NEET UG : ఇక నుంచి ఆన్​లైన్​ విధానంలో నీట్​ యూజీ! కేంద్రం కీలక నిర్ణయం!-neet ug likely to be held in online mode centre to take decision soon ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Ug : ఇక నుంచి ఆన్​లైన్​ విధానంలో నీట్​ యూజీ! కేంద్రం కీలక నిర్ణయం!

NEET UG : ఇక నుంచి ఆన్​లైన్​ విధానంలో నీట్​ యూజీ! కేంద్రం కీలక నిర్ణయం!

Sharath Chitturi HT Telugu
Jul 09, 2024 06:40 AM IST

ప్రస్తుతం ఆఫ్​లైన్​ మోడ్​లో జరుగుతున్న నీట్​ యూజీ పరీక్షను ఆన్​లైన్​ మోడ్​కి షిఫ్ట్​ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. కానీ అది అంత సులభం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

నీట్​ పేపర్​ లీక్​కి వ్యతిరేకంగా నిరసనలు..
నీట్​ పేపర్​ లీక్​కి వ్యతిరేకంగా నిరసనలు..

నీట్​ యూజీ పేపర్​ లీక్​ వ్యవహారంపై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ విషయంపై నిరసనలు కొనసాగుతున్నాయి. కాగా ఈ పరీక్షకు సంబంధించిన అన్ని అంశాలను ప్రక్షాళన చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా నీట్​ యూజీని ఇక నుంచి కంప్యూటర్​ ఆధారిత ఆన్​లైన్​ విధానంలో నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం జేఈఈ పరీక్షల తరహాలోనే నీట్​ని కూడా నిర్వహించాలని యోచినట్టు తెలుస్తోంది. అయితే అది అంత సులభం కాదని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక నుంచి ఆన్​లైన్​లో నీట్​ యూజీ పరీక్ష..!

నీట్​ యూజీ పరీక్ష విధానంలో మార్పులు చేసే పనిని అప్పగించిన సంబంధిత కమిటీలో ఈ ఆలోచన చక్కర్లు కొడుతోందని సమాచారం. కానీ ఈ విషయంపై ఇంతవరకు అధికారిక ఆదేశాలు జారీ అవ్వలేదు. ఇటీవల పోటీ పరీక్షల (నీట్-యూజీ, ఇతర పరీక్షలు) చుట్టూ ఉన్న వివాదం ఈ పరీక్షలను ఆన్​లైన్​లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందనే ఆలోచనకు మరింత ఆజ్యం పోసింది అని పేరు చెప్పడానికి ఇష్టపడని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

అయితే 2024లో దాదాపు 2.3 మిలియన్ల మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనందున ఇది జరగడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసి, సరైన ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందని మరో అధికారి తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 4 వేల కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నామని, వారందరినీ కంప్యూటర్లు, సంబంధిత మౌలిక సదుపాయాలతో సన్నద్ధం చేయడం సవాలుతో కూడుకున్న విషయం అని అన్నారు. అయితే జేఈఈ మెయిన్స్ తరహాలో ఈ పరీక్షలను ఆన్​లైన్​లో నిర్వహించడం మంచిదనే వాదనను కొట్టిపారేయలేం అని స్పష్టం చేశారు.

ప్రస్తుతం నీట్-యూజీని ఆఫ్​లైన్​లో - పెన్ను, పేపర్ మోడ్​లో నిర్వహిస్తున్నారు. దీనిలో విద్యార్థులు ఓఎంఆర్ షీట్​పై మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను పరిష్కరించాల్సి ఉంటుంది.

దీని ఫార్మాట్​ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్​గా మార్చితే పరీక్ష రాసేందుకు కంప్యూటర్​ను ఉపయోగించి సాఫ్ట్ ఆన్సర్ షీట్ పై సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో అనేక పరీక్షలు ఈ ఆన్​లైన్​ మోడ్​లో నిర్వహిస్తున్నారు.

2024లో 570 కేంద్రాల్లో నిర్వహించిన జేఈఈ-మెయిన్స్​కు 1.4 మిలియన్ల మంది విద్యార్థులు హాజరయ్యారు. నీట్​, జేఈఈ రాసే వారి సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉంది. అందుకే ఆన్​లైన్​లో పరీక్ష నిర్వహణ కాస్త సవాలుతో కూడుకున్న విషయం.

దిల్లీ ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎంసీ మిశ్రా సైతం కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు మొగ్గు చూపారు. లొసుగులను సరిదిద్దడానికి ఆన్​లైన్​లో పరీక్ష రాయడం ఒక్కటే మార్గమన్నారు. ప్రపంచం మొత్తం కంప్యూటర్ ఆధారిత పరీక్షల వైపు అడుగులు వేస్తున్నప్పుడు ఆఫ్​లైన్​ మోడ్​ని కొనసాగించడంలో అర్థం లేదని, కానీ ఈ స్థాయిలో పరీక్ష నిర్వహించడం అంత సులభం కాదని అభిప్రాయపడ్డారు. కాబట్టి వారు ఐఐటిల మాదిరిగా దశలవారీగా పరీక్షను నిర్వహించడం, ప్రాంతీయ ప్రశ్నాపత్రాలను తయారు చేయడం వంటి మెరుగైన పద్ధతిల్లో విధివిధానాలను రూపొందించాల్సి ఉంటుంది, అని ఆయన అన్నారు.

ప్రస్తుతానికి దీనిపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

WhatsApp channel

సంబంధిత కథనం