Maha shivaratri 2024: శివరాత్రికి ఈ వస్తువులు మీ ఇంటికి తెచ్చారంటే పరమశివుడు ఆశీస్సులు లభిస్తాయి-buy these things on the day of maha shivaratri you will get lord shiva blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Maha Shivaratri 2024: శివరాత్రికి ఈ వస్తువులు మీ ఇంటికి తెచ్చారంటే పరమశివుడు ఆశీస్సులు లభిస్తాయి

Maha shivaratri 2024: శివరాత్రికి ఈ వస్తువులు మీ ఇంటికి తెచ్చారంటే పరమశివుడు ఆశీస్సులు లభిస్తాయి

Gunti Soundarya HT Telugu
Feb 29, 2024 11:07 AM IST

Maha shivaratri 2024: మార్చి 8 ఎటు చూసినా శివ నామ స్మరణతో మారుమోగిపోతుంది. ఆరోజు మహా శివరాత్రి జరుపుకుంటారు. అటువంటి పవిత్రమైన రోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చారంటే పరమశివుడు ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి.

మహా శివరాత్రి రోజు ఈ వస్తువులు తీసుకురండి
మహా శివరాత్రి రోజు ఈ వస్తువులు తీసుకురండి (unsplash)

Maha shivaratri 2024: శివుడికి అంకితం చేసిన రోజు మహా శివరాత్రి. ఆ రోజు శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మార్చి 8న మహాశివరాత్రి పర్వదినం జరుపుకొనున్నారు. శివుడు గౌరీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి శివరాత్రి రోజు ఉపవాసాలు ఉండి భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు.

శివరాత్రి రోజు చేసే జాగారం దానధర్మాలకు వెయ్యి రెట్ల పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. పవిత్రమైన మహా శివరాత్రి రోజు కొన్ని వస్తువులు ఇంటికి తీసుకొని రావడం వల్ల శివుని అనుగ్రహం మీకు లభిస్తుంది. మీ ఇంత సుఖ సంతోషాలు నిలుస్తాయి.

నంది విగ్రహం

మహా శివరాత్రి రోజున మీ ఇంటికి నంది విగ్రహాన్ని తీసుకురండి. నంది శివుని భక్తుడే కాదు అతని వాహనం కూడా. అటువంటి మహా భక్తుడు విగ్రహాన్ని మహాశివరాత్రి రోజున ఇంట్లో పెట్టుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. శివరాత్రి రోజు ఇంట్లో చిన్న వెండి నంది విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల శివుడు సంతోషిస్తాడు. ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది. ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది.

రుద్రాక్ష

శివునికి మహా ఇష్టమైన మరొక వస్తువు రుద్రాక్ష. మహా శివరాత్రి నాడు ఏకముఖ రుద్రాక్షను ఇంటికి తీసుకురావచ్చు. అనేక రుద్రాక్ష పూసలు ఉన్నప్పటికీ ఏకముఖి రుద్రాక్ష శివుని ప్రాతినిధ్యంగా భావిస్తారు. హిందూ మతంలో కూడా రుద్రాక్ష అంటే ఆనందం, శ్రేయస్సు, శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు. పవిత్రమైన మహాశివరాత్రి రోజున ఏకముఖ రుద్రాక్షను ఇంటికి తీసుకొచ్చి మంత్రాలతో పూజించి దాన్ని ధరించండి. ఇంట్లోని పూజ గదిలో ఉంచుకోవచ్చు.

శివలింగం

మహా శివరాత్రి నాడు ఎన్ని పూజలు చేసిన శివలింగానికి అభిషేకం చేయనిదే ఆ పూజకి అర్థం ఉండదు. శివుడు అభిషేకప్రియుడు అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే శివలింగానికి అభిషేకం చేస్తే పులకించిపోతాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహా శివరాత్రి రోజున మీరు గ్రహ బాధలు తగ్గించాలనుకుంటే రత్నాలతో చేసిన శివలింగాన్ని ఇంటికి తీసుకురావచ్చు. సరైన విధానాలు అనుసరించి ఇంట్లో ప్రతిష్టించుకోవాలి. క్రమం తప్పకుండా పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుంది. కాలసర్పదోషం, వాస్తు దోషాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

బిల్వ పత్రాలు

శివుడికి మహా ప్రతికరమైనది బిల్వదళాలు. అది లేకుండా శివుని పూజ అసంపూర్తిగా పరిగణిస్తారు. మహాశివరాత్రి నాడు బిల్వపత్రాలు తీసుకొచ్చి పరమశివుడును పూజించండి. ఫలితంగా మీకు ఆయన ఆశీస్సులు లభిస్తాయి

మహా మృత్యుంజయ యంత్రం

మహా మృత్యుంజయ యంత్రం అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు. ఇంట్లో ఈ యంత్రాన్ని క్రమం తప్పకుండా పూజించడం వల్ల వ్యాధులు, వాస్తు దోషాలు, గ్రహదోషాలు, ఆర్థిక ఇబ్బందులు మొదలైన వాటి నుంచి రక్షించబడుతుందని నమ్ముతారు. మహాశివరాత్రి నాడు మీరు మీ ఇంటికి మహా మృత్యుంజయ యంత్రాన్ని తీసుకువచ్చి నిత్య పూజలు జరిపిస్తే శివుని ఆశీస్సులు లభిస్తాయి.

రాగి కలశం

రాగి వస్తువులు లేదంటే కలశం తీసుకొచ్చి గంగాజలం నింపి వాటితో శివలింగాన్ని అభిషేకిస్తే శివయ్య ఆశీస్సులు పొందుతారు. ఇంట్లో గొడవలు, ఘర్షణ వాతావరణం ఉంటే శివరాత్రి రోజు రాగి కలశం ఇంటికి తీసుకురండి. సమస్యలు తొలగి సుఖాలు కలుగుతాయి.