం చేసే సంప్రదాయం ఎక్కువగా పాటిస్తారు.
స్వచ్ఛమైన నెయ్యి, నువ్వుల నూనె, ఆవాల నూనె, కాలానుగుణ పండ్లు, ఇతర వస్తువులను పూజ సమయంలో నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ మాసంలో దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం దక్కుతుంది. అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది.
ఫాల్గుణ మాసంలో వచ్చే పండుగలు
సంకష్ట చతుర్థి, విజయ ఏకాదశి, మహాశివరాత్రి, ఫాల్గుణ అమావాస్య, అమలకి ఏకాదశి, హోలీ పండుగలు ఈ మాసంలో వస్తాయి. ఈ సమయంలో ఎక్కువ మంది శ్రీకృష్ణుని ఆరాధిస్తారు. కృష్ణ భగవానుడిని పూజించడం వల్ల వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు.
ఫాల్గుణ మాసంలో చేయకూడని పనులు
ఫాల్గుణ మాసంలో మతపరమైన పండుగలతో పాటు వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. శీతాకాలం నుంచి వేసవికాలం రావటం వల్ల శరీరంలోని మార్పులు జరుగుతాయి. అందుకు అనుగుణంగా ఆహార నియమాలు పాటించాలి. గోధుమలు, ఇతర ధాన్యాలు తీసుకోకపోవడం మంచిది. చాలా వేడిగా లేదా చల్లగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. ఇది మీ ఆరోగ్యం ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. పండ్లు, పౌష్టికాహారం తీసుకోవాలి.
మద్యపానానికి దూరంగా ఉండాలి. ఈ మాసంలో శివ భక్తులకు ఇష్టమైన మహా శివరాత్రి, రాధాకృష్ణులని స్మరించుకుంటూ హోలీ పండుగ జరుపుకుంటారు. అందుకే ఈ సమయంలో మాంసాహారం, చేపలు వంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. శ్రీకృష్ణ భగవానుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఆయనకి ఇష్టమైన పుష్పాలను సమర్పించడం వల్ల కృష్ణుడు అనుగ్రహం పొందుతారు.