ఈ ఒక్క ఆకును మీ ఇంట్లో కాల్చండి- అనేక సమస్యలు చిటికెలో పరిష్కారం అవుతాయి
ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటే అనేక సమస్యలు తిష్ట వేసుకుని కూర్చుంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల వరకు అన్నింటినీ చిటికెలో పరిష్కరించేది బిర్యానీ ఆకు. దీన్ని మీరు ఇంట్లో కాల్చడం వల్ల అనేక సమస్యలు తొలగిపోతాయి.
బిర్యానీ ఆకులు వేస్తే వంటకు అద్భుతమైన రుచి వస్తుంది. బిర్యానీ వండేటప్పుడు వేసే ఈ ఆకుల వాసనకు సగం కడుపు నిండిపోతుంది. అయితే ఇది వంటకు మంచి రుచి, సువాసన ఇవ్వడమే కాదు ఆర్థిక జీవితాలను మార్చేస్తుందని మీకు తెలుసా?
వాస్తు శాస్త్రం ప్రకారం బిర్యానీ ఆకులతో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఆర్థిక పురోగతి నుంచి వైవాహిక జీవితంలో సమస్యల వరకు అన్నింటినీ తొలగించేస్తుంది. ముఖ్యంగా ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించేందుకు బిర్యానీ ఆకును కాల్చడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బిర్యానీ ఆకులు కాల్చినప్పుడు వచ్చిన పొగను ఇల్లంతా వ్యాపించ చేయాలి. ఇలా చేయడం వల్ల చెడు శక్తుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ వాసన పీల్చుకున్నా పలు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి.
లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు
మీ లక్ష్యం నెరవేరడంలో తరచూ ఆటంకాలు ఎదురవుతుంటే ఈ పరిహారం పాటించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు. మీ కోరిక ఏమితో బిర్యానీ ఆకు మీద ఆకుపచ్చ రంగు మార్కర్ తో రాసి దాన్ని కాల్చాలి. ఆ తర్వాత బూడిదను పారేయాలి. ఇలా చేయడం వల్ల మీ లక్ష్యాలు నెరవేరతాయి. అలాగే ఈ ఆకులను మీ పుస్తకాలు లేదా డైరీలో ఉంచుకోవచ్చు.
ఆర్థిక ఇబ్బందులు తొలగించుకునేందుకు
డబ్బు సమస్య ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటూనే ఉంటారు. వీటి నుంచి బయట పడటం కోసం ఒక బిర్యానీ ఆకును మీ పర్సులో ఉంచుకోవచ్చు. ఇలా చేసే ముందు ఈ ఆకును లక్ష్మీదేవి పాదాల దగ్గర ఉంచి పూజించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
పీడ కలలు వస్తున్నాయా?
కొంతమందికి నిద్ర సరిగా పట్టదు. అలాగే పీడ కలలు ఎక్కువగా రావడం వల్ల చాలా సార్లు నిద్రలో ఉలిక్కిపడి లేస్తారు. మీరు అటువంటి సమస్య ఎదుర్కొంటుంటే ఈ పరిహారం మంచి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రపోయేటప్పుడు దిండు కింద పెట్టుకుని పడుకోవచ్చు. ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరడంతో పాటు పీడకలల బాధ కూడా ఉండదు.
నెగటివ్ ఎనర్జీ పోగొట్టేందుకు
బిర్యానీ ఆకులు, లవంగాలు, మిరియాలు కలిపి కాల్చాలి. ఆ పొగను ఇంటి మొత్తం మూల మూలల్లో వ్యాపింపచేయాలి. ఇలా చేస్తే దంపతుల మధ్య నెలకొన్న కలహాలు దూరమవుతాయి. అలాగే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. దీనితో పాటు ఒక బిర్యానీ ఆకును తీసుకుని నీటిలో వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. ఇది ప్రతికూల శక్తులను తొలగించడంలో సహాయపడుతుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.ఇంటిని శుద్ధి చేస్తుంది. అలాగే చెడు శక్తుల నుంచి ఇంటిని రక్షిస్తుంది.
టాపిక్