Jacqueline Fernandez news: ‘జాక్వెలిన్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?’-on jacqueline fernandez s bail hearing court says why not arrest her ,national న్యూస్
తెలుగు న్యూస్  /  national  /  Jacqueline Fernandez News: ‘జాక్వెలిన్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?’

Jacqueline Fernandez news: ‘జాక్వెలిన్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?’

HT Telugu Desk HT Telugu
Jan 08, 2024 10:15 PM IST

Jacqueline Fernandez news: ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు కోర్టుల నుంచి వరుస చివాట్లు లభిస్తున్నాయి. తాజాగా, బాలీవుడ్ స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్ కేసు విచారణలోనూ కోర్టు ఈడీకి మొట్టికాయలు వేసింది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (ఫైల్ ఫొటో)
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (ఫైల్ ఫొటో)

Jacqueline Fernandez news: బలవంతపు వసూళ్లు, మనీ లాండరింగ్ కేసులో జైళ్లో ఉన్న సుకేశ్ చంద్రశేఖరన్ సన్నిహితురాలిగా, ఆయన నుంచి ఖరీదైన బహుమతులు పొందారన్న ఆరోపణలపై ఈడీ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై కేసు నమోదు చేసింది. పలుమార్లు ఆమెను విచారించింది, ఆమెకు బెయిల్ కొనసాగించవద్దని కోర్టును కోరింది.

Jacqueline Fernandez news: కోర్టు సీరియస్

ఈ కేసుకు సంబంధించిన విచారణ గురువారం ప్రత్యేక కోర్టులో కొనసాగింది. ఈ సందర్భంగా ఈడీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపిక చేసి, వేధించే తీరు సరికాదని మండిపడింది. కొందరినే పని గట్టుకుని వేధించడం, మరికొందరిని చూసి చూడనట్లు వదిలేయడం ఏంటని ప్రశ్నించింది.

Jacqueline Fernandez news: దేశం విడిచి పారిపోయే ప్రమాదం

రూ. 200 కోట్ల కేసులో జైళ్లో ఉన్న సుకేశ్ కు జాక్వెలిన్ అత్యంత సన్నిహితురాలని, ఆమె వద్ద సుకేశ్ కు సంబంధించిన చాలా రహస్యాలున్నాయని, అయితే, ఆమె విచారణకు సహకరించడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. ఆమెకు బెయిల్ కొనసాగిస్తే ఆమె దేశం విడిచి పారిపోయే ప్రమాదముందని హెచ్చరించింది. గత సంవత్సరం డిసెంబర్ లో కూడా ఆమె దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించిందని వెల్లడించింది. అలాగే, ఆమె బెయిల్ పై బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని కోర్టుకు తెలిపింది.

Jacqueline Fernandez news: అరెస్ట్ చేయొచ్చు కదా?

ఈ సందర్భంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంత ప్రమాదమున్నప్పుడు. ఆమెను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈడీని ప్రశ్నించింది. వేర్వేరు నిందితుల పట్ల వేర్వేరు విధానాలను ఎందుకు అవలంబిస్తున్నారని నిలదీసింది. అనంతరం జాక్వెలిన్ బెయిల్ పిటిషన్ పై తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం జాక్వెలిన్ మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

Whats_app_banner