Aishwarya Rai Divorce: ఆ డాక్టర్‌తో క్లోజ్‌గా ఐశ్వర్య రాయ్! ఫొటోలు వైరల్- అందుకే భర్త అభిషేక్ బచ్చన్ విడాకులు?
Abhishek Bachchan Aishwarya Rai Divorce Reason: హీరోయిన్ ఐశ్వర్య రాయ్‌కు హీరో అభిషేక్ బచ్చన్ విడాకులు ఇవ్వనున్నట్లు గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఐశ్వర్యకు అభిషేక్ విడాకులు ఇవ్వడానికి కారణం ఓ డాక్టర్ అని బాలీవుడ్ మీడియా చెబుతొంది.
Abhishek Bachchan Aishwarya Rai Divorce Reason: గత కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు కారణం వాళ్లిద్దరు త్వరలో విడాకులు తీసుకోనున్నారనే పుకార్లు జోరుగా వినిపించడమే. ఐశ్వర్య రాయ్‌కు భర్త అభిషేక్ బచ్చన్ డివోర్స్ ఇవ్వనున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి.
విడిపోడానికి కారణాలు
అయితే, ఈ విడాకుల విషయంపై అటు అభిషేక్, ఇటు ఐశ్వర్య రాయ్ క్లారిటీ ఇవ్వలేదు.. అలా అని ఖండించలేదు. దీంతో ఈ డివోర్స్ మ్యాటర్ హాట్ టాపిక్ అయింది. దీంతో అభిమానులు అసలు విషయం ఏంటా అని కనిపెట్టే పనిలో పడ్డారు. దాంతో ఒక్కో అంశంపై క్లూలు సంపాదించడం స్టార్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న బాలీవుడ్ స్టార్ జంట విడిపోడానికి కారణం ఏంటా అని ఆరాలు తీస్తున్నారు.
ఇద్దరి స్నేహమే
ఈ నేపథ్యంలోనే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల విషయం మధ్యలోకి కొత్తగా ఓ డాక్టర్ పేరు వచ్చింది. ఆ డాక్టర్ పేరు జిరాక్ మార్కర్. అతను ఐశ్వర్య రాయ్‌కు క్లోజ్ ఫ్రెండ్. వీరిద్దరి మధ్య డీప్ ఫ్రెండ్షిప్ చాలా కాలంగా ఉందని సమాచారం. వీరిద్దరి స్నేహమే ఐశ్వర్య రాయ్ విడాకులకు కారణం అయ్యాయని బాలీవుడ్ మీడియా పేర్కొంటుంది.
ఐశ్వర్య-జిరాక్ ఫొటోలు
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఐశ్వర్య రాయ్, జిరాక్ మార్కర్ చాలా కాలంగా స్నేహితులు. వీరిద్దరు ఇప్పటికీ ఫ్రెండ్షిప్ కొనసాగించకపోతే ఈ డివోర్స్ రూమర్స్ వినిపించేవి కావని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఇటీవల, ఒక ఈవెంట్‌లో ఐశ్వర్య రాయ్, జిరాక్ మార్కర్‌కు సంబంధించి కలిసి ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏదో నడుస్తోందని
దాంతో ఐశ్వర్య రాయ్, జిరాక్ మార్కర్ మధ్య ఏదో నడుస్తోందని ప్రజలు ఊహాగానాలు చేయడం ప్రారంభించారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, జిరాక్ మార్కర్ మధ్య ఉన్న గాఢమైన స్నేహమే అభిషేక్ బచ్చన్ విడాకులు ఇవ్వడానికి కారణమని చాలా మంది భావిస్తున్నారు. ఇక అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల గురించి చాలా నెలలుగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే.
విడాకుల విషయం నిజమే
ఇటీవల పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి బచ్చన్ కుటుంబం మొత్తం కలిసి రావడంతో అవి మరింత తెరపైకి వచ్చాయి. ఈ వివాహానికి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కూడా హాజరయ్యారు. కానీ, ఆమె తన కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో ఒంటరిగా వచ్చింది. దీంతో ఐశ్వర్య రాయ్ విడాకుల విషయం నిజమే అని నెటిజన్స్, ఫ్యాన్స్ చర్చించుకోవడం ఎక్కువైంది.
2007లో ప్రేమ వివాహం
ఇదిలా ఉంటే, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఏప్రిల్ 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఆరాధ్య బచ్చన్ కుమార్తె ఉంది. ఆరాధ్య బచ్చన్ నవంబర్ 2011లో జన్మించింది. కాగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కలిసి ఉమారావ్ జాన్, ధాయి అక్షర్ ప్రేమ్ కే, కుచ్ నా కహో, ధూమ్ 2, గురు, రావన్ సినిమాల్లో నటించారు.