NIRF 2024 Rankings : మళ్లీ ఐఐటీ మద్రాస్ నెంబర్ 1.. అత్యుత్తమ విద్యాసంస్థల టాప్ 10 లిస్ట్-nirf 2024 rankings iit madras secures top spot in overall category for the 6th time in a row check top 10 list here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nirf 2024 Rankings : మళ్లీ ఐఐటీ మద్రాస్ నెంబర్ 1.. అత్యుత్తమ విద్యాసంస్థల టాప్ 10 లిస్ట్

NIRF 2024 Rankings : మళ్లీ ఐఐటీ మద్రాస్ నెంబర్ 1.. అత్యుత్తమ విద్యాసంస్థల టాప్ 10 లిస్ట్

Anand Sai HT Telugu
Aug 12, 2024 04:21 PM IST

NIRF 2024 Rankings : అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో మళ్లీ ఐఐటీ మద్రాస్ టాప్‌గా నిలిచింది. ఈ విద్యాసంస్థ వరుసగా ఆరోసారి తన ర్యాంకును అలాగే నిలుపుకున్నది. విద్యా మంత్రిత్వ శాఖ ఈ మేరకు ర్యాంకింగ్స్ ప్రకటించింది. అయితే ఈ జాబితాలో టాప్ 10 విద్యా సంస్థలు ఏవో చూద్దాం..

అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ టాప్
అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ టాప్ (HT_PRINT)

విద్యా మంత్రిత్వ శాఖ, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(NIRF) 2024 ర్యాంకింగ్‌లను ఆగస్టు 12న విడుదల చేసింది. NIRF ర్యాంకింగ్‌లు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. మీరు వెళ్లి చూడవచ్చు. nirfindia.orgలో జాబితాలను పరిశీలించవచ్చు. విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) ర్యాంకింగ్‌లను మెడికల్, ఇంజనీరింగ్, లా, మేనేజ్‌మెంట్, డెంటల్, ఫార్మసీ.. సహా 16 విభాగాలలో విడుదల చేస్తుంది.

నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) తొమ్మిదో ఎడిషన్ నివేదిక ప్రకారం, మొత్తం కేటగిరీలో టాప్ 10 కాలేజీలలో 7 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు స్థానం సంపాదించాయి. ముఖ్యంగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలలో మొత్తం విభాగంలో ఆరోసారి తన ర్యాంకింగ్‌ను కొనసాగించింది.

ఈ ర్యాంకింగ్‌లు విద్యాసంస్థల గురించి సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడంలో తల్లిదండ్రులు, విద్యార్థులకు ఉపయోగపడతాయి. ఈ పద్ధతి ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడం, విశ్వవిద్యాలయాలు, కళాశాలలను ప్రోత్సహించడం, భారతదేశంలో ఉన్నత విద్య మొత్తం నాణ్యతను పెంపొందించడానికి దోహదపడుతుంది.

టాప్ 10 విద్యా సంస్థలు ఇవే

ర్యాంక్ 1: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్

ర్యాంక్ 2: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు

ర్యాంక్ 3: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి

ర్యాంక్ 4: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ

ర్యాంక్ 5: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్

ర్యాంక్ 6: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్‌పూర్

ర్యాంక్ 7: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ

ర్యాంక్ 8: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ

ర్యాంక్ 9: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గౌహతి

ర్యాంక్ 10: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ

పారదర్శకతను పెంపొందించడానికి, పోటీని పెంపొందించడానికి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని విద్యా మంత్రిత్వ శాఖ దేశంలోని ఉన్నత విద్యా సంస్థలను పరిశీలించి ర్యాంక్ చేస్తుంది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం NIRF ర్యాంకింగ్ బోధన-అభ్యాసం, వనరులు, పరిశోధన, వృత్తిపరమైన అభ్యాసం, గ్రాడ్యుయేషన్ ఫలితం, ఔట్రీచ్, చేరిక, మొత్తం విద్యా సంస్థ అభివృద్ధిలాంటి అంశాలను పరిశీలిస్తుంది.

100 శాతం వెయిటేజీ ఇలా లెక్కిస్తారు

బోధన-అభ్యాసం, వనరుల కోసం 30 శాతం. పరిశోధన, వృత్తిపరమైన అభ్యాసం కోసం 30 శాతం, గ్రాడ్యుయేషన్ ఫలితాల కోసం 20 శాతం. ఔట్‌రీచ్, ఇన్‌క్లూసివిటీ మరియు పర్సెప్షన్ కోసం ఒక్కొక్కటి 10 శాతంగా చూసి లెక్కిస్తారు. తర్వాత ర్యాంకులు ప్రకటిస్తారు. చాలా ఏళ్లుగా ఐఐటీ మద్రాస్ NIRF ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలుస్తూ వస్తుంది.

టాపిక్