Vzrm Homeguard: ప్రియుడితో ఏకాంతంగా ఉన్న యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడిన హోంగార్డు
Vzrm Homeguard: విజనగరంలో దారుణం జరిగింది. ఎస్సైనంటూ బెదిరించి ఏకాంతంగా ఉన్న జంటలో యువతిని బెదిరించి అత్యచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
Vzrm Homeguard: ఒంటరిగా ఉన్న జంటను పోలీస్ పేరుతో బెదిరించిన హోంగార్డు యువకుడిని తరిమేసి ఆ పై యువతిపై అత్యాచారానికి పాల్పడిని ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని గుర్ల మండలా నికి చెందిన ఓ యువతి తన స్నేహితుడైన యువకుడితో కలిసి మంగళవారం వెళ్లింది.
వాళ్లిద్దరూ విజయనగరం మండలం కొండకరకాం లేఅవుట్లో ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడికి ఖాకీ ఫ్యాంట్ ధరించి వచ్చిన వ్యక్తి అక్కడ ఎందుకు ఉన్నారని వారిని ప్రశ్నించారు. తాను ఎస్ఐనంటూ వారిద్దరి ఫోన్లు లాక్కున్నాడు. యువకుడిని అక్కడి నుంచి వెళ్లగొట్టాడు.
యువతిని తన మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని నెల్లిమర్ల మండలం టొంపలపేట సమీపంలోని చంపావతి నదీతీరానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు బుధవారం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో నిందితుడిని హోంగార్డుగా గుర్తించారు. అతను బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నట్టు గుర్తించారు.
నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నెల్లిమర్ల మండలం చంద్రంపేటకు చెందిన మొయిద సురేష్ పోలీస్ హోంగార్డుగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఏకాంతంగా ఉన్న జంటలను గుర్తించి వారిని బెదిరించి అఘాయిత్యానికి పాల్పడినట్టు నిర్ధారించారు. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకు న్నారు. కేసు దర్యాప్తు పూర్తిచేసి నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని, విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.
పాఠశాలలో ప్రసవించిన బాలిక…
ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో జూనియర్ ఇంటర్ విద్యార్ధిని ప్రసవించడం కలకలం రేపింది. కొత్తపట్నం మండలం మోటుమాలలోని కస్తూర్బా బాలికల విద్యాలయం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని బుధవారం మగశిశువును ప్రసవించింది.
తెలంగాణలోని భద్రాచలానికి చెందిన కుటుంబం ప్రకాశం జిల్లాకు వలస వచ్చింది. ఈ కుటుంబానికి చెందిన వారి కుమార్తె కొత్తపట్నం మండలం మోటుమాల కేజీబీవీలో ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్‌లో మొదటి సంవత్సరం చదువుతోంది.
ఈ ఏడాది జూన్19వ తేదీన కేజీబీవీలో చేరి 26వ తేదీ వరకు హాస్టల్లో ఉంది. తిరిగి జూలై 11వ తేదీన హాస్టల్‌కు వచ్చింది. బుధవారం ఉదయం బాత్రూమ్‌కు వెళ్లిన బాలిక ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో సిబ్బంది వెళ్లి చూడటంతో బాలిక ప్రసవించిన విషయం వెలుగు చూసింది. బాలిక ప్రసవించిన శిశువు ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాల సిబ్బంది వెంటనే ఒంగోలు రిమ్స్‌కు బాధితురాలిని తరలించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అధికారుల ఆదేశంతో పోలీసులు దర్యాప్తు జరిపారు.
ఒంగోలు టూటౌన్ సిఐ, కొత్తపట్నం ఎస్సైలు బాలిక నుంచి సమాచారం సేకరించారు. చీమకుర్తి మండలం మర్రిచెట్లపాలెం వద్ద నివసిస్తున్న ముగ్గురు వ్యక్తులు గర్భానికి కారణమైనట్టు బాలిక తెలిపింది. గ్రామానికి చెందిన యువకుడితో మాట్లాడుతుండగా చూసిన మరొకరు బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు తెలిపింది. మైనర్ బాలిక గర్భం దాల్చడానికి కారణమైన వారి అచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.