One Nation One Election : వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌తో దేశం మరింత బలపడుతుంది: ప్రధాని-prime minister modi key comments on one nation one election ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  One Nation One Election : వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌తో దేశం మరింత బలపడుతుంది: ప్రధాని

One Nation One Election : వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌తో దేశం మరింత బలపడుతుంది: ప్రధాని

Basani Shiva Kumar HT Telugu
Oct 31, 2024 12:29 PM IST

One Nation One Election : వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విధానంతో దేశం మరింత బలుపడుతుందని వ్యాఖ్యానించారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయని.. అందుకే వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ
ప్రధాని మోదీ

ఈ ఏడాది చివర్లో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెడతామని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనకు ఈ ఏడాది ప్రారంభంలో కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద.. సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

'వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు వేస్తున్నాం. వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌తో దేశం మరింత బలపడుతుంది. వన్‌ నేషన్‌ - వన్‌ రేషన్‌తో పేద ప్రజలకు మేలు జరుగుతోంది. త్వరలోనే వన్‌ నేషన్‌ - వన్‌ సివిల్‌ కోడ్‌ తీసుకొస్తాం. దాంతో దేశంలో వివక్షకు తెరపడుతుంది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించం. ఉక్కుపాదం మోపుతాం' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

'ఇంతకుముందు దేశంలో వివిధ పన్ను వ్యవస్థలు ఉండేవి. మేము వన్ నేషన్ వన్ టాక్స్ సిస్టమ్ జీఎస్టీని సృష్టించాము. మేము వన్ నేషన్ వన్ పవర్ గ్రిడ్‌తో దేశ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ద్వారా పేదలకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఏకీకృతం చేశాం. ఆయుష్మాన్ భారత్ రూపంలో దేశంలోని ప్రజలకు.. ఒకే దేశం ఒకే ఆరోగ్య బీమా సౌకర్యాన్ని అందించాం" అని మోదీ వివరించారు.

కుట్రలు జరుగుతున్నాయి..

దేశంలో గందరగోళ పరిస్థితులను సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. తమ పాలనలో వారి కుట్రలు సాగవని స్పష్టం చేశారు. 'ఎన్డీఏ నేతృత్వంలో సుపరిపాలన అందిస్తున్నాం. గత ప్రభుత్వాల విధానాలు ఐక్యతా భావాన్ని బలహీనపరిచాయి. ఐక్యతను దెబ్బతీసేందుకు బయటి, లోపలి శక్తులు కుట్రలు చేస్తున్నాయి. దేశ ప్రగతి కోసమే ఆర్టికల్‌ 370ని రద్దు చేశాం. స్థానిక భాషల అభివృద్ధికి కేంద్రం అండగా ఉంటుంది' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Whats_app_banner