Shiva dhanassu: సీతా స్వయంవరంలో శ్రీరాముడు విరిచిన శివధనస్సు గురించి మీకు తెలుసా?-do you know about shivadhanassu bow broken by lord rama in sita swayamvaram ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Shiva Dhanassu: సీతా స్వయంవరంలో శ్రీరాముడు విరిచిన శివధనస్సు గురించి మీకు తెలుసా?

Shiva dhanassu: సీతా స్వయంవరంలో శ్రీరాముడు విరిచిన శివధనస్సు గురించి మీకు తెలుసా?

Gunti Soundarya HT Telugu

Shiva dhanassu: సీతా స్వయంవరంలో శ్రీరాముడు జానకిని పరిణయం ఆడేందుకు శివ ధనస్సు విరిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ధనస్సు ప్రాముఖ్యత ఏంటి? పురాణాలలో ఉన్న శక్తివంతమైన విల్లులు గురించి మీకు తెలుసా?

సీతా స్వయంవరంలో శ్రీరాముడు విరిచిన శివధనస్సు (pinterest)

Shiva dhanassu: సీతాదేవి కోసం ఏర్పాటు చేసిన స్వయంవరంలో శ్రీరాముడు శివధనస్సుని విరిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ విల్లు వెనక ఉన్న కథ మాత్రం ఎవరికీ తెలియదు. ఎంతో బలమైన, శక్తివంతమైనది ఈ ధనస్సు. అటువంటి విల్లుని శ్రీరాముడు సులువుగా విరిచాడు. అలా సీతారాముల వివాహం జరిగింది. పురాణాల ప్రకారం శివధనస్సు పరమశివుడి దివ్యాయుధం.

పురాణాలలో ఆయుధాలు అంటే విల్లు, బాణం. దేవుళ్ళ చేతుల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. శ్రీరాముడు దగ్గర నుంచి పరశురాముడు వరకు అందరి చేతుల్లో విల్లు ఆయుధంగా ఉంది. వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ విల్లుకి అపారమైన శక్తి ఉంటుందని నమ్ముతారు. వాటిని నాశనం చేయడం అనివార్యం. పురాణాల ప్రకారం దైవిక వాస్తు శిల్పి విశ్వకర్మ వీటిని రూపొందించారు. ఈ ఆయుధాలని శక్తి, శౌర్యం, దైవికానికి చిహ్నంగా భావిస్తారు. పురాణాలలో ఉన్న నాలుగు అత్యంత శక్తివంతమైన విల్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గాండీవ

హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన శక్తివంతమైన విల్లు గాండీవ ఒకటి. మహాభారత ఇతిహాసంలో శ్రీకృష్ణుడు, అర్జునుడికి మధ్య అనుబంధానికి గుర్తు ఈ గాండీవ. దీనితోనే అర్జునుడు కురుక్షేత్ర యుద్ధం చేసి గెలుపొందాడు. ఈ విల్లుని విశ్వకర్మ రూపొందించారు. ప్రకాశవంతమైన బాణాల వర్షం కురిపించగలే సామర్థ్యం దీనికి ఉంది. ఈ విల్లుకి మొత్తం 108 తీగలు ఉన్నాయని వాటిని విరిచేయడం అసాధ్యం అని కూడా చెబుతారు. గాండీవాన్ని అర్జునుడు ఎంతో నైపుణ్యంతో ఉపయోగించారు. కురుక్షేత్ర యుద్ధంలో ఇది గొప్ప పాత్ర పోషించినది పురాణాలు చెబుతున్నాయి.

సారంగ్

హిందూ పురాణాలలో చెప్పిన మరొక శక్తివంతమైన విల్లు సారంగ్. రామాయణంలో శ్రీరాముడు ఈ విల్లును ఉపయోగించాడు. అపారమైన బలం దీనికి ఉందని చెప్తారు. ఈ విల్లుతో బాణం సంధిస్తే ఎంతటి వాడైనా నేలకొరగాల్సిందే. సీతాదేవిని రక్షించడానికి శ్రీ రాముడు చేసిన పోరాటంలో రాక్షసులను సంహరించడంలో సారంగ్ కీలక పాత్ర పోషించింది. పది తలల రాక్షసుడు రావణాసురుడిని సంహరించేందుకు రాముడు సారంగ్ నుంచి బాణాన్ని ప్రయోగించాడు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఈ విల్లు సూచిస్తుంది.

పినాక

పినాక విల్లు అంటే ఎవరికీ అర్థం కాదు. కానీ సీతా స్వయంవరంలో శ్రీరాముడు విరిచిన శివధనస్సు అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. ముర అనే రాక్షసుడు కొమ్ము నుంచి ఈ విల్లుని రూపొందించారు. దీన్నే శివధనస్సు అంటారు. శివుడి ఆయుధం. దక్ష ప్రజాపతి పినాక వినాశనానికి చిహ్నంగా ఉంటుంది. ఈ శివధనస్సును శ్రీరాముడు సులభంగా విరిచాడు. తర్వాత సీతాదేవితో శ్రీరాముడికి కళ్యాణం జరిగింది. మొత్తం సైన్యాన్ని, ప్రపంచాన్ని నాశనం చేయగల శక్తి పినాకకి ఉంది.

విజయ

విష్ణువు ఆరో అవతారం పరశురాముడు ఉపయోగించిన విల్లు పేరు విజయ. తన ప్రజలను అణచివేసే రాజులను సంహరించడానికి పరశురాముడు ఆయుధం చేతపట్టాడు. పురాణాల ప్రకారం ఈ విల్లుని పరమశివుడు స్వయంగా పరుశురాముడికి బహుమతిగా ఇచ్చాడని చెబుతారు. ఇది దైవిక శక్తుల కలయికకి ప్రతీకగా చెప్తారు. శత్రువులను చంపడంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఇతిహాసాలలో ధర్మాన్ని నిలబెట్టడంలో విజయ విల్లు పాత్ర ముఖ్యమైన భూమిక పోషించింది.