Congo fever : ప్రమాదకర కాంగో ఫీవర్​తో మహిళ మృతి- ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..!-rajasthan woman dies of congo fever know early symptoms here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Congo Fever : ప్రమాదకర కాంగో ఫీవర్​తో మహిళ మృతి- ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..!

Congo fever : ప్రమాదకర కాంగో ఫీవర్​తో మహిళ మృతి- ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త..!

Sharath Chitturi HT Telugu
Oct 11, 2024 07:54 AM IST

Congo fever symptoms : రాజస్థాన్​కు చెందిన ఓ మహిళ, కాంగో ఫీవర్​కి చికిత్స పొందుతూ అహ్మదాబాద్​లోని ఓ ఆసుపత్రిలో మరణించింది. ఈ నేపథ్యలో అధికారులు అప్రమత్తం అయ్యారు.

కాంగో ఫీవర్​తో మహిళ మృతి
కాంగో ఫీవర్​తో మహిళ మృతి (AFP)

ప్రమాదకర కాంగో ఫీవర్​ దేశంలో కలకలం సృష్టిస్తోంది! ఈ వ్యాధితో బాధపడుతున్న ఓ 51ఏళ్ల రాజస్థానీ మహిళ బుధవారం మరణించింది. అహ్మదాబాద్​లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. వైరస్ వల్ల వచ్చే ఈ వ్యాధి ప్రధానంగా కీటకాలులు, పశువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది.

మహిళ రక్త నమూనాను పుణెలోని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించగా వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో జోద్​ఫూర్​కు చెందిన మహిళ మరణం తరువాత, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ కాంగో ఫీవర్​ వ్యాప్తిని నివారించడానికి, వ్యాధి నుంచి ప్రజలను రక్షించడానికి అన్ని ప్రైవేట్- ప్రభుత్వ వైద్య సంస్థలకు మార్గదర్శకాలను జారీ చేసింది.

మరోవైపు మహిళ నివాస ప్రాంతానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్​ని పంపడం ద్వారా సంక్రమణను నివారించాలని జోధ్​పూర్​ చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్​ని ఆదేశించినట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవి ప్రకాష్ మాథుర్ తెలిపారు. వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్​ ఆ ప్రాంతంలో అనుమానిత, లక్షణాలున్న రోగులను గుర్తించి వారిని ఐసోలేషన్​లో ఉంచాలని ఆదేశించారు.

కాంగో ఫీవర్​ ఒక జూనోటిక్ వైరల్ వ్యాధి అని, ఇది కీటకాల కాటు వల్ల సంభవిస్తుందని వైద్యులు చెప్పారు. ఇటీవల ఓ మహిళ మృతి చెందిన నేపథ్యంలో ఈ వ్యాధి నివారణ, నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖను అధికారులు ఆదేశించారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి:- కోల్‌కతా ఆర్‌జి కర్ ఘటన.. జూనియర్ డాక్టర్లకు మద్దతుగా 50 మంది సీనియర్ వైద్యుల రాజీనామా

మరోవైపు ఆ మహిళకు కాంగో ఫీవర్​ ఎలా సోకింది? అన్న విషయంపై ప్రస్తుతం క్లారిటీ లేదు. ఈ కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాంటాక్ట్​ పాయింట్​ తెలుసుకుని, దాన్ని మూసివేస్తే వ్యాధి వ్యాప్తి ఉండదని ప్రణాళికలు రచిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం, కాంగో హెమరేజిక్ ఫీవర్ (సీసీహెచ్ఎఫ్), సాధారణంగా కీటకాలు, పశువుల ద్వారా వ్యాప్తి చెందే వైరల్ జ్వరం. జంతువుల వధ తర్వాత వాటి టిష్యూకు సోకిన వైరస్​తో కాంటాక్ట్​ అయితే ఈ కాంగో ఫీవర్​ వ్యాప్తి తీవ్రంగా ఉంటుంది.

కాంగో ఫీవర్​ లక్షణాలు..

  • డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, కాంగో ఫీవర్​ లక్షణాలు అకస్మాత్తుగా ప్రారంభమవుతాయి. జ్వరం, మయాల్జియా (కండరాల నొప్పి), మైకము, మెడ నొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, కళ్ల నొప్పి, ఫోటోఫోబియా (కాంతికి సున్నితత్వం) వంటివి కాంగో ఫీవర్​ లక్షణాలు.

  • ప్రారంభంలో వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, గొంతునొప్పి, ఆ తర్వాత మూడ్ స్వింగ్స్, గందరగోళం ఉండవచ్చని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
  • ప్రారంభ లక్షణాల నుంచి రెండు నుంచి నాలుగు రోజుల తర్వాత నిద్ర, నిరాశ, కడుపు నొప్పి వంటి లక్షణాలు పెరగొచ్చని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది.

ముఖ్యంగా, ఎవరైనా కాంగో ఫీవర్​ లక్షణాలను చూపిస్తే, రక్త నమూనాను తీసుకొని వెంటనే పరీక్షకు పంపాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం