Negative Energy: దీపావళి రోజు ఇలా కర్పూర దీపాన్ని పెట్టండి, ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది-on the day of diwali light a camphor lamp like this and the negative energy in the house will be removed ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Negative Energy: దీపావళి రోజు ఇలా కర్పూర దీపాన్ని పెట్టండి, ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది

Negative Energy: దీపావళి రోజు ఇలా కర్పూర దీపాన్ని పెట్టండి, ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది

Haritha Chappa HT Telugu
Oct 25, 2024 09:00 AM IST

Negative Energy: దీపావళి రోజు పెట్టే దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆరోజు ప్రత్యేకంగా దీపం పెట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కర్పూర దీపాన్ని పెడితే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోతుంది.

కర్పూర దీపం
కర్పూర దీపం (Shutterstock)

దీపావళినాడు ప్రతి ఇంటి ముందు దీపాలు వెలగాల్సిందే. ఆ దీపాల వెలుతురులో ఇల్లు కళకళలాడిపోతోంది. దీపావళికి ఎలాంటి దీపాలు పెడితే మంచిదో ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. పూజలు చేసే ప్రతి ఇంట్లో కర్పూరం ఉంటుంది. కర్పూరానికి ఆరాధనలో చాలా ముఖ్యమైన స్థానం ఉంది. దీనికి మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాదు, సైన్సు పరంగా కూడా ఎంతో విలువ ఉంది.

కర్పూరం సువాసనకు బ్యాక్టీరియాను తొలగించే శక్తి ఉంది. కర్పూరం కాల్చడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి అంతా తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతారు. అందుకే చాలా మంది ప్రజలు పూజ సమయంలో కర్పూరాన్ని వెలిగించి దేవుళ్లకు హారతి ఇచ్చి… ఇంట్లో ఆ పొగను కమ్మేలా చేస్తారు. మరికొందరు డిఫ్యూజర్ల సహాయంతో దాని సువాసనను వ్యాప్తి చేస్తారు. ఈ రోజు మేము మీకు కర్పూరం దీపాలను ఇంట్లో తయారు చేయడానికి ఒక సులభమైన పద్దతి చెప్పబోతున్నాము. దీపావళి రోజు కచ్చితంగా ఇంట్లో కర్పూర దీపాన్ని పెట్టండి. ఇది మీ ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిస్తుంది. సాయంత్రం పూట ఇంట్లో కర్పూర దీపం పెడితే చాలు మీ ఇల్లు కర్పూరం నిండిపోతుంది. ఇది ఇంట్లో పాజిటివిటీని పెంచుతుంది.

కర్పూర దీపం తయారీ

సువాసనతో ఇంటిని నింపే కర్పూరం దీపం తయారు చేయాలంటే ఒక ప్రమిదను తీసుకోవాలి. ఆ ప్రమిద ఇత్తడి లేదా రాగితో తయారుచేసినదై ఉండాలి. ఇలాంటి దీపాలు పూజా స్టోర్ లో చాలా సులభంగా దొరుకుతాయి. ఇది కాకుండా, దీపం పైన ఉంచడానికి మీకు స్టీల్ గిన్నె, నీరు, లవంగాలు, కర్పూరం బిళ్లలు అవసరం. ఈ వస్తువులతో మీ కర్పూరం దీపం తయారైపోతుంది.

డిఫ్యూజర్ లేకుండా కర్పూరం సువాసనతో ఇంటిని నింపడానికి మీరు సులభంగా కర్పూరం దీపాలను తయారు చేయవచ్చు. దీని కోసం, ముందుగా మీ దీపాన్ని నెయ్యి లేదా నూనెతో వెలిగించండి. దీని తరువాత, ఒక గిన్నె తీసుకొని దానిలో సగం నీటితో నింపండి. ఇప్పుడు దానిలో నాలుగైదు కర్పూరం బిల్లలు, నాలుగైదు లవంగాలు వేయాలి. ఇప్పుడు ఈ గిన్నెను దీపం పైన ఉంచండి. దీపం వెలిగినప్పుడు, ఆ గిన్నె వేడెక్కి అందులోంచి పొగలు వస్తాయి. మీ ఇల్లంతా సువాసనలు వీస్తాయి. ఈ కర్పూరం దీపాలు మీ ఇంటిని ఐదారు గంటల పాటు ఫ్రెష్ గా ఉంచుతుంది. మీకు నచ్చినప్పుడల్లా ఈ దీపాన్ని వెలిగించండి. ముఖ్యంగా సాయంత్రం పూట వెలిగించడం అవసరం. ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో పాజిటివిటీ నిండిపోతుంది.

దీపావళి నాడు ప్రత్యేకంగా ఈ కర్పూర దీపాలను వెలిగించాల్సిందే. అలాగే ప్రతి వారం ఒకసారైనా ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించాల్సిన అవసరం ఉంది. ఇళ్లు ప్రశాంతంగా ఉండాలన్నా, ఇంట్లోవారి మానసిక ఆరోగ్యం చక్కగా ఉండాలన్నా కర్పూర దీపాలను వెలిగించాల్సిన అవసరం ఉంది.

Whats_app_banner