ASIs suicide: కస్టడీ నుంచి నిందితుడు తప్పించుకొవడంతో ఇద్దరు ఏఎస్ఐల ఆత్మహత్య-two punjab police asis end life after juvenile escapes custody ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Asis Suicide: కస్టడీ నుంచి నిందితుడు తప్పించుకొవడంతో ఇద్దరు ఏఎస్ఐల ఆత్మహత్య

ASIs suicide: కస్టడీ నుంచి నిందితుడు తప్పించుకొవడంతో ఇద్దరు ఏఎస్ఐల ఆత్మహత్య

Sudarshan V HT Telugu
Oct 08, 2024 03:12 PM IST

ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన పంజాబ్ లో జరిగింది. తమ కస్టడీ నుంచి ఒక 17 ఏళ్ల హత్య నిందితుడు తప్పించుకు పారిపోవడంతో మంగళవారం తెల్లవారుజామున ఆదంపూర్ రైల్వే స్టేషన్ లో ఆ ఇద్దరు ఏఎస్ఐ లు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ఇద్దరు ఏఎస్ఐల ఆత్మహత్య
ఇద్దరు ఏఎస్ఐల ఆత్మహత్య

పంజాబ్ లోని కపుర్తలా కోర్టు నుంచి హోషియార్ పూర్ జువైనల్ హోంకు 17 ఏళ్ల హత్య నిందితుడిని తీసుకువస్తుండగా, ఆ నిందితడు తమ కస్టడీ నుంచి తప్పించుకోవడంతో ఇద్దరు పంజాబ్ (punjab) పోలీసు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు (ASI) మంగళవారం తెల్లవారుజామున జలంధర్ జిల్లాలోని ఆదంపూర్ రైల్వే స్టేషన్లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

స్టేషన్ లో మృతదేహాలు లభ్యం

ఏఎస్ఐలు జీవన్ లాల్, ప్రీతమ్ దాస్ మృతదేహాలు జలంధర్ జిల్లాలోని ఆదంపూర్ రైల్వే స్టేషన్లో లభ్యమయ్యాయని జలంధర్ (గ్రామీణ) సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) హర్కమల్ ప్రీత్ సింగ్ ఖాఖ్ తెలిపారు. కోర్టులో విచారణ అనంతరం కపుర్తలా కోర్టు కాంప్లెక్స్ నుంచి తిరిగి వస్తుండగా తప్పించుకున్న టీనేజ్ నిందితుడు అమన్ దీప్ సింగ్ ఆచూకీ కోసం గాలిస్తున్నామని తెలిపారు. రెండు మృతదేహాలు లభ్యమైన విషయాన్ని అదంపూర్ స్టేషన్ మాస్టర్ నరేష్ రాజు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. ‘‘ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. అమన్ దీప్ ఆచూకీ లభించకపోవడంతో ఆ ఇద్దరు ఏఎస్ఐలు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు’’ అని ఎస్ఎస్పీ ప్రీత్ సింగ్ తెలిపారు.

హత్య కేసు నిందితుడు

జలంధర్ జిల్లాలోని తల్వాండీ మహిమ గ్రామానికి చెందిన అమన్ దీప్ ను మార్చిలో ఓ హత్య కేసులో అరెస్టు చేశారు. మైనర్ కావడంతో అమన్ దీప్ ను జువెనైల్ హోంలో నిర్భంధించారు. సోమవారం సాయంత్రం కోర్టు విచారణ అనంతరం మరో నిందితుడు దేవ్ కుమార్ తో కలిసి జువైనల్ హోమ్ కు తీసుకువస్తున్నారు. కపుర్తలా నుంచి హోషియార్ పూర్ వెళ్లే మార్గంలో ఆదంపూర్ ప్రధాన బస్టాండ్ సమీపంలో పోలీసు వాహనం నుంచి అమన్ దీప్ తప్పించుకున్నాడు. ఏఎస్ఐ హర్జీందర్ సింగ్ దేవ్ కుమార్ అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు ఏఎస్ఐలు అమన్ దీప్ కోసం వెతకడం ప్రారంభించారు. అతను కనిపించకపోవడంతో వారు ఆత్మహత్య చేసుకోవాలన్న తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

Whats_app_banner