Food Delivery App : ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా మహిళను ట్రాక్ చేసిన మాజీ ప్రియుడు-viral news ex boy friend tracked ex girl friend via food delivery app in bengaluru ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Food Delivery App : ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా మహిళను ట్రాక్ చేసిన మాజీ ప్రియుడు

Food Delivery App : ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా మహిళను ట్రాక్ చేసిన మాజీ ప్రియుడు

Anand Sai HT Telugu
Oct 24, 2024 10:24 AM IST

Bengaluru News : బెంగళూరులో ఒక మహిళను తన మాజీ ప్రియుడు మెసేజులతో ఇబ్బంది పెడుతున్నాడు. ఆమె ఎక్కడ ఉన్న విషయాన్ని తెలుసుకుంటున్నాడు. అయితే మహిళ ఎక్కడుందో ట్రాక్ చేసేందుకు ఫుడ్ డెలివరీ యాప్‌ను ఉపయోగించాడు. ఇప్పుడు ఈ విషయం వైరల్ అయింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరులో ఓ మహిళను తన మాజీ ప్రియుడు ట్రాక్ చేస్తు్న్నాడు. ఆమె ఎక్కడుందో తెలుసుకుంటున్నాడు. తర్వాత ఈ ప్రదేశం నుంచి ఆర్డర్ చేశావేంటి అన్నట్టుగా ప్రశ్నలు వేస్తున్నాడు. మెుదట్లో ఇలాంటి మెసేజులను మహిళ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇబ్బంది ఎక్కువ కావడంతో అసలు విషయం తెలిసింది. ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఆమె సమాచారాన్ని సేకరిస్తున్నాడు.

తన మాజీ ప్రియుడు ఫుడ్ డెలివరీ యాప్ సర్వీస్ కోసం పనిచేస్తున్నాడని, బ్రేకప్ అయిన తర్వాత కూడా ఆమె ఉన్న ప్రదేశాన్ని ట్రాక్ చేయడానికి యాప్‌ను ఉపయోగిస్తున్నట్లు కనుగొంది. ఇందుకోసం కంపెనీ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలుసుకుంది. ఇది వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించినట్టేనని ఈ విషయాన్ని బాధితురాలి స్నేహితురాలు రూపల్ మధుప్ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చెప్పారు.

ఆమె చేసిన పోస్ట్‌పై భిన్నమైన కామెంట్స్ వచ్చాయి. యాప్ భద్రత, గోప్యతా ఉల్లంఘనను గురించి ప్రశ్నలు అడుగుతున్నారు నెటిజన్లు. డేటా దుర్వినియోగం, సైబర్‌స్టాకింగ్ నేరమని అంటున్నారు.

బాధితురాలి డెలివరీ అడ్రస్‌తో ఆమె ఎక్కడ ఉంటుందో మాజీ ప్రియుడు తెలుసుకుంటున్నాడు. ఆమెకు తెలియకుండానే సమాచారం అతడికి వెళ్తుంది. మొదట వారాంతపు సెలవులు, అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్‌ల గురించి మాజీ ప్రియుడు ప్రశ్నలు అడిగాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. తరువాత అతని ప్రవర్తనలో ఇంకా తేడా రావడంతో ఆమెకు అనుమానం వచ్చింది. తన సమాచారం ఎలా వెళ్తుందని తెలుసుకుంది. చివరకు యాప్‌ని ఉపయోగిస్తున్నట్లు కనుగొంది. ఎప్పుడు ఎక్కడ ఉంటుందో అతడు చెబుతూ ఉండేవాడు. మహిళ పీరియడ్స్ సమయంలో తినే ఆహారాల గురించి కూడా కామెంట్స్ చేశాడు.

'ఈసారి మీ స్వంత స్థలంలో ఎందుకు ఆర్డర్ చేయడం లేదు? మీరు ఎక్కడ ఉన్నారు?, చెన్నైలో ఏం చేస్తున్నారు?, చాక్లెట్లు ఆర్డర్ చేస్తున్నారా?, పీరియడ్‌లో ఉన్నారా?.' లాంటి ప్రశ్నలు వేశాడు.

ఈ వ్యక్తి విడిపోయిన తర్వాత వేధించడానికి ఆమె డేటాను ఉపయోగిస్తున్నాడు. ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఒకరి లొకేషన్, యాక్టివిటీలను బయటి వ్యక్తి తెలుసుకోవడంపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి తప్పుడు వ్యక్తుల్లోకి వ్యక్తిగత సమాచారం వెళ్తే ప్రమాదాలు ఉంటాయని బాధితురాలి స్నేహితురాలు మధుప్ చెప్పుకొచ్చారు.

అనధికారిక యాక్సెస్‌ను నిరోధించడానికి కంపెనీలు డేటా సిస్టమ్‌లు పర్యవేక్షిస్తాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. గోప్యత ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణిస్తారని, దీని ఫలితంగా కఠినమైన క్రమశిక్షణా చర్యలు లేదా చట్టపరమైన పరిణామాలు ఉంటాయని తెలిపారు. అతడు డేటా టీమ్‌లలో భాగమైనప్పుడు యూజర్ డేటాకు యాక్సెస్ ఉంటుందని మరో వ్యక్తి అన్నాడు.

Whats_app_banner