Jacqueline Fernandez news: ‘‘ఆమె నా ప్రేమ తప్ప వేరే ఏమీ కోరుకోలేదు’’-acqueline has no role in rs 200 crore scam conman sukesh chandrasekhar ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jacqueline Fernandez News: ‘‘ఆమె నా ప్రేమ తప్ప వేరే ఏమీ కోరుకోలేదు’’

Jacqueline Fernandez news: ‘‘ఆమె నా ప్రేమ తప్ప వేరే ఏమీ కోరుకోలేదు’’

HT Telugu Desk HT Telugu
Oct 22, 2022 09:36 PM IST

Jacqueline Fernandez news: బెదిరింపు వసూళ్లకు సంబంధించిన రూ. 200 కోట్ల స్కామ్ లో బాలీవుడ్ నటి, తన స్నేహితురాలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు సంబంధం లేదని ఆ స్కామ్ లో నిందితుడిగా ఉన్న సుకేశ్ కుమార్ చంద్రశేఖరన్ వెల్లడించారు.

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

Jacqueline Fernandez news: తన న్యాయవాదికి రాసిన లేఖలో ప్రస్తుతం ఇదే కేసులో జైళ్లో ఉన్న సుకేశ్ ఈ విషయం వెల్లడించాడు. ఆ రూ. 200 కోట్ల స్కామ్ లో జాక్వెలిక్ పాత్ర లేదని స్పష్టం చేశారు.

Jacqueline Fernandez news: ఆ గిఫ్ట్స్ నావే..

తమ మధ్య ఉన్న అనుబంధంతో ఆమెకు కార్లు, ఆభరణాల వంటి ఖరీదైన బహుమతులు ఇచ్చాను కానీ, ఈ స్కామ్ గురించి ఆమెకు ఏమీ తెలియదని ఆ లేఖలో వివరించారు. ‘ఈ కేసులో ఆమెను చేర్చడం బాధాకరం. ఆమె తన నుంచి ప్రేమ తప్ప ఏమీ కోరుకోలేదు. నేను న్యాయబద్ధంగా సంపాదించిన డబ్బుతోనే ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు బహుమతులు ఇచ్చాను’ అని వివరించారు.

Jacqueline Fernandez news: బెయిల్ రద్దు చేయండి

కాగా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్ దరఖాస్తుపై శనివారం కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ ఇస్తే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ కేసును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అలాగే, దేశం విడిచి పారిపోయే ప్రమాదం కూడా ఉందని, అందువల్ల Jacqueline Fernandez కు బెయిల్ ఇవ్వవద్దని ఈడీ కోర్టును కోరింది.

Jacqueline Fernandez news: సామాన్య వ్యక్తి కాదు.

‘జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సామాన్య వ్యక్తి కాదు. బాలీవుడ్ హీరోయిన్. ఆమె వద్ద చాలా ధనం ఉంది. సాక్షులను ప్రభావితం చేయగలదు. గతంలో భారత్ నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. విచారణ సమయంలో కూడా అధికారులకు సహకరించలేదు. సాక్ష్యాలు చూపిన తరువాతే నిజాలను ఒప్పుకుంది’ అని ఈడీ కోర్టుకు వివరించింది. ఈ విచారణకు Jacqueline Fernandez స్వయంగా హాజరయ్యారు. విచారణ అనంతరం ఆమెకు ఢిల్లీ లోని పాటియాలా కోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను నవంబర్ 10 వరకు కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Whats_app_banner