Dasara 2024: దసరా పండుగ అక్టోబర్ 12న లేదా 13న? విజయ దశమి ఎప్పుడు నిర్వహించుకోవాలి?
Dasara 2024: దసరా ఎప్పుడు నిర్వహించుకోవాలనే విషయంపై సందిగ్ధత ఉంది. అక్టోబర్ 12న లేక 13న… ఎప్పుడు విజయదశమి నిర్వహించుకోవాలో తెలియడం లేదు. దసరా సరైన తేదీ, తిథి, శుభ ముహూర్తం గురించి తెలుసుకోండి.
దసరా 2024: దసరా పండుగను దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా , మహిషాసురుడిపై దుర్గామాత విజయం, రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా దసరాను నిర్వహించుకుంటారు. నవరాత్రులు చివరి రోజు దసరా. దసరాలో దుర్గాపూజ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది దసరా ఎప్పుడు నిర్వహించుకోవాలో సరైన తేదీపై కొంత సందిగ్ధత నెలకొంది. దసరాను ఏ రోజు నిర్వహించుకోవాలో చాలా మందికి తెలియడం లేదు.
దసరా 2024: విజయదశమి ఎప్పుడు?
ఈ ఏడాది దశమి తిథి రెండు రోజుల పాటు ఉంటుంది. అందువల్ల అక్టోబర్ 12 లేదా 13న కూడా దశమి తిథి ఉంటుంది. కాబట్టి ఆ రెండు రోజుల్లో దసరా ఎప్పుడు నిర్వహించుకోవాలనే సందిగ్ధత నెలకొంది. ద్రిక్ పంచాంగం ప్రకారం అక్టోబర్ 12 శనివారం విజయదశమి నిర్వహించుకోవాలి.
దసరా శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన తిథులు ఇక్కడ ఉన్నాయి:
విజయ్ ముహూర్తం - మధ్యాహ్నం 2:03 నుండి 2:49 వరకు
అపరాహణ పూజ సమయం - మధ్యాహ్నం 1:17 నుండి 3:35 గంటల వరకు
దశమి తిథి ప్రారంభం - అక్టోబర్ 12న ఉదయం 10:58 గంటలకు
దశమి తిథి ముగింపు - అక్టోబర్ 13న ఉదయం 9:09 గంటలకు
దసరా లేదా విజయదశమి ప్రాముఖ్యత రావణ రాక్షసునిపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా, దుర్గా దేవి మహిషాసురుడిపై విజయం సాధించిన సందర్భంగా నిర్వహించుకుంటారు. ఈ పండుగ తరువాత అత్యంత పవిత్రమైన దీపాల పండుగ దీపావళి వస్తుంది.
హిందూ సంస్కృతిలో దసరాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెడు ఎంత శక్తివంతమైనదిగా కనిపించినా, చివరికి ధర్మమే గెలుస్తుందనే విశ్వజనీన సందేశాన్ని దసరా పండుగ బలపరుస్తుంది.
పురాణాల ప్రకారం లంకను పాలించిన రావణుడు… రాముడి భార్య సీతను అపహరించాడు. శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, వానరసేన కలిసి సీతామాతను రక్షించారు. రావణుడితో వీరు భీకర యుద్ధం చేశారు. పది రోజుల పాటూ రాముడు, రావణుడితో పోరాడి ఓడించాడు. ఇది చెడుపై మంచి గెలుపుకు చిహ్నం. ఈ ఉత్సవాలకు గుర్తుగా దేశంలోని చాలా ప్రాంతాలలో రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తారు.
విజయదశమి సందర్భంగా దుర్గామాత మహిషాసురునిపై సాధించిన విజయాన్ని కూడా స్మరించుకుంటారు. బెంగాల్ లో విజయదశమి సందర్భంగా సింధూర్ ఖేలా, ధునుచి నృత్యాలతో జరుపుకుంటారు. అదనంగా, దుర్గా విగ్రహాల నిమజ్జనం (దుర్గా విసర్జన) శక్తివంతమైన ఊరేగింపులతో జరుగుతుంది, ఇది దేవత స్వర్గంలో ఉన్న తన నివాసానికి తిరిగి రావడాన్ని సూచిస్తుంది.
టాపిక్