Neurological Disorders । పదే పదే తలనొప్పి వేధిస్తుందా? అయితే అశ్రద్ధ చేయకండి!
నాడీవ్యవస్థకు సంబంధించిన వ్యాధులు మెదడు, నరాలను ప్రభావితం చేస్తాయి. దీంతో తలనొప్పి మొదలుకొని పక్షవాతం, కండరాల బలహీనత, బలహీనమైన సమన్వయం, చలనాన్ని కోల్పోవడం, మూర్ఛ, గందరగోళం, స్పృహ తప్పడం ఇలా అనేక సమస్యలకు దారితీస్తుంది. డాక్టర్ పవన్ ఓజా న్యూరాలజీకల్ డిజార్డర్స్ ఎలా ఉంటాయో వివరించారు.
(1 / 6)
నాడీవ్యవస్థకు సంబంధించిన వ్యాధులు మనిషి జీవితాన్ని మానసికంగా, శారీరకంగా కుంగదీస్తాయి. మెదడులో నిర్మాణ, జీవరసాయన లేదా విద్యుత్ అసాధారణతల వలన ఈ సమస్యలు సంభవించవచ్చు. ఫోర్టిస్ హీరానందని ఆసుపత్రిలో న్యూరాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ పవన్ ఓజా న్యూరాలజీకల్ డిజార్డర్స్ లక్షణాలు ఎలా ఉంటాయో వివరించారు.(Shutterstock, Pixabay)
(2 / 6)
Headaches: నాడీవ్యవస్థకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నప్పుడు తలనొప్పి అతి సాధారణంగా సంభవించే ఒక లక్షణం. మైగ్రేన్లు, క్లస్టర్ తలనొప్పి, టెన్షన్ తలనొప్పి ఇలా అనేక రకాల తలనొప్పులు వస్తాయి. పదేపదే తలనొప్పులు వస్తుంటే అది అంతర్లీనంగా తలెత్తిన ఏదైనా నాడీవ్యవస్థకు సంబంధించిన సమస్య కావొచ్చు.(Pixabay)
(3 / 6)
Stroke: మెదడులోని ధమని బలహీనమైనప్పుడు కూడా హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఈ స్ట్రోక్ ఎప్పుడు వస్తుందో ఊహించడం కష్టం అయినప్పటికీ, వచ్చేముందు అస్పష్టమైన దృష్టి, గందరగోళం, మాట్లాడటం లేదా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం లేదా సమతుల్యత కోల్పోవడం, ముఖం, చేయి లేదా కాలు (ముఖ్యంగా శరీరం యొక్క ఒక వైపున) తిమ్మిరి లేదా బలహీనత మొదలగు లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన తలనొప్పి, స్ట్రోక్ లక్షణాలతో ఇబ్బంది పడుతుంటే రెండవ స్ట్రోక్‌ను నివారించడానికి జీవనశైలిలో మార్పులు అవసరం. రోజుకు కనీసం 30 నిమిషాలు లేదా వారానికి కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయడం తప్పనిసరి. అలాగే మంచి పండ్లు, కూరగాయలతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.(Unsplash)
(4 / 6)
Seizures: మెదడులో జరిగే విద్యుత్ చర్యల మార్పు ఏర్పడినపుడు మూర్ఛ వస్తుంది. భారతదేశంలో మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు 10 మిలియన్లకు పైగా ఉన్నారని అంచనా. సకాలంలో వైద్యం, మందులు వాడటం ద్వారా మాత్రమే ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు.(Shutterstock)
(5 / 6)
Vertigo: చెవి లోపలి భాగంను మెదడుకు అనుసంధానించే ఇంద్రియ మార్గాలతో సమస్య తలెత్తినపుడు సంభవించే పరిస్థితి, వెర్టిగో అంటారు. ఇది వయస్సులోనైనా సంభవించవచ్చు, 65 ఏళ్లు పైబడిన వారిలో సాధారణం. ఈ సమస్య ఉన్నపుడు మైకంగా, తలతిప్పినట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు గర్భధారణ సమయంలో లేదా చెవిలో ఇన్ఫెక్షన్ కలిగినపుడు కూడా సంభవించవచ్చు. దీని నుంచి బయటపడాలంటే నిపుణులైన వైద్యుల సహాయం అవసరం.(Shutterstock)
(6 / 6)
Neuropathy: మెదడు, వెన్నుపాము పరిధి వెలుపల ఉన్న నరాలలో ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు న్యూరోపతి అనే డిజార్డర్ సంభవిస్తుంది. ఇది ఉన్నప్పుడు అంతా అస్తవ్యస్తంగా అనిపిస్తుంది. నివారించాలంటే న్యూరాలజిస్ట్ సహాయం అవసరం.(Pixabay)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు