నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) త్వరలో యూజీసీ నెట్ జూన్ 2024 ఆన్సర్ కీని విడుదల చేయనుంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ugcnet.nta.ac.in యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వివరాలు nta.ac.in ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
ఎన్టీఏ యూజీసీ నెట్ పరీక్ష 2024 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరిగిన విషయం తెలిసిందే. వరదల కారణంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో పరీక్షను రద్దు చేసి కొద్ది రోజుల్లోనే తిరిగి పరీక్ష నిర్వహించారు.
ప్రొవిజనల్ కీ విడుదల తేదీ- సమయాన్ని ఏజెన్సీ ఇంకా ప్రకటించలేదు. అధికారిక బ్రోచర్ ప్రకారం “ఎన్టీఏ అభ్యర్థి ప్రొవిజనల్ ఆన్సర్ కీ, ప్రశ్నపత్రాన్ని ఎన్టీఏ వెబ్సైట్లో https://ugcnet.nta.ac.in/ ప్రదర్శిస్తుంది. https://ugcnet.ntaonline.in. పరీక్ష తర్వాత కచ్చితమైన తేదీని ఎన్టీఏ వెబ్సైట్లో పొందుపరుస్తారు. ప్రొవిజనల్ ఆన్సర్ కీని రెండు, మూడు రోజుల పాటు ప్రదర్శించే అవకాశం ఉంది.”
ఆన్సర్ కీతో పాటు అభ్యంతర విండో కూడా ఓపెన్ అవుతుంది. ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేయాలనుకునే అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజుగా ఒక్కో ఆన్సర్ కీకి రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు రీఫండ్ అవ్వదు.
సవాలు చేయగలిగే నిర్దిష్ట సమయానికి డబ్బులు చెల్లించిన అబ్జెక్షన్స్ని మాత్రే పరిలిస్తారని గమనించాలి. జస్టిఫికేషన్/ఎవిడెన్స్ లేని సవాళ్లు/నిర్ణీత కాలవ్యవధి తర్వాత, నిర్దేశిత లింక్ కాకుండా మరే ఇతర మాధ్యమంలో దాఖలు చేసిన వాటిని పరిగణనలోకి తీసుకోరు.
అభ్యర్థులందరూ ప్రొవిజనల్ ఆన్సర్ కీని అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ని చూడవచ్చు.