NIRF rankings 2023 : అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్​ మళ్లీ టాప్​!-nirf rankings 2023 iit m topped for the fifth time see full list here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nirf Rankings 2023 : అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్​ మళ్లీ టాప్​!

NIRF rankings 2023 : అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్​ మళ్లీ టాప్​!

Sharath Chitturi HT Telugu
Jun 05, 2023 03:20 PM IST

NIRF rankings 2023 : అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్​ మళ్లీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. ఈ మేరకు ఎన్​ఐఆర్​ఎఫ్​ ర్యాంకింగ్స్​లో తేలింది. టాప్​ 10 విద్యాసంస్థల్లో 8 ఐఐటీలే ఉన్నాయి.

అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్​ మళ్లీ టాప్​!
అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్​ మళ్లీ టాప్​! (HT_PRINT)

NIRF rankings 2023 : నేషనల్​ ఇన్​స్టిట్యూనల్​ ర్యాంకింగ్స్​ ఫ్రేమ్​వర్క్ (ఎన్​ఐఆర్​ఎఫ్​)​ 8వ ఎడిషన్​ను కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి రాజ్​కుమార్​ రంజన్​ సింగ్​ సోమవారం విడుదల చేశారు. దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్​ తొలిస్థానాన్ని మరోమారు దక్కించుకుంది. మొదటి స్థానంలో ఐఐటీఎం ఐదేళ్లుగా కొనసాగుతుండటం విశేషం. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటీ ఢిల్లీ.. రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. వీటితో పాటు తొలి 10 స్థానాల్లో మొత్తం 8 ఐఐటీలు (బాంబే, కాన్పూర్​, ఖరగ్​పూర్​, రూర్కీ, గౌహతి) చోటు సంపాదించుకున్నాయి. మరోవైపు 6, 10 స్థానాల్లో ఆల్​ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​, జవహర్​లాల్​ నెహ్రూ యూనివర్సిటీలు ఉన్నాయి.

మొదటి స్థానం దక్కడంపై ఐఐటీ ఎం డైరక్టర్​ వీ కామకోటి హర్షం వ్యక్తం చేశారు.

13 కేటగిరీలు.. 8686 అప్లికేషన్లు..

ఓవరాల్, యూనివర్సిటీ, కాలేజీలు, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ, లా, మెడికల్, ఆర్కిటెక్చర్, డెంటల్, రీసెర్చ్ కేటగిరీలకు సంబంధించి 13 కేటగిరీల్లో విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్​ ఇచ్చారు. అభ్యాసం, బోధన, వనరులు, పరిశోధన, వృత్తిపరమైన అభ్యాసం, గ్రాడ్యుయేషన్ ఫలితం, ఔట్ రీచ్, చేరిక, తదితర అంశాల ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయిస్తుంటారు. వివిధ కేటగిరీలకు ఈ ఏడాది 8,686 అప్లికేషన్లు వచ్చాయి. గతేడాది ఈ సంఖ్య 7,254గా ఉంది.

ఇక యూనివర్శిటీ కేటగిరీలో ఐఐఎస్‌సీ బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా.. జేఎన్‌యూ, జామియా మిలియా ఇస్లామియా, జాదవ్‌పూర్ వర్సిటీ, బనారస్​ హిందూ విశ్వవిద్యాలయం తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కాలేజీ కేటగిరీలో మిరాండా హౌస్ అగ్రస్థానాన్ని కొనసాగిస్తోంది. హిందూ కళాశాల రెండో ర్యాంక్‌ను కైవసం చేసుకోగా.. చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాల మూడో స్థానంలో నిలిచింది. కోయంబత్తూర్​ మహిళల కళాశాల, కోల్​కతా సెంట్​ జేవియర్స్​, ఢిల్లీ ఆత్మారామ్​ సనాతన్​ కళాశాల, చెన్నై లయోలా కాలేజ్​ వంటివి టాప్​ కాలేజ్​లుగా ఉన్నాయి.

మేనేజ్​మెంట్​.. మెడికల్​..

మేనేజ్​మెంట్​ కేటగిరీలో ఐఐఎం అహ్మదాబాద్​ టాప్​లో నిలిచింది. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజికోడ్​, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబేలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మెడికల్​ కేటగిరీలో ఎయిమ్స్- ఢిల్లీ ఉత్తమ వైద్య కళాశాలగా పేరు తెచ్చుకుంది. బెంగళూరులోని నేషనల్​ లా స్కూల్​ ఆఫ్​ ఇండియా యూనివర్సిటీ.. లా కేటగిరీలో టాప్​లో నిలిచింది. ఇన్నోవేటివ్​ కేటగిరీలో ఐఐటీ కాన్పూర్​ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం