UK Blood scandal report : బ్రిటన్‌ని కుదిపేస్తున్న ‘రక్తం కుంభకోణం’- 30వేల మందికి హెచ్ఐవీ ఎలా సోకింది?
UK Blood scandal latest news : 1970, 1980 దశకంలో జరిగిన రక్తం కుంభకోణంపై తాజాగా వెలువడిన రిపోర్టు.. బ్రిటన్‌ని కుదిపేస్తోంది. 30వేలకుపైగా మందికి హెచ్ఐవీ సోకడంపై ఈ రిపోర్టులో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
UK Blood scandal report : 'రక్తం కుంభకోణం'.. బ్రిటన్‌ని కుదిపేస్తోంది. 30వేల మందికి హెచ్ఐవీ ఎయిడ్స్ సోకిన వ్యహారంపై తాజాగా వెలువడిన ఓ రిపోర్టులో పలు షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. వ్యవస్థ.. ప్రతి దశలోనూ విఫలం అవ్వడంతో 3వేల మంది మరణించారని ఆ రిపోర్టు పేర్కొంది.
అసలేంటి ఈ రక్తం కుంభకోణం..?
రక్తం అనేది ప్రాణవాయువుతో సమానం! మనిషిని కాపాడాలంటే రక్తం చాలా అవసరం. కాగా.. 1970, 1980వ దశకంలో బ్రిటన్ ప్రజల్లో చాలా మందికి అందిన రక్తం.. హెచ్ఐవీ, హెపటైటిస్‌తో కలుషితమైంది! 1970ల్లో ఎన్హెచ్ఎస్ (నేషనల్ హెల్త్ సర్వీస్) చేపట్టిన ఫ్యాక్టర్ 8 చికిత్సని గ్రౌండ్బ్రేకింగ్గా పరిగణించారు. కానీ.. ఇందులో వాడిన రక్తం వల్ల ప్రజల్లో వ్యాధులు పుట్టుకొస్తున్నట్టు తర్వాత తేలింది.
వేలాది మంది డోనర్ల నుంచి సేకరించిన ప్లాస్మాను కలిపి.. ఈ ఫ్యాక్టర్ 8ని తయారు చేసేవారు. అంటే.. కనీసం ఒక్క డోనర్కైనా ఏదైనా వ్యాధి ఉంటే.. మొత్తం బ్యాచ్‌కి అది సోకే ప్రమాదం ఉంది.
కానీ తొలినాళ్లల్లో ఈ ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఫ్యాక్టర్ 8 చికిత్సకు డిమాండ్ విపరీతంగా కనిపించింది. అమెరికా నుంచి బ్లడ్‌ని దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. అయితే.. అమెరికా నుంచి వచ్చిన ప్లాస్మాలో హై-రిస్క్ డోనర్లు ఉన్నట్టు తెలిసింది. ఖైదీలు, డ్రగ్స్‌కు బానిసైన వారు డబ్బుల కోసం రక్తాన్ని డొనేట్ చేశారు. ఫలితంగా.. రక్తం కలుషితమయ్యే ప్రమాదం మరింత పెరిగింది.
UK Blood scandal compensation : నిదానంగా మెలుకున్న అధికారులు.. బ్రిటన్ వ్యాప్తంగా టెస్టింగ్ నిర్వహించారు. ఫ్యాక్టర్ 8 వల్ల అప్పటికే 30వేలకుపైగా మంది ప్రజలకు హెచ్ఐవీ, హెపటైటిస్ సోకినట్టు తెలుసుకున్నారు.
ఎయిడ్స్‌ని 1980 తొలినాళ్లల్లో గుర్తించారు. 1983 నాటికి.. హెచ్ఐవీ అనేది ఎయిడ్స్‌కి కారణం అవుతుందని తేలింది. కానీ.. బ్లడ్ వల్ల వైరస్ వ్యాపిస్తుందని అంతకుముందే యూకే ప్రభుత్వానికి తెలుసు. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రోగులను అలర్ట్ చేయలేదు. ఫలితంగా.. 3వేల మంది మరణించారు.
రక్తం కుంభకోణంపై రిపోర్టు..
ఈ రక్తం కుంభకోణంపై 6ఏళ్ల పాటు దర్యాప్తు సాగింది. సోమవారం రిపోర్టు బయటకు వచ్చింది. ఇందులో పలు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అవి..
UK Blood scandal latest news : విదేశాల నుంచి దిగుమతి చేసుకునే రక్తాన్ని ఆపడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మరీ ముఖ్యంగా ఖైదీలు, డ్రగ్ అడిక్ట్స్ కూడా రక్తం ఇచ్చారు. ఇది కలుషితమైన రక్తం.
1986 వరకు హై రిస్క్ గ్రూప్స్ నుంచి రక్తాన్ని సేకరించారు.
1982లో దీని రిస్క్ గురించి తెలుసు. కానీ హెచ్ఐవీని ఎలిమినేట్ చేసేందుకు హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్‌ని 1985లో మొదలుపెట్టారు.
1970 నుంచి హెపటైటిస్ రిస్క్‌ని తగ్గించేందుకు పెద్దగా టెస్టింగ్‌లు చేయలేదు.
వ్యవస్థలోని ప్రతి దశలోనూ నిజాన్ని దాచే ప్రయత్న చేశారు. ఎవరూ జవాబుదారీతనంతో ప్రవర్తించలేదు. కీలకమైన పత్రాలను కూడా ధ్వంసం చేశారు.
What is UK Blood scandal : బ్రిటన్‌లో ఈ రక్తం కుంభకోణం.. ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదు! వైద్యులు, బ్లడ్ సర్వీస్‌లు, ప్రభుత్వాలు.. రోగి భద్రతను రోగి ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. అధికారులు ఏం చేయకపోవడంతో.. ప్రజల బాధ రెట్టింపు అయ్యింది.
ఫ్యాక్టర్ 8 చికిత్సలో రిస్క్ గురించి ప్రజలకు చెప్పి ఉండాల్సింది.
ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో.. ప్రజలకు వారు ఎలాంటి ఇన్ఫెక్షన్కి గురవుతున్నారో తెలియలేదు.
బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తున్నామని, బ్లడ్ స్క్రీనింగ్ ప్రాసెస్‌ని చేపట్టామని నాడు అధికారులు చెప్పిన మాటలు అబద్ధం!
రక్తం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తి చెందుతుందని తెలిసినా.. కమర్షియల్ బ్లడ్ ప్రాడక్ట్స్‌ని 1983లో దిగుమతి చేసుకోవడాన్ని ప్రభుత్వం ఆపకపోవడం చాలా పెద్ద తప్పు.
బాధితులకు పరిహారం..!
UK Blood scandal victims : ఈ రక్తం కుంభకోణం కారణంగా రోగులు చాలా ఇబ్బందిపడ్డారు. నొప్పి, నీరసంతో అల్లాడిపోయారని మృతుల బంధువులు, స్నేహితులు చెబుతున్నారు.
బాధితులకు పరిహారం విషయంపై ఈ రిపోర్టు పలు కీలక సిఫార్సులు చేసింది. వ్యాధి సోకిన వారికి వార్షిక ఆర్థిక మద్దతు లభిస్తోంది. కానీ.. తుది పరిహారంపై ఇంకా ఎలాంటి ఒప్పందాలు జరగలేదు.
బ్రిటన్‌లో రక్తం కుంభకోణంపై రిపోర్టు వెలువడిన అనంతరం.. ఆ దేశ ప్రధాని రిషి సునక్.. ప్రజలకు క్షమాపణలు చెప్పారు. బాధితులకు సమగ్ర పరిహారం ఇస్తామని, త్వరలోనే వీటిపై వివరాలను ప్రకటిస్తామని హామీనిచ్చారు.
సంబంధిత కథనం