తెలుగు న్యూస్ / ఫోటో /
Tata Tiago EV in Pics | ఈ టియాగో ఎలక్ట్రిక్ కారుకు లేదు పోటీ.. ఇది టాటా బ్రాండ్ గ్యారంటీ!
- టాటా మోటార్స్ అత్యంత సరసమైన ధరలో 250 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే సరికొత్త ఎలక్ట్రిక్ కార్ Tata Tiago EV ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ EVకి దాని సెగ్మెంట్లో అసలు పోటీనే లేదు. ఈ కార్ చిత్రాలు, విశేషాలు చూడండి.
- టాటా మోటార్స్ అత్యంత సరసమైన ధరలో 250 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే సరికొత్త ఎలక్ట్రిక్ కార్ Tata Tiago EV ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ EVకి దాని సెగ్మెంట్లో అసలు పోటీనే లేదు. ఈ కార్ చిత్రాలు, విశేషాలు చూడండి.
(1 / 8)
టాటా టియాగో EV బుకింగ్స్ అక్టోబర్ 10, 2022 నుంచి ప్రారంభమవుతాయి; డెలివరీలు జనవరి 2023 నుంచి ప్రారంభమవుతాయి.(REUTERS)
(2 / 8)
టాటా మోటార్స్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర సరికొత్త టాటా టియాగో EV ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధరను ఆవిష్కరించారు. ఈ EV ధర కేవలం రూ. 8.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ ధరలో మార్కెట్లో ఎలాంటి ఎలక్ట్రిక్ కార్ ఇప్పటివరకు అందుబాటులో లేదు.(REUTERS)
(3 / 8)
కొత్త టాటా టియాగో EVలో హిల్ ఆసెంట్/డీసెంట్ అసిస్ట్, iTPMS, తదితర భద్రతా ఫీచర్లు ఉన్నాయి.(REUTERS)
(4 / 8)
Tiago EVలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple CarPlay, Android Auto, 8-స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్ మొదలైన అన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.(carandbike/ Twitter)
(5 / 8)
టాటా టియాగో EV ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కోసం 315 కిమీ, 215 కిమీ శ్రేణులతో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి, అలాగే నాలుగు ఛార్జింగ్ ఆప్షన్లు ఉన్నాయి(REUTERS)
(6 / 8)
Tata Tiago కార్ ఇప్పుడు ICE ఇంజిన్, CNG తో పాటుగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్ లోనూ లభించే టాటా కార్లలో ఒకటి.(carandbike/ Twitter)
(7 / 8)
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీలోని టాప్ ఎగ్జిక్యూటివ్‌లు, ముంబైలో జరిగిన గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌లో ఆవిష్కరించిన టాటా టియాగో EV ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌తో పోజులిచ్చారు.(REUTERS)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు