Haryana: హర్యానా ‘హస్త’గతమే; పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి-peoples pulse survey predicts congress big victory in haryana assembly elections ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Haryana: హర్యానా ‘హస్త’గతమే; పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి

Haryana: హర్యానా ‘హస్త’గతమే; పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి

Sudarshan V HT Telugu
Oct 05, 2024 06:40 PM IST

హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పీపుల్స్‌పల్స్‌ సర్వేలో తేలింది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 55, బీజేపీ 26 , ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ 0-1, ఇండిపెండెంట్లు 3-5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది.

హరియాణా ఎగ్జిట్ పోల్స్
హరియాణా ఎగ్జిట్ పోల్స్

హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని పీపుల్స్‌పల్స్‌ సర్వేలో తేలింది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 55, బీజేపీ 26 , ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ 0-1, ఇండిపెండెంట్లు 3-5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. మొత్తం 90 స్థానాలు ఉన్న హర్యానాలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 46 సీట్లు గెలవాలి.

కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యత

కాంగ్రెస్‌ పార్టీ, తన ప్రత్యర్థి బిజెపిపై 7-8 శాతం ఓట్ల ఆధిక్యత ప్రదర్శించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సంస్థ వెల్లడించింది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 45 శాతం, బీజేపీకి 38 శాతం, ఐఎన్ఎల్డి-బీఎస్పీ కూటమి 5.2 శాతం, ఆప్ 1 శాతం, జేజేపీ ఒక్క శాతం లోపు, ఇతరులకు 10 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి ఎవరు?

రాష్ట్రంలో సీఎం ఎవరు కావాలన్న ప్రశ్నకు సీఎల్పీ లీడర్ భూపీందర్ సింగ్ హూడాకు 39 శాతం ఓటర్లు మద్దతు పలికారు. సిట్టింగ్ సీఎం నయాబ్ సింగ్ సైనీకి 28 శాతం, కాంగ్రెస్ ఎంపీ కుమారీ సెల్జాకు 10 శాతం, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు 6 శాతం మంది మద్దతు ఇచ్చారు. హర్యానాలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ (congress) ల మధ్యే పోటీ ఉంది. ప్రాంతీయ పార్టీలు ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జననాయక్ జనతా పార్టీలు ఈ ఎన్నికల్లో కొంత బలహీనపడ్డట్టు తెలుస్తోంది.

స్థానిక అంశాలు కీలకం

ఈ ఎన్నికల్లో స్థానిక అంశాలు కీలకపాత్ర పోషించాయి. స్థానిక ఎమ్మెల్యే పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల ఆధారంగా ప్రజలు ఓటు వేశారు. ఓటర్లు జాతీయ అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రధాని మోదీ ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపించలేదని పీపుల్స్ పల్స్ సర్వే అభిప్రాయపడింది. నిరుద్యోగం, అగ్నీవీర్ పథకం, రైతు సమస్యలు, ధరల పెరుగుదల మొదలైనవి హరియాణాలో ప్రధాన సమస్యలుగా కనిపించాయి. పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు రాష్ట్రంలో రైతులు, రెజ్లర్లు, యువత బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయింది.

Whats_app_banner