Doctor Rape Case : వైద్యురాలిని హత్య చేసి అత్యాచారం చేశారా? గ్యాంగ్ రేప్ జరిగిందా?-rg kar hospital doctor rape case maybe multiple accused raped kolkata doctor after she died says experts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Doctor Rape Case : వైద్యురాలిని హత్య చేసి అత్యాచారం చేశారా? గ్యాంగ్ రేప్ జరిగిందా?

Doctor Rape Case : వైద్యురాలిని హత్య చేసి అత్యాచారం చేశారా? గ్యాంగ్ రేప్ జరిగిందా?

Anand Sai HT Telugu
Aug 12, 2024 08:37 PM IST

Doctor Rape Case : కోల్‌కతాలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసిన ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆమెను హత్య చేసిన తర్వాత అత్యాచారం చేశారా? అనే అనుమానాలు వస్తున్నాయి. గ్యాంగ్ రేప్ జరిగిందని కూడా కొందరు అంటున్నారు.

కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం
కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం

కోల్‌కతాలోని ఓ ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆమె హత్యపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్యాంగ్ రేప్ జరిగిందని కొందరు అంటున్నారు. హత్య చేసిన తర్వాత అత్యాచారం చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

గత శుక్రవారం RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ రూమ్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ దాడి చేయడంతో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసి 14 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.

అత్యాచారం, హత్య కేసులో ప్రాథమిక శవపరీక్ష నివేదిక కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల్లో ఈ కేసులో ఒక్కరైనా ఉన్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

నివేదికల ప్రకారం.. బాధితురాలి నోరు, ముక్కు నొక్కడంతో ఆమె ఊపిరాడక చనిపోయి ఉండవచ్చు. దాడి సమయంలో బాధితురాలు ప్రతిఘటించిన సంకేతాలు కూడా ఉన్నాయి. దీంతో నిందితులు ఒక్కరే ఈ దారుణానికి పాల్పడ్డారా లేక పలువురు వ్యక్తులు ఈ నేరానికి పాల్పడ్డారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 'ఈ రెండు పనులు ఒకే సమయంలో ఒకే వ్యక్తికి సాధ్యం కాదు, అతను రెండు చేతులను ఉపయోగించడంలో చాలా నైపుణ్యం కలిగి ఉంటే తప్ప. ఆమె రెండు వైపుల నుండి దాడి చేయబడి ఉండవచ్చు. చివరి వరకు ఆమె ప్రతిఘటించడం సాధ్యం కాదు.' అని డాక్టర్ అజయ్ గుప్తా చెప్పారు.

ఓ ఫోరెన్సిక్ మెడిసిన్ నిపుణుడు కూడా దీనిపై స్పందించారు. 'సామూహిక అత్యాచారాన్ని తోసిపుచ్చలేం. నేరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ లైంగిక చర్యకు పాల్పడ్డారని ఎల్లప్పుడూ అనుకోలేం. ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఉండవచ్చు. ఒకరు కాపలాగా ఉండగా, మరొకరు దాడికి పాల్పడొచ్చు. అలాంటి చర్య సామూహిక అత్యాచారం కూడా అవుతుంది.' అని చెప్పుకొచ్చారు.

బాధితురాలి శరీరంపై ఇంత తీవ్రమైన గాయాలు చేయడం ఒక్క వ్యక్తికి సాధ్యం కాదని కొందరు అంటున్నారు. నిందితుడి శరీరాన్ని చూస్తుంటే.. అతను ఒంటరిగా అలాంటి పని చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఇందులో కొంతమంది వ్యక్తులు పాల్గొనే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ట్రైనీ డాక్టర్ హత్యపై ఫోరెన్సిక్ నిపుణులు మరిన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, హత్య చేసిన తర్వాత డాక్టర్‌పై అత్యాచారం జరిగిందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రైనీ డాక్టర్ జననాంగాలపై కనిపించే గాయాలను శవపరీక్ష నివేదికలో 'పెరిమార్టం' (మరణం సమయంలో లేదా సమీపంలో) అని వర్ణించారు. ఈ సంఘటనకు సంబంధించిన విషయాలు చాలా మందిని షాక్‌కు గురిచేస్తున్నాయి. హత్య చేసి అత్యాచారం చేశారని చాలా మంది అంటున్నారు.

ఆమెపై దాడి జరిగినప్పుడు ఆమె ప్రతిఘటించింది. ఆమెను ఊపిరాడకుండా చేసే ప్రయత్నం జరిగింది. ఇది ఆమె స్పృహ కోల్పోవడానికి కారణమైంది. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాతే అత్యాచారం జరిగిందా.. లేద మరణించిన తర్వాతే జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

Whats_app_banner

టాపిక్