HIV Positive : ఆ జైలులో 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్- అసలేం జరుగుతోంది?
HIV Positive case in Jail : ఉత్తర్ ప్రదేశ్లోని లక్నో జిల్లా జైలులో 63మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. ఈ వార్త ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.
HIV Positive cases in Lucknow district jail : ఉత్తర్ప్రదేశ్ లక్నో జిల్లా జైలులో ఒకేసారి 36మంది ఖైదీలకు హెచ్ఐవీ ఉన్నట్టు తేలడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. అంతేకాకుండా.. ఇదే జైలులో ఇప్పుడు మొత్తం 63మంది ఖైదీలు.. హెచ్ఐవీ పాజిటివ్ సోకింది!
ఆ జైలులో అసలేం జరిగింది?
జైళ్లల్లో ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. కాగా.. లక్నో జైలులో గతేడాది సెప్టెంబర్ నుంచి హెచ్ఐవీ టెస్ట్లు జరగలేదు. కిట్లు అందుబాటులో లేకపోవడంతో.. పరీక్షలు ఆలస్యమయ్యాయని అధికారులు చెప్పారు. చివరికి.. గతేడాది డిసెంబర్లో పరీక్షలు జరిగాయి. 36మందికి హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. మొత్తం మీద 63మంది హెచ్ఐవీ బారినపడ్డారు.
Lucknow district jail HIV cases : ఈ ఖైదీల్లో చాలా మందికి డ్రగ్ అడిక్షన్ ఉంది. జైలు బయట.. కంటామినేటెడ్ సిరంజీల కారణంగా హెచ్ఐవీ వైరస్ సోకినట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. జైలులోకి వచ్చిన తర్వాత మాత్రం ఎవరికి వైరస్ సోకలేదని వెల్లడించారు.
తాజా పరిస్థితులను మెరుగుపరిచేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. హెచ్ఐవీ పాజిటివ్ సోకిన ఖైదీలను లక్నోలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Lucknow district jail latest news : ఒకే జైలు నుంచి ఈ స్థాయిలో హెచ్ఐవీ పాజిటివ్ కేసులు బయటకి రావడం ఆందోళన కలిగిస్తోంది. కానీ.. ఈ వైరస్ కారణంగా గత ఐదేళ్లల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదని అధికారులు వెల్లడించారు. వైరస్ బారిన పడిన ఖైదీలు కూడా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు.
తాజా ఘటనతో లక్నో జిల్లా జైలులో రోగుల ఆరోగ్యం, భద్రతా పరిస్థితులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వైరస్ మూలాలను కనుగొని, దానికి పరిష్కారాన్ని వెతికేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. తద్వారా.. హెచ్ఐవీ వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని భావిస్తున్నారు.
సంబంధిత కథనం