Punjab rape case : దారుణం- 18 నెలల చిన్నారిపై అత్యాచారం..!-punjab crime news 18 month old girl raped in hoshiarpur ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Punjab Rape Case : దారుణం- 18 నెలల చిన్నారిపై అత్యాచారం..!

Punjab rape case : దారుణం- 18 నెలల చిన్నారిపై అత్యాచారం..!

Sharath Chitturi HT Telugu
Aug 10, 2024 07:20 AM IST

Punjab rape case : 18 నెలల చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన పంజాబ్​లో చోటుచేసుకుంది. పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు.

18 నెలల చిన్నారిపై అత్యాచారం!
18 నెలల చిన్నారిపై అత్యాచారం!

పంజాబ్​లో అత్యంత దారుణ, అత్యంత అమానవీ ఘటన చోటుచేసుకుంది. ఓ 18 నెలల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు!

ఇదీ జరిగింది..

పంజాబ్​లోని హోషియార్​పూర్​లో గురువారం ఈ ఘటన జరిగింది. చిన్నారి తల్లిదండ్రులు పౌల్ట్రీ ఫామ్​లో పనిచేస్తుంటారు. గురువారం నైట్​షిఫ్ట్​ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లాడు చిన్నారి తండ్రి. కూతురితో కలిసి గదిలో పడుకున్నాడు. కాగా యూపీకి చెందిన వాజిందర్​ కుమార్​ అనే కూలి, ఇంటి లోపలికి ప్రవేశించాడు. నెమ్మదిగా చిన్నారి ఉన్న గదిలోకి వెళ్లాడు. చిన్నారిని అపహరించాడు. వేరే చోటకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు.

చిన్నారి అరుపులు విన్న తల్లి అలర్ట్​ అయ్యింది. శబ్దం వస్తున్న వైపు పరుగులు తీసింది. ఇంతలో చిన్నారిని వదిలేసి వాజిందర్​ అక్కడి నుంచి పారిపోయాడు.

బాధిత చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిపై బీఎస్​ఎస్​, పోక్సో కింద కేసు నమోదు చేసుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టి, కొన్ని గంటల్లోనే అతడిని అరెస్ట్​ చేశారు.

మరోవైపు చిన్నారిని మహిల్​పూర్​లోని హెల్త్​ సెంటర్​కి తరలించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు చిన్నారిపై అత్యాచారం ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితుడిని వెంటనే అరెస్ట్​ చేయాలని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చూడండి:- Girls marriage age: ఆ దేశంలో వివాహ వయస్సును 9 ఏళ్లకు తగ్గిస్తూ ప్రతిపాదనలు.. మండిపడ్తున్న దేశవాసులు

14ఏళ్ల బాలికపై..

పంజాబ్​లో మహిళలు, బాలికలు, చిన్నారులపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. బాలిక ఉన్న గదిలోకి చొరబడి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై ఖన్నా పోలీసులు కేసు ఇటీవలే నమోదు చేశారు. బాలిక తన తల్లిదండ్రులతో కలిసి వారం రోజుల క్రితమే బిహార్ నుంచి ఖన్నాకు వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నిందితుడు ఆమెను రేప్​ చేశాడు.

రంజిత్ పండిట్ అనే నిందితుడిపై ఖన్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు ఒక కూలీ అని సమచారం.

బాధితురాలి తండ్రి వాంగ్మూలం మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన కుమార్తెకు ఆరోగ్యం బాగాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని చెప్పి, తాను బయటకు వెళ్లినట్టు, సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి ఆమె ఏడుపు చూసి షాక్ అయినట్టు తెలిపాడు. బాలికను ప్రశ్నించగా జరిగిన మొత్తం సంఘటనను వివరించిందని, నిందితుడు గదిలోకి చొరబడి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపినట్టు పేర్కొన్నాడు.

నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 64, పోక్సో చట్టంలోని సెక్షన్లు 3, 4 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు, కేసును దర్యాప్తు చేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ రాజ్వంత్ కౌర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్​ చేసేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్టు వివరించారు.

ఇలా దేశంలో ఏదో ఒక మూల, మహిళలు- బాలికలపై నేరాలకు సంబంధించి ప్రతి రోజు ఏదో ఒక వార్త వెలువడుతూనే ఉంది.

సంబంధిత కథనం