Hassan Nasrallah: హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రుల్లా నిజంగా చనిపోయాడా? ఇంతకీ ఎవరీ హసన్ నస్రుల్లా?
ఇరాన్ మద్ధతు ఉన్న మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాకు చీఫ్ గా వ్యవహరిస్తున్న హసన్ నస్రల్లా లెబనాన్ రాజధాని బీరుట్ పై తాము జరిపిన వైమానిక దాడుల్లో చనిపోయాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ వార్తను హెజ్బొల్లా ఇంకా ధ్రువీకరించలేదు. పైగా, హసన్ నస్రల్లా క్షేమంగానే ఉన్నాడని హెజ్బొల్లా సన్నిహిత వర్గాలు తెలిపాయి.
హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా
హెజ్బొల్లా నాయకుడు హసన్ నస్రల్లా ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాల తెలిపాయి. లెబనాన్ లోని బీరుట్ లో ఉన్న హెజ్బొల్లా గ్రూప్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన వైమానిక దాడుల్లో హసన్ నస్రల్లా హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో, హెజ్బొల్లా సన్నిహిత వర్గాలు ఆ వార్తను ఖండించాయి.
శుక్రవారం రాత్రి నుంచి..
బీరుట్ లో హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ కేంద్ర ప్రధాన కార్యాలయంగా భావిస్తున్న భవనంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) శుక్రవారం రాత్రి దాడి చేసింది. ‘‘ఇజ్రాయెల్ పౌరులు సురక్షితంగా, సురక్షితంగా నివసించేలా మా ప్రజలను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం" అని లెబనాన్ రాజధానిలోని దహియే శివారులో సైనిక చర్య తర్వాత ఐడిఎఫ్ అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి ప్రకటించారు.
ఇంతకీ ఎవరీ హసన్ నస్రల్లా?
- హసన్ నస్రల్లా (Hassan Nasrallah) ఆగస్టు 31, 1960 న బీరుట్ లోని ఉత్తర బుర్జ్ హమ్మూద్ శివారులో జన్మించాడు. నిరుపేద కూరగాయల వ్యాపారి కుమారుడైన ఆయనకు ఎనిమిది మంది తోబుట్టువులు ఉన్నారు.
- హసన్ నస్రుల్లా ఫిబ్రవరి 1992 నుండి నస్రల్లా హెజ్బొల్లాకు ప్రధాన కార్యదర్శిగా నాయకత్వం వహించడం ప్రారంభించాడు. హెజ్బొల్లా చరిత్రలో ఆయన మూడో చీఫ్. ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన అబ్బాస్ అల్ ముసావీ స్థానంలో హసన్ నస్రుల్లా హెజ్బొల్లా చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు.
- తాను నిత్యం బంకర్ లోనే ఉంటున్ననన్న వార్తలను 2014 లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఖండించారు. అయితే, తాను నిద్రించే ప్రదేశాలను రెగ్యులర్ గా మారుస్తుంటానని హసన్ నస్రల్లా అంగీకరించాడు.
- ‘‘సెక్యూరిటీ కోసం మన కదలికలను రహస్యంగా ఉంచాలి. అలా అని ఎవరినీ కలవకుండా ఉండను. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే ఉంటాను’’ అని నస్రల్లా హెజ్బొల్లాకు మద్దతిచ్చే లెబనాన్ వార్తాపత్రిక అల్-అఖ్బర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
- గత రెండు దశాబ్దాలుగా ఆయన చేసిన ప్రసంగాలు చాలా వరకు రహస్య ప్రదేశం నుంచి రికార్డు చేసి ప్రసారం చేశారు.
- హసన్ నస్రల్లా గొప్ప వక్త. అభిమానులను, హెజ్బొల్లా (Hezbollah) శ్రేణులను ఉత్తేజపరిచేలా ప్రసంగాలు చేస్తారు.
- నస్రల్లాకు వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు హెజ్బొల్లా ఫైటర్. 1997 సెప్టెంబరులో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హతమయ్యాడు.