Hezbollah: పేజర్లు పేలడంతో లెబనాన్ లో 8 మంది మృతి; వందలాది హిజ్బుల్లా సభ్యులకు గాయాలు; ప్రతీకారం తప్పదన్న హిజ్బుల్లా-hundreds of hezbollah members wounded in lebanon as their pagers explode report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hezbollah: పేజర్లు పేలడంతో లెబనాన్ లో 8 మంది మృతి; వందలాది హిజ్బుల్లా సభ్యులకు గాయాలు; ప్రతీకారం తప్పదన్న హిజ్బుల్లా

Hezbollah: పేజర్లు పేలడంతో లెబనాన్ లో 8 మంది మృతి; వందలాది హిజ్బుల్లా సభ్యులకు గాయాలు; ప్రతీకారం తప్పదన్న హిజ్బుల్లా

Sudarshan V HT Telugu
Sep 17, 2024 09:51 PM IST

Lebanon explosions: అంతర్గత కమ్యూనికేషన్ కు ఉపయోగించే పేజర్లు పేలడంతో లెబనాన్ లో వందలాది హెజ్బొల్లా సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. 8 మంది చనిపోయారు. గాజా యుద్ధానికి సమాంతరంగా గత అక్టోబర్ నుంచి హిజ్బొల్లా పై కూడా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది.

చికిత్స కోసం హెజ్బొల్లా సభ్యులను ఆసుపత్రులకు తీసుకువచ్చిన అంబులెన్స్ లు
చికిత్స కోసం హెజ్బొల్లా సభ్యులను ఆసుపత్రులకు తీసుకువచ్చిన అంబులెన్స్ లు (AP)

Lebanon explosions: లెబనాన్ సాయుధ బృందం హిజ్బొల్లాకు చెందిన వందలాది మంది సభ్యులు తాము కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే పేజర్లు పేలడంతో తీవ్రంగా గాయపడ్డారని భద్రతా వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్ తో దాదాపు ఏడాది పాటు జరిగిన యుద్ధంలో పేజర్లను పేల్చడం అతిపెద్ద భద్రతా ఉల్లంఘన అని పేరు చెప్పడానికి ఇష్టపడని హిజ్బొల్లా అధికారి ఒకరు తెలిపారు.

గంట పాటు పేలుళ్లు..

లెబనాన్ (Lebanon) లో హెజ్బొల్లా సభ్యులు ఉపయోగించే పేజర్లు మంగళవారం ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోసాగాయి. దాంతో, అవి ఉఫయోగిస్తున్న సభ్యులు తీవ్రంగా గాయాల పాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం తీసుకువెళ్లే అంబులెన్స్ ల సైరన్ లతో అక్కడి వీధులు మార్మోగాయని స్థానిక మీడియా వెల్లడించింది. పేలుళ్లు ప్రారంభమైన తరువాత దాదాపు గంట పాటు పేలుళ్లు కొనసాగాయని స్థానికులు తెలిపారు. లెబనాన్ దక్షిణ ప్రాంతంలో కూడా ఈ కమ్యూనికేషన్ పేజర్లు పేలుతున్నాయని భద్రతా వర్గాలు తెలిపాయి. అయితే, ఈ ఘటనపై గత అక్టోబర్ నుంచి హెజ్బొల్లాతో కాల్పులు జరుపుతున్న ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు.

8 మంది మృతి

లెబనాన్ అంతటా జరిగిన వరుస వినాశకర పేజర్ పేలుళ్లలో హిజ్బుల్లా ఎంపీ కుమారుడితో సహా ఎనిమిది మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ (israel) కు తగిన శిక్ష విధిస్తామని హిజ్బుల్లా ప్రతిజ్ఞ చేసింది. ఈ పేజర్ పేలుళ్లలో సుమారు 2,750 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లకు ఇజ్రాయెల్ కారణమని భావిస్తున్నారు. ఈ పేలుళ్లకు ఇజ్రాయెల్ దే పూర్తి బాధ్యత అని హిజ్బుల్లా మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆరోపించింది. ఈ దుశ్చర్యకు ఇజ్రాయెల్ పర్యవసానాలను ఎదుర్కొంటుందని, ప్రతీకారం తీర్చుకుంటామని మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా ప్రకటించింది.

Whats_app_banner